Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పెదాలను చూస్తే ఎదుటి వాళ్ల క్యారెక్టర్ తెలిసిపోతుందా ?
మీకు తెలుసా ఒక వ్యక్తి క్యారెక్టర్ తెలుసుకోవాలంటే వాళ్ల పెదాలు గమనిస్తే సరిపోతుందని ? చైనీస్ స్టడీస్ ప్రకారం పెదాల ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి స్వభావం ఈజీగా కనిపెట్టవచ్చు. దీన్ని లిప్ రీడింగ్ అంటారు. అదే శాస్త్రీయ భాషలో లిపాలజీ అంటారు. దీని ప్రకారం పెదాల ఆకారం, సైజ్, ఫుల్ నెస్, పెదాల చివర్లను బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. పైపెదవి మధ్యభాగాన్ని బట్టి, పెదవి సైజుని బట్టి ఆ వ్యక్తి విలక్షణతలు కనుక్కోవచ్చు.
READ MORE: మీ పర్సనాలిటీ గురించి మీ ఐబ్రోస్ ఏం చెబుతున్నాయి ?
ముఖ భావాలలో పెదాలు ఒక భాగం. చూడగానే ముందుగా ఆకట్టుకునేవి పెదాలే. ముఖాన్ని చూసి లేదా కళ్లను బట్టి ఎదుటివ్యక్తి క్యారెక్టర్ ని అంచనా వేయడం వింటూ ఉంటాం. కానీ పెదాల ద్వారా పర్సనాలిటీ చెప్పడం కాస్త విభిన్నమే కదా. కాబట్టి లిపాలజీ ఆధారంగా మీ పెదాలు మీ క్యారెక్టర్ ని ఎలా వివరిస్తున్నాయో చెక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ పై కూడా ఓ అంచనాకు వచ్చే సత్తా మీ సొంతం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్టోరీలోకి ఎంటర్ అయిపోండి.

హార్ట్ షేప్
హార్ట్ షేప్ లిప్స్ కలిగిన వ్యక్తి కొత్త ఐడియాలు, కొత్త కొత్త ఆలోచనలు, సృజనాత్మకతతో ఆలోచిస్తాడు. తొందరగా ఆలోచించే గుణం వీళ్లకు ప్లస్ పాయింట్. తమ అభిప్రాయాలు, ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. అంతేకాదు వీళ్లు చాలా రొమాంటిక్ కూడా.

ఫుల్ లేదా బొద్దుగా ఉండే లిప్స్
ఫుల్ లిప్స్ లేదా బొద్దుగా ఉండే పెదాలు కలిగిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు. ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ల గురించి కేర్ తీసుకుంటారు. వీళ్లు చాలా ఉదార స్వభావులై ఉంటారు. ఈజీగా స్నేహితులను చేసుకుంటారు.

వైడ్ లిప్స్ లేదా వెడల్పాటి పెదాలు
వెడల్పాటి పెదాలు కలిగిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్లు. వివిధ రకాల యాక్టివిటీస్ లో పాల్గొనడానికి చాలా ఆసక్తికనబరుస్తారు. వీళ్లు త్వరగా అందరితో కలిసిపోతారు. ఎక్కడైనా సర్దుకుపోతారు. వీళ్లకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది.

సన్నని పెదాలు
సన్నని పెదాలు కలిగిన వ్యక్తులు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. వీళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీళ్లు చాలా జాగ్రత్తగా, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. సన్నని పెదాలు ఉన్న మహిళలు ఇండిపెండెంట్ గా ఉంటారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలాగే చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు.

గుండ్రటి పెదాలు
గుండ్రటి పెదాలు కలిగిన వ్యక్తులు ఎదుటివాళ్లను ఆకట్టుకుంటారు. అలాగే వీళ్లు చాలా సాహసప్రియులు. గుండ్రటి పెదాలు కలిగిన మహిళలు చాలా కాన్ఫిడెంట్ తో ఉంటారు. ఎలాంటి టాస్క్ లనైనా తీసుకోవడానికి ఇష్టపడతారు. భవిష్యత్ పైనా, సక్సెస్ పైనే దృష్టిపెడతారు. గతం గురించి పట్టించుకోరు.

మధ్యలో బొద్దుగా ఉంటే
పెదాల మధ్యలో బొద్దుగా ఉండే వాళ్ల స్వభావాన్ని దేవుడిచ్చిన బహుమతిగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ల స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫేమస్ అవుతూ ఉంటారు. వీళ్లు ఎక్కడైనా, ఎప్పుడైనా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటారు. చాలా జాలీగా, ప్రేమగా, ఫన్నీగా ఉండటాన్ని వీళ్లు ఎక్కువగా ఇష్టపడతారు.

సిమిట్రిక్ లిప్స్
చాలా అరుదుగా కనిపించే ఈ లిప్స్ లో థిన్, థిక్ రెండూ కలిసి ఉంటాయి. ఇలా ఉండే పెదాలు చాలా పర్ఫెక్ట్ లుక్ ని ఇస్తాయి. వీళ్లు చాలా గొప్ప స్వభావాన్ని కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులతో కలిసిపోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అలాగే వీళ్ల స్నేహితుల సర్కిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications