Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
షాక్: ఈ సంకేతాలు కనిపిస్తే.. త్వరలోనే మరణిస్తారట..!!
పురాతన గ్రంథం శివపురాణం.. చాలా ముఖ్యమైన విషయాలను వివరించింది. ఇందులో శివుడు వివరించిన విషయాలను వివరించారు. పురాణకథలు, సంప్రదాయాలు, విషయాలను.. తెలియజేశారు. అయితే.. ఈ శివపురాణంలో శివుడు చాలా ఆసక్తికరమైన.. మరణ సంకేతాలను వివరించారట.
మరణం గురించి ప్రతి ఒక్కరిలో బయటకు చెప్పలేని భయం వెంటాడుతుంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో తెలియదు. అందుకే.. చావు అంటే.. అందరికీ భయమే. అయితే.. మరణాన్ని ముందుగానే.. పసిగట్టవచ్చని, ఆ సంకేతాలు ముందుగానే కనిపిస్తాయని.. సాక్షాత్తు ఆ శివుడే.. పార్వతికి వివరించారట. మరి ఆ మరణ సంకేతాలేంటో తెలుసుకుందామా..


పనిచేయకపోవడం
నోరు, చెవులు, కళ్లు, నాలుక సరిగ్గా పనిచేయడం లేదు, వాటి పనితీరు సజావుగా లేదు అంటే.. మరణానికి సంకేతం. మరో 6నెలల్లో మరణం సంభవిస్తుందని సిగ్నల్.

చంద్రుడు, సూర్యుడు
చంద్రుడి చుట్టూ లేదా సూర్యుడి చుట్టూ.. నలుపు రంగులో లేదా ఎరుపు రంగులో రింగ్ చూశారంటే.. 15రోజుల్లోపుత మీరు చనిపోయే అవకాశాలు ఉంటాయి.

నీడ చూడలేకపోతే
ఒకవేళ ఒక వ్యక్తి.. తమ నీడను ఆయిల్ లేదా నీళ్లు లేదా అద్దంలో చూసుకోలేకపోతే.. 6నెలల లోపే ఆ వ్యక్తి చనిపోతారని సంకేతం.

నీలిరంగు
ఒక వ్యక్తి తన చుట్టూ.. సడెన్ గా నీలి రంగులో ఏవో తిరుగుతున్నట్టు గుర్తించాడు అంటే.. ఒకనెలలోపే మరణం సంభవిస్తుందని సంకేతం.

శరీర చాయ
హఠాత్తుగా శరీరం తెల్లగా లేదా పసుపు రంగులోకి మారడం లేదా శరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్పడుతున్నాయంటే.. 6నెలల లోపు ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గొంతు, నాలుక
గొంతు, నాలుక పదే పదే ఆరిపోతున్నాయి అంటే.. ఆ వ్యక్తి త్వరలోనే చనిపోతాడని సంకేతం.

ఎడమ చేయి
ఎడమచేతి నరాలు, కండరాలు హఠాత్తుగా, చాలా లాగుతున్నాయంటే.. అతను.. చాలా త్వరలోనే చనిపోతాడని సంకేతం.

నక్షత్రాలు
నక్షత్రాలు, చంద్రుడిని ఒకవేళ డిమ్ గా లేదా నల్లగా చూస్తున్నారంటే.. మీకు దగ్గరలోనే మరణం సంభవిస్తుందని సంకేతం.

రాబందు, కాకి
రాబందు, కాకి, పావురం ఏదైనా.. ఒక వ్యక్తి తలపై కూర్చుంటే.. మరణానికి సంకేతం.

నీడ
ఒక వ్యక్తి తన నీడను తల లేకుండా చూశాడంటే.. అది మరణానికి సంకేతమని శివుడు వివరించాడు.

చూపు
మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు, అగ్నిని చూడలేకపోతున్నారంటే.. మరణానికి సంకేతం.

బ్లాక్ అండ్ వైట్
ఒకవేళ ఒక వ్యక్తి.. ప్రతిదాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూస్తున్నాడంటే.. అతను త్వరలోనే చనిపోతాడని సంకేతం.

ఆకలి తగ్గిపోవడం
ఆకలి లేకపోవడం, ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేకపోతున్నారంటే.. మరణానికి దగ్గరలో ఉన్నారని సంకేతం.

నిద్ర
మరణానికి దగ్గరైన వారిలో నిద్ర ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ నిద్ర నిద్ర అని అంటుంటారు.

పూర్వీకులు
కొంతమంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెప్పే సంకేతాలు మరణాన్ని సూచిస్తాయి.

ఇంద్రధనస్సు
ఒక వ్యక్తి.. సూర్యుడిని చూడలేకపోయినా, రాత్రిపూట ఇంద్రధనస్సుని చూడగలుగుతున్నారంటే.. అది ఖచ్చితంగా మరణానికి సంకేతమే.



Click it and Unblock the Notifications