Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
జంక్ ఫుడ్ అంటే ఇండియన్స్ కి ఎంతకంత క్రేజ్
జంక్ ఫుడ్ ఇది అంటే నచ్చని వాళ్లు ఉండరేమో. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. బయటకు వెళ్తే చాలు పిజ్జాలు, బర్గర్లు అంటూ రకరకాల జంక్ ఫుడ్ లపైనే మోజు పెంచుకుంటున్నారు. టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఏదో లాగే జంక్ ఫుడ్ తినడం బాగా అలవాటు చేసుకుంటున్నారు.
READ MORE: ఇన్ స్టాంట్ నూడుల్స్ ను నివారణకు 10 కారణాలు!
ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఆహారమేంటో తెలుసా ? ఇంకేముంది జంక్ ఫుడ్. అవును జంక్ ఫుడ్ ఇండియన్స్ కి చాలా ప్రీతికరమైన ఆహారం. జంక్ ఫుడ్ లో క్యాలరీలు, పిండిపదార్థాలు, కొవ్వు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ.. ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు కారణమౌతాయి.
90 శాతం మంది ఇండియన్స్ కి జంగ్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసు.. కానీ.. అవి తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. హెల్తీ ఫుడ్ వండుకోవడానికి బద్దకించినవాళ్లకు జంక్ ఫుడ్ నిత్యావసరంగా మారిందని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా వండుకోలేక ఈజీగా దొరికే జంక్ ఫుడ్ తో సరిపెట్టుకుంటున్నారు.
READ MORE: గర్భాధారణ సమయంలో తినకూడని.. తినవల్సిన ఆహారాలు...!
నిత్యం జంక్ ఫుడ్ కి అలవాటు పడటం, తినడం వల్ల ఒబేసిటీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, డయాబెటీస్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. జంక్ ఫుడ్ లో వాడే పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. చీజ్ బర్గర్లు, పిజ్జాలు నిత్యం తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ వల్ల ఎన్నో అనర్థాలున్నాయని తెలిసి కూడా వాడి మీద మోజు మాత్రం తగ్గించుకోలేకపోతున్నారు. ఇండియన్స్ జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడటానికి కారణాలేంటో చూసేయండి..

బద్దకం
ఈ జనరేషన్ చాలా లేజీగా తయారైంది. అందుకే.. మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకుని వండుకునే ఓపిక లేక.. అందుబాటులో ఉన్న జంక్ ఫుడ్ తినేయడం అలవాటు చేసుకున్నారు.

తక్కువ సమయం
జంక్ ఫుడ్ అయితే ఈజీగా కడుపునింపుతుంది. దీనికోసం ఎక్కువ సమయం వేచిచూడాల్సిన అవసరం లేదు. నింపాదిగా క్యూలో నిల్చుంటే చాలు.. మీ కడుపు నింపే, మీకునచ్చే జంక్ ఫుడ్ వచ్చేస్తుంది.

యాడ్స్
ఇండియన్స్ జంక్ ఫుడ్ ఇష్టపడటానికి కారణాల్లో యాడ్స్ కూడా ఒకటి. వీటిని చూడగానే ఆకట్టుకునేలా.. నోరూరించేలా ఉంటాయి. అంతే.. వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. ఎక్కుడ చూసినా.. రారమ్మంటూ నోరూరించే జంక్ ఫుడ్ యాడ్స్ కి ఇండియన్స్ అడిక్ట్ అవుతున్నారు.

జంక్ ఫుడ్ తోనే ఆనందం
జంక్ ఫుడ్ లో ఉండే పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి. కడుపునిండినా ఇంకా తినాలిపిస్తాయి. కాబట్టి.. ఇండియన్స్ జంక్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడతారు.

క్యాంటిటీ
కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి బిజినెస్ ట్రిక్స్ లో భాగంగా.. జంక్ ఫుడ్ ఎక్కువ మోతాదులో ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు కూల్ డ్రింక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఇస్తారు. కాబట్టి ఇవి తినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇండియన్స్.

కొత్త రుచి
చాలా మంది ఇండియన్స్ బయట ఫుడ్ తినకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. దీంతో ఎప్పుడైనా టేస్ట్ చేంజ్ చేయడానికి జంక్ ఫుడ్ వైపు మనసుపారేసుకుంటే.. అంతే.. ఇక మళ్లీ మళ్లీ తినడానికి ఆసక్తి చూపుతారు.

ఈజీ ఫెసిలిటీస్
జంక్ ఫుడ్ చాలా ఈజీగా మనముందుకు వచ్చి చేరుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలన్నా.. వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ వంట చేయడానికి బోర్ కొట్టినా, లేజీగా అనిపించినా.. ఆన్ లైన్ లో ఒక్క ఆర్డర్ పెట్టేస్తే చాలు.. కోరుకున్న జంక్ ఫుడ్ ఇంటిముందుకు వచ్చేస్తుంది.
ఈజీగా, త్వరగా అందుబాటులో ఉన్న జంక్ ఫుడ్ కి ఇండియన్స్ అడిక్ట్ అవుతున్నారు.



Click it and Unblock the Notifications