For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడని పురాణాల్లోని పేర్లు..!

పురాణాల్లోని కొన్ని ఫేమస్ పేర్లను మాత్రం పిల్లలకు పెట్టరు. చాలా ధైర్యవంతులు, చమత్కారమైన, వాళ్ల పేర్లకు మంచి అర్థం ఉన్నా కూడా.. ఆ పేర్లను పిల్లలకు పెట్టరు. ఎందుకు ?

By Swathi
|

పౌరాణిక పాత్రల పేర్లను, పురాణాల్లో ప్రస్తావించే వ్యక్తుల పేర్లను పిల్లలకు పెట్టడానికి ఇండియన్ పేరెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తారు. కరన్, అర్జున్, అభిమన్యు, సురభి, సిద్ధార్థ, రాధిక వంటి పేర్లను పిల్లలకు పెడుతుంటారు. అలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు పిల్లలకు పెడితే.. వాళ్లలాంటి రూపం, వ్యక్తిత్వం వస్తాయని నమ్ముతారు. కానీ శకుని, దుర్యోధనుడు, సతీ వంటి పేర్లు ఎందుకు పెట్టరు ?

Mythological Names

కానీ పురాణాల్లోని కొన్ని ఫేమస్ పేర్లను మాత్రం పిల్లలకు పెట్టరు. చాలా ధైర్యవంతులు, చమత్కారమైన, వాళ్ల పేర్లకు మంచి అర్థం ఉన్నా కూడా.. ఆ పేర్లను పిల్లలకు పెట్టరు. ఎందుకంటే వాళ్ల తలరాత లాగే.. తమ పిల్లలకు కూడా ఉంటుందేమో అని భావిస్తారు. అలాగే కొన్ని క్యారెక్టర్ల పేర్లను పిల్లలకు పెట్టకపోవడమే మంచిది.

ఎందుకంటే.. పురాణాల్లో వాళ్ల వ్యక్తిత్వం కాస్త విభిన్నంగా, దేవుడికి వ్యతిరేకంగా, మానవత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో పెట్టని, పెట్టకూడని పురాణాల్లోని పేర్లేంటో ఇప్పుడు చూద్దాం..

అశ్వర్ధామా

అశ్వర్ధామా

గురు ద్రోణాచార్య కొడుకు అశ్వర్థామా. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో శాపానికి గురయ్యాడు. అభిమన్యు భార్య ఉత్తరపై బ్రహ్మాస్త్రం విసిరాడు. ఆ సమయంలో ఆమె గర్భిణీ. అది చూసిన క్రిష్ణుడు కలియుగం అంతమయ్యేంతవరకు భూమిలోనే బాధ అనుభవించమని శాపం విధించాడు. ఇలాంటి మనస్తత్వం ఉండటం వల్ల.. అశ్వర్థరామ పేరుని ఎవరికీ పెట్టకూడదు.

ద్రౌపది

ద్రౌపది

క్రిష్ణుడికి గొప్ప భక్తులురాలు, రాజ్యానికి రాణి అయినప్పటికీ ద్రౌపది పేరుని పిల్లలకు పెట్టకూడదు. తన వైవాహిక బంధాన్ని ఐదుమంది మగవాళ్లకు ఇవ్వడం వల్ల ఈ పేరుని పిల్లలకు పెట్టకూడదని సూచిస్తారు.

సుగ్రీవుడు

సుగ్రీవుడు

కోతి దేవుడైన సుగ్రీవుడు తన రాజ్యాన్ని కపట వంచన ద్వారా పొందాడు. అదికూడా తన సోదరుడు బలితో గొడవపడి సాధించుకున్నారు. రాముడి చేతిలో చనిపోయాడు. అందుకే.. సుగ్రీవుడి పేరుని పిల్లలకు పెట్టరు.

మండోదరి

మండోదరి

పురాణ గ్రంథాల ప్రకారం జాలి, దయ వంటి మంచి లక్షణాలు కలిగి ఉంటుంది మండోదరి. కానీ రాక్షసుడైన రావణుడిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ పేరుని పిల్లలకు పెట్టరు.

గాంధారి

గాంధారి

శ్రద్థాభక్తులు కలిగిన, గొప్ప, బలమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ. అయితే గుడ్డివాడైన ధృతరాష్ట్ర రాజుని పెళ్లి చేసుకుంది. రాక్షస రాజకీయాలతో చాలా ఇబ్బందులపాలైంది. ఆమె వంద మంది కొడుకులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. అందుకే ఈ పేరుని పిల్లలకు పెట్టకూడదు.

విభూషణుడు

విభూషణుడు

దూకుడు స్వభావం లేని వ్యక్తి అనే అర్థం కలిగి ఉంది విభూషణుడు. అంటే చాలా సున్నితంగా ఉంటాడని అర్థం. రాముడి గొప్ప భక్తుడైనా రావణుడి తమ్ముడు కావడంతో.. ఇతను అంత ప్రముఖుడు కాలేకపోయాడు. అందుకే.. ఈ పేరుని పిల్లలకు పెట్టడానికి ఆసక్తిచూపరు, పెట్టరు.

కైకేయి

కైకేయి

దశరథుడి భార్య కైకేయి. రాముడు అయోధ్య వదిలి అడవులకు వెళ్లడానికి కారణమైంది కాబట్టి కైకేయి పేరుని.. పిల్లలకు పెట్టకూడదు.

ధుర్యోదనుడు

ధుర్యోదనుడు

యుద్ధవిద్యలలో ఆరితేరిన దుర్యోదనుడు రాజ్యంపై అత్యాశ వల్ల చెడు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఈ పేరుని పిల్లలకు పెట్టకూడదు.

సతి

సతి

సింపుల్ గా, స్వీట్ గా ఉండే సతీ పేరుని కూడా పిల్లలకు పెట్టరు. ఏ ఇండియన్ అమ్మాయికీ ఈ పేరు ఉండటం చూసి ఉండరు. సీత, సత్య వంటి పేర్లు ఉన్నాయి కానీ.. సతీ అనే పేరు మాత్రం పెట్టరు. ఎందుకంటే.. హిందూ పురాణాల్లో తనను తాను అర్పించుకున్న వ్యక్తిత్వం. తన భర్త అవమానపరచడం వల్ల.. తనను తాను కాల్చుకుంది.

శకుని

శకుని

శకుని పథకాల వల్ల కురుక్షేత్ర యుద్ధానికి కారణమయింది. కాబట్ట శకుని పేరుని పిల్లలకు పెట్టకూడదు.

 మంథర

మంథర

కైకేయి డిమాండ్ వల్ల రాముడిని అడవులకు పంపించింది మంథర. కైకేయి తన తప్పుని తెలుసుకున్న తర్వాత మంథరను శిక్షించినట్టు, ఎప్పటికీ తన ముఖాన్ని చూపించవద్దని ఆగ్రహించినట్టు రామాయణం చెబుతుంది.

English summary

11 Famous Mythological Names that Indian Parents NEVER Keep for Their Children!

11 Famous Mythological Names that Indian Parents NEVER Keep for Their Children! Keeping mythological names for babies has always been a rage among Indian parents.
Story first published: Friday, December 9, 2016, 16:24 [IST]
Desktop Bottom Promotion