Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
విదేశాల్లో పుట్టి ఇండియాలో ఇమేజ్ సంపాదించుకున్న స్టార్స్
ఇండియాలో పుట్టి పెరిగి.. విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వెళ్తూ ఉంటాం. కానీ విదేశాల్లో పుట్టి ఇండియాలో తమకంటూ.. ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. పుట్టింది ఇతర దేశాల్లో అయినా.. ఇండియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించారు. వాళ్లు నమ్ముకున్న ఇండస్ట్రీలో తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరు వాళ్లు ?
సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్..
మీకు తెలుసా బాలీవుడ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న కొంతమంది పాపులర్ స్టార్స్.. ఇండియాలో పుట్టలేదు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తారాస్థాయికి చేరిన పాపులర్ స్టార్స్ కొంతమంది విదేశాల్లో పుట్టినవాళ్లే. బాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి.. వాళ్లకు ఇక్కడ ఛాన్స్ దొరికింది. మరి విదేశాల్లో పుట్టి.. ఇండియాలో స్ట్రాంగ్ మార్క్ సంపాదించిన స్టార్స్ ఎవరో చూసేద్దామా..

దీపికా పదుకొనె
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె ఇండియాలో పుట్టలేదు. బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనె, ట్రావెల్ ఏజెంట్ ఉజ్వలా కూతురైన దీపికా.. కోపెన్ హాగెన్ లో పుట్టింది.

ఇమ్రాన్ ఖాన్
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఇండియాలో పుట్టలేదు. ఇమ్రాన్ అమెరికాలో పుట్టాడు. ఆ తర్వాత వాళ్ల తల్లిదండ్రులు విడాకులతో విడిపోయాక ఇండియాకు వచ్చారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఈ అందాల తార శ్రీలంకలో పుట్టింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ గార్జియస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించింది.

నర్గీస్ ఫక్రీ
నర్గీస్ ఫక్రీ.. న్యూయార్క్ లో పుట్టింది. మేరీ, మొహమ్మద్ ఫక్రీ కూతురు ఈ బ్యూటీ. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ హాట్ బ్యూటీగా మార్కులు కొట్టేసింది.

కత్రినా కైఫ్
కాశ్మీర్ కి చెందిన తండ్రి, బ్రిటీష్ కి చెందిన తల్లి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కత్రినా కైఫ్ హాంగ్ కాంగ్ లో పుట్టింది. ఈ ముద్దుగుమ్మ చాలా ప్రాంతాల్లో పెరిగింది. హవాయ్, లండన్ లలో పెరిగిన తర్వాత ముంబై కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ గా మార్కులు కొట్టేసింది.

ఎమీ జాక్సన్
బ్రిటీష్ చెందినది ఎమీ జాక్సన్. ఏక్ తా దివానా సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన బ్రిటీష్ మోడల్, నటి.. తర్వాత అనేక సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ బ్యూటీ.

సన్నీ లియోన్
కెనడియన్ పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్.. అడల్డ్ ఎంటర్ టైన్మెంట్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ కొన్ని అడల్ట్ సినిమాల్లో నటించి కుర్రకారుని మెప్పించింది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీగా క్రేజ్ సంపాదించింది ఈ పోర్న్ బ్యూటీ.

షరా జానె
2007లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ సంపాదించిన షరా జానె ఇండియన్ కాదు. ఈ ముద్దుగుమ్మ మస్కట్ లో పుట్టింది. టీనేజ్ పూర్తయ్యే వరకు అక్కడే పెరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది.

మోనికా డోగ్రా
ధోబి ఘట్ సినిమాలో కనిపించిన మోనికా డోగ్రా అమెరికన్. యాక్టింగ్ మాత్రమే కాదు.. ఈ ముద్దుగుమ్మ సింగర్ కూడా. మోనికా డోగ్రా.. న్యూయార్క్ లో పుట్టి.. బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది.

ఫావద్ ఖాన్
ఫావద్ అఫ్జల్ ఖాన్.. బాలీవుడ్ లో ప్రస్తుతం లీడ్ లో ఉన్నాడు. ఈ స్టార్ హీరో పాకిస్తాన్ లో పుట్టాడు. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ఇండియన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు.



Click it and Unblock the Notifications