Latest Updates
-
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా?
మన ఇండియా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!
ఇండియా ఆ పేరులోనే ఎంతో విశిష్టత ఉంది. భిన్న మతాలు, సంస్క్రుతులు, భాషలు, వ్యవహారికి విధానంతో మినీ ప్రపంచంలాగా విరసిల్లే ఇండియా ఎన్నో విషయాలు, విశేషాలకు పెట్టింది పేరు. అలాంటి మన దేశం గుిరంచి కొన్ని ఇంట
ఇండియా ఆ పేరులోనే ఎంతో విశిష్టత ఉంది. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, వ్యవహారికి విధానంతో మినీ ప్రపంచంలాగా విరసిల్లే ఇండియా ఎన్నో విషయాలు, విశేషాలకు పెట్టింది పేరు. అలాంటి మన దేశం గుిరంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ప్రపంచ దేశాల్లో భారత్ ది ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రకాల విశిష్ట లక్షణాలతో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం దేశం గొప్పగా కనబడుతుంది. ఇండియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం..

ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్.
ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.

రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది
ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.

సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం
ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.

అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే
ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.

సాఫ్ట్ వేర్ కంపెనీలు
భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.

ఇస్రో విజయం
మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.

కంప్యూటర్లను తయారీ
యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.

ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.

సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.

తక్షశిల
ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.

రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి
గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.

ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు
ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.

ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న
ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.

అతిపెద్ద సైనిక శక్తి
చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.

అత్యధికంగా సినిమాలు తీసే దేశం
ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.

వారణాసి.
ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.

గంగానది కుంభమేళాకు
పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.

బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.

'ఆయుర్వేద'ను
మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.

స్టాంపులను అందించిన దేశం
ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.



Click it and Unblock the Notifications