Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పర్సనాలిటీ గురించి మీ ఐబ్రోస్ ఏం చెబుతున్నాయి ?
ఫేస్ రీడింగ్ ఎప్పటి నుంచే వింటున్న టెక్నిక్. ఫేస్ రీడింగ్ ముందుగా చైనాలో మొదలైంది. ఫేస్ రీడింగ్ ద్వారా మనుషుల క్యారెక్టర్, వాళ్ల భావాలు, ఫీలింగ్స్ ని పసిగట్టేవాళ్లు. తర్వాత చేతి రేఖలు, పుట్టిన నక్షత్రాల ప్రకారం వ్యక్తిత్వాన్ని చెబుతున్నారు.
READ MORE: నల్లని మరియు ఒత్తైన కనుబొమ్మలు పొందడానికి ఉత్తమ చిట్కాలు
ముఖంలో ఆకట్టుకునే వాటిలో ప్రధానమైనది ఐ బ్రో షేప్. కొంతమందికి కనుబొమ్మలే అసలైన ఎట్రాక్షన్. అయితే ఇప్పుడు మీ కనుబొమ్మల ఆకారాన్ని బట్టి వాళ్ల జీవితంలో ఎలాంటి సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో షేప్ లో ఐ బ్రోస్ ఉంటాయి. దాని ద్వారా వ్యక్తిని అంచనా వేయచ్చంటున్నారు. మరి మీ కనుబొమ్మ ఏం చెబుతోందో తెలుసుకోండి.

వంపుగా ఉండే కనుబొమ్మలు
సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తి ఐ బ్రోస్ వంపుగా ఉంటాయి. వీళ్లు ఎదుటి వాళ్లను త్వరగా అర్ధం చేసుకోగలుగుతారు. అయితే ప్రపంచం గురించి వాళ్ల అభిప్రాయాలు, అభిరుచులు ఇతరులకు బోర్ కొట్టిస్తాయి. కానీ వీళ్ల స్వభావం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.

స్ర్టెయిట్ ఐబ్రో
స్ర్టెయిట్ ఐ బ్రో ఉన్నవాళ్లు లాజిక్ గా ఆలోచిస్తారు. వీళ్ల నిర్ణయాలు కూడా హేతుబద్ధమైనవిగా ఉంటాయి. వీళ్లతో మాట్లాడాల్సి వస్తే.. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఎమోనల్ కి లోనవుతారు.

యాంగిల్డ్ ఐ బ్రో
కోణాకారంలో కనుబొమ్మలు ఉండే వాళ్లకు లీడర్ షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. ఇలాంటి ఐ బ్రోస్ ఉన్న వాళ్ల ఆలోచనలను, నిర్ణయాలను ఎదుటివాళ్ల వెంటనే అంగీకరిస్తారు. ఎందుకంటే.. వీళ్లు పూర్తీగా దానిమీద దృష్టికేంద్రీకరించి, రీసెర్చ్ చేసే నిర్ణయాలు చెబుతారని ఎదుటివాళ్లకు ఈ షేప్ ఐ బ్రో ఉన్నవాళ్ల మీద నమ్మకం. ఈ వ్యక్తులతో ఒకసారి పరిచయం ఏర్పడిందంటే.. అది చాలా కాలం కొనసాగుతుంది. అంతేకాదు.. చాలా ప్రత్యేకమైన వాళ్లుగా గుర్తిస్తారు.

కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే
కనుబొమ్మలు చాలా ఒత్తుగా ఉండే వాళ్లు మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. వీళ్లు నిర్విరామంగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్లు మల్టీ టాస్క్ చేయగలుగుతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేసే సత్తా వీళ్లకు ఉంటుంది. వీళ్లు ఇష్టపడే వ్యక్తులపై చాలా ఉదారంగా వ్యవహరిస్తారు.

థిన్ ఐబ్రోస్
పెన్సిల్ లైన్ మాదిరిగా.. చాలా పలుచగా, సన్నగా ఉంటాయి కనుబొమ్మలు. థిన్ ఐబ్రోస్ ఎక్కువగా స్త్రీలలో ఉంటాయి. వీళ్లు మంచి ఫలితాలు ఇచ్చే వాటిపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. థిక్ ఐబ్రోస్ వాళ్లతో పోల్చితే వీళ్లు ఎక్కువగా ఆవేశానికి లోనవుతుంటటారు. తమ ఇష్టాల గురించి ఎక్కువగా పట్టించుకోరు.

వింగ్డ్ ఐబ్రోస్
వింగ్డ్ ఐబ్రోస్ అంటే.. స్టార్టింగ్ పాయింట్ లో మందంగా ఉండి.. చివరకు వెళ్లే సరికి పలుచగా మారిన కనుబొమ్మలను వింగ్డ్ ఐబ్రోస్ అంటారు. చాలా ఆర్గనైజ్ గా, భిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ప్లానింగ్ కమిటీలో వీళ్లు బాగా రాణించగలుగుతారు. ప్రణాళికలు రూపొందించడంలో చాలా పవర్ ఫుల్ గా ఉంటారు.

మ్యానేజిరియల్ ఐబ్రోస్
మ్యానేజిరియల్ ఐబ్రోస్ వింగ్డ్ ఐబ్రోస్ కి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో పలుచగా.. చివర్లకు వెళ్లే సరికి మందంగా ఉంటాయి వీళ్ల కనుబొమ్మల ఆకారం. వీళ్లకు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా టాస్క్ ఇస్తే అంగీకరించడానికి, మొదలుపెట్టడానికి వీళ్లకు చాలా సమయం పడుతుంది. ఒక్కసారి టాస్క్ పై కమిట్ అయితే.. పూర్తయ్యే వరకు వదిలిపెట్టకుండా పూర్తిచేస్తారు.

కనుబొమ్మల మధ్య గ్యాప్
రెండు కనుబొమ్మల మధ్యలో చాలా గ్యాప్ ఉంటే.. వీళ్లు చాలా సంతోషంగా ఉంటారు.

రెండు దగ్గరగా ఉంటే
రెండు కనుబొమ్మల ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉంటే.. వాళ్లకు ఆలోచనలు చాలా ఎక్కువ. ఆలోచనలను పక్కనపెట్టలేకపోతారు. రిలాక్స్ గా ఉండలేరు. దీంతో వీళ్ల నిద్రపై ప్రభావం పడుతుంది. ధ్యానం చేయడం మంచిది. ఎంత ఆలోచించినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది.

హై ఆన్ ది హెడ్
తల పైభాగానికి దగ్గరగా ఐబ్రోస్ ఉండేవాళ్లు వెయిట్ అండ్ సీ అన్న మెంటాలిటీతో ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు వీళ్లు త్వరగా నిర్ణయం తీసుకోలేరు. ఒకే వస్తువును అనేక షాపుల్లో చూసి సెలెక్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రోద్భలంతో నిర్ణయం తీసుకున్నా.. అది నిరాశాజనకంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications