Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
ఇండియాలో తప్ప చాలా దేశాల్లో బ్యాన్ చేసిన ఫుడ్స్, డ్రింక్స్..!!
మనం తింటున్న ఆహారం హెల్తీయేనా ? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా ? ఎందుకంటే.. మనం మన ఇండియన్స్ తినే కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ ని విదేశాల్లో నిషేధించారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మనం తినే కొన్ని ఆహారాలు కనీసం అందుబాటులో కూడా లేకుండా నిషేధించారట.
మనం ఎంతో ఇష్టంగా తీసుకునే కొన్ని ఆహారాలను.. వివిధ దేశాల్లో ఎందుకు నిషేధించారు ? ఏ ఆహారాలను విదేశాల్లో నిషేధించారో తెలిస్తే.. మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామనేది తెలుస్తుంది. అలాగే మన ఆహారపు అలవాట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో కూడా తెలుస్తుంది.
మన భారతీయులు మాత్రమే ఆలోచించకుండా చేసే 8రకాల పనులు
మనం స్నాక్స్ రూపంలో, బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకునే ఎంతో రుచికరమైన ఆహారాలను విదేశాల్లో బ్యాన్ చేశారు. ఈ ఆహారాలేంటో తెలిస్తే.. మీరు షాక్ అవుతారు. మరి ఇండియన్స్ తినే ఎలాంటి ఆహారాలను.. విదేశాల్లో బ్యాన్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..

సమోసా
సమోసా అంటే.. ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరేమో. కానీ.. సమోసాను సొమాలియాలో నిషేధించారు. అయితే దీనికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సమోసా ఉండే త్రిభుజాకారం క్రిస్టియన్స్ కి సంకేతంగా ఉందని.. దీన్ని ఇస్లామిక్ గ్రూప్ అల్ శబాబ్ సమోసాను దేశం నుంచే నిషేధించింది.

టమోటా కెచప్
ఫ్రాన్స్ లోని స్కూల్స్ లో టమోటా కెచప్ ని అనుమతించరట. టమోటా కెచప్ ఫ్లేవర్... ఫ్రెంచ్ పాకశాస్త్రంలో, ట్రెడిషనల్ ఫుడ్ కి సాంస్కృతిక ముప్పు తీసుకొస్తాయని భావించి దీన్ని స్కూల్స్ లో అనుమతించదు.

కిండర్ జాయ్
అమెరికాలో కిండర్ జాయ్ ని నిషేధించారు. కిండర్ జాయ్ ప్లాస్టిక్ బొమ్మ రూపంలో వస్తుందని.. పిల్లలు దాన్ని కూడా తినే ప్రమాదం ఉందని భావించిన అమెరికా అధికారులు దాన్ని నిషేధించారు.

చూయింగ్ గమ్
సింగపూర్ లో చూయింగ్ గమ్ ని బ్యాన్ చేశారు. సింగపూర్ రోడ్లపై ఎవరైనా చూయింగ్ గమ్ ఉమ్మేస్తే.. 32 వేల రూపాయలు జరిమానా విధిస్తారట. అందుకే.. దీన్ని సింగపూర్ లో నిషేధించారు. సింగపూర్ వీధులు, రోడ్లు శుభ్రంగా ఉంటాయని ఈ రూల్ పెట్టారు.

బాదాం
బాదాం హెల్తీయే కదా.. వీటిని ఎందుకు బ్యాన్ చేశారు అని ఆలోచిస్తున్నారా ? నిజమే పచ్చి బాదాం అమ్మడం క్యాలిఫోర్నియాలో నిషేధమట. పచ్చి బాదాం బ్యాక్టీరియాకి కారణమవుతాయి. దీనివల్ల క్యాలిఫోర్నియాలో వీటిని బ్యాన్ చేశారు.

మౌంటెయిన్ డ్యూ
మౌంటెయిన్ డ్యూ డ్రింక్ ని ఒకటి కాదు రెండు కాదు.. వందకు పైగా దేశాల్లో బ్యాన్ చేశారు. ఈ డ్రింక్ లో బ్రోమిన్ వెజిటబుల్ ఆయిల్ ఉండటం వల్ల .. ఇది మెమరీ లాస్, అలసటకు కారణమవుతుందని భావించి.. దీన్ని విదేశాల్లో నిషేధించారు.

పచ్చి పాలు
అమెరికాలోని కెనడాలో పచ్చి పాలను బ్యాన్ చేశారు. పచ్చి బాదాం లాగే.. పచ్చి పాలను కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నిషేధించారు. ఇందులో ఉండే బ్యాక్టీరియానే నిషేధానికి కారణం.

జెల్లీ స్వీట్స్
జెల్లీ స్వీట్స్ అంటే.. పిల్లలు చాలా ఇష్టపడతారు. కానీ.. వీటి అమ్మకాలు యూకే, ఈయూలో నిషేధించారు. వీటిల్లో ఉండే మందమైన పదార్థాన్ని కొంజక్ అని పిలుస్తారు. ఇది పిల్లలకు సేఫ్ కాదు.

అబ్సింతే
అబ్సింతే అనేది ఒక ఆల్కహాలిక్ డ్రింక్. దీన్ని యూఎస్, న్యూజిలాండ్, కెనడాలో బ్యాన్ చేశారు. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల హింసాత్మకంగా మారిన.. చెడు పనులు చేస్తారని భావించి.. దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు.

భంగ్
భంగ్ ని ఇండియా తప్ప చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఇందులో ఎక్కువ మోతాదులో కన్నాబిస్ అనే పదార్థం ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే.. ఈ భంగ్ ని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు.



Click it and Unblock the Notifications