Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
సముద్రంలో రాక్షసుడిలా విజృంభించే హరికేన్స్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్
మీకు విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు సినిమా గుర్తుందా ? ఆ సినిమాలో చూపించే సుడిగాలి గుర్తుందా ? సముద్రంలో ఉప్పెనా వచ్చే ఆ సుడిగాలి చూసి నివ్వెరబోయి ఉంటారు కదూ. నిజమే అంత భయంకరంగా ఉంటుంది. వాటినే సముద్రపు తుఫాను, హరికేన్స్ అంటారు. ఈ హరికేన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి గురించి మీకు తెలియని నిజాలు కూడా అంతకంటే షాకింగ్ గా ఉంటాయి.
ప్రకృతి వైపరిత్యాలను హరికేన్స్, బ్లిజార్డ్స్ అని పిలుస్తారు. ఎంతో భయంకరంగా వచ్చే ఈ ప్రకృతి వైపరిత్యాలను కనిపెట్టేంతలా మారిపోయింది టెక్నాలజీ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి.. వీటి ప్రమాదానికి గురయ్యే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి.. వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటోంది. లేదంటే.. చాలా నష్టం వాటిల్లేది. మరి సముద్రంలో రాక్షసుడిలా విజృంభించే ఈ హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు తెలుసుకోవాలనుందా ? అయితే ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేసేయండి..

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
హరికేన్స్ అతి వేగంగా వచ్చే గాలుల కారణంగా వస్తాయి. ఇవి ఎంత వేగంగా ఉంటాయో తెలుసా ? గంటకి 160 మైళ్ల వేగంతో ఈ గాలులు వీస్తూ.. 2.4 త్రిలియన్ గలాన్ల వర్షం రోజుకి కురుస్తుంది. ఈ హరికేన్స్ కారణంగా పెద్ద వరదలు వస్తాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
ఈ హరికేన్స్ ఉష్ణమండల తుఫానులుగా మారి.. కనీసం గంటకు 74 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
అట్లాంటిక్ లేదా ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో వస్తే వాటిని హరికేన్స్ అని పిలుస్తారు.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
ఉష్ణమండల తుఫానులకు, హరికేన్స్ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉష్ణమండల తుఫాను సమయంలో సాధారణంగా గాలి వేగం గంటకు 36 నుంచి 47 మైళ్ల వేగంతో ఉంటుంది. అదే హరికేన్స్ అయితే గంటకు 74 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
సాధారణంగా అట్లాంటిక్, అరేబియన్, గల్ఫ్ మెక్సికో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ హరికేన్స్ జూన్ 1 నుంచి నవంబర్ 30 మధ్యలో వస్తాయి. అదే ఈశాన్య పసిఫిక్ లో అయితే.. మే 15 నుంచి నవంబర్ 30 మధ్యలో వస్తాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
హరికేన్స్ కారణంగా వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్, టర్నడోలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
40 శాతం హరికేన్స్ అమెరికా, ఫ్లోరిడాలో సంభవిస్తాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
నేషనల్ హరికేన్ సెంటర్ 1953 నుంచి ఇవి సంభవించినప్పుడు పేరు పెట్టడం మొదలుపెట్టారు. వాటికి ఎక్కువగా మహిళల పేర్లే పెట్టేవాళ్లు. అయితే 1978లో ఇలా మహిళల పేర్లు పెట్టడాన్ని ఆపేశారు.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
అతిపెద్ద హరికేన్ 2005 ఆగస్ట్ లో సంభవించింది. దీనికి హరికేన్ కత్రినాగా పేరు పెట్టారు. ఈ వైపరిత్యంలో దాదాపు 108 బిలియన్ డాలర్ల నష్టం వాటినట్లు అంచనా వేశారు.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
హరికేన్స్ ను 5 విభాగాలు విభజించారు. అంటే గాలి వేగాన్ని, జరిగిన నష్టాన్ని బట్టి ఇలా క్యాటగిరీలు చేస్తారు. అతిపెద్ద హరికేన్ వచ్చినప్పుుడు రిటైర్డ్ అని పిలుస్తారు. ఈ విభాగం కింద కత్రినా, యాండ్రీ, మిచ్, శాండీ హరికేన్స్ సంభవించాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
3, 4, 5 క్యాటగిరీల కింద వచ్చే హరికేన్స్ ని అత్యంత భయంకరమైన వాటిగా పరిగణిస్తారు.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
ఈ హరికేన్స్ సంభవించినప్పుడు సముద్రం మధ్యలో ఏర్పడే సుడి అంటే కన్ను ఆకారంలో వచ్చే తుఫాను దాదాపు 20 మైళ్లు వ్యాపించి ఉంటుందట. తక్కువ గాలులు, ఆకాశం క్లియర్ గా ఉంటుంది.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
ఇలా గుండ్రటి ఆకారంలో వచ్చే ఈ విపత్తు.. అలానే వ్యాపిస్తూ.. భారీ వర్షాలకు దారితీస్తుంది.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
కంటి ఆకారంలో ఏర్పడిన తుఫాను చుట్టూ హరికేన్స్ అపశవ్యదిశలో తిరుగుతూ.. పెద్ద విపత్తుకి కారణమవుతాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
ఈ హరికేన్స్ భూమిని చాలా వేగంగా ఢీకొంటాయి. అలాగే అలలు చాలా వేగంగా, భారీగా వచ్చేస్తాయి. దీనివల్ల పెద్ద వర్షం వస్తుంది.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
చాలా హరికేన్స్ పెద్ద పెద్ద వరదలకు కారణమవుతాయి.

హరికేన్స్ గురించి ఆసక్తికర వాస్తవాలు
హరికేన్స్ సమయంలో 90 శాతం మరణాలు వరదల కారణంగా సంభవిస్తాయి.



Click it and Unblock the Notifications