For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లలో ఆముదం చుక్కలు వేస్తే కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

ఆముదంలో ఎలాంటి రుచి ఉండదు. సువాసన ఉండదు. కలర్ ఉండదు. కానీ.. ఇందులో బ్యూటి, హెల్త్ బెన్ఫిట్స్ మాత్రం అమోఘమైనవి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ రెమెడీగా ఉపయోగిస్తారు.

By Swathi
|

కళ్లలో ఆముదం వేయడం ఏంటి, కంటి ఆరోగ్యానికి ఆముదం ఎలా సహాయపడుతుందని ఆశ్చర్యపోతున్నారా ? మీకు గుర్తుందా.. గతంలో మన అమ్మమ్మలు, బామ్మలు.. ఆముదంతో బాడీ మసాజ్ చేసేవాళ్లు. దానివల్ల చాలా ఎఫెక్టివ్ ఫలితాలను పొందేవాళ్లు. అలాగే ఆముదం వల్ల కళ్లకు కలిగే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం.

6 Amazing Benefits Of Castor Oil For Your Eyes

ఆముదం అనేది.. వెజిటబుల్ ఆయిల్. ఆముదం విత్తనం నుంచి తీసే.. ప్యూర్ ఆయిల్ ఇది. దీంట్లో ఎలాంటి రుచి ఉండదు. సువాసన ఉండదు. కలర్ ఉండదు. కానీ.. ఇందులో బ్యూటి, హెల్త్ బెన్ఫిట్స్ మాత్రం అమోఘమైనవి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ రెమెడీగా ఉపయోగిస్తారు.

జుట్టు వేగంగా, బలంగా పెరగడానికి, చుండ్రు నివారించడానికి ఆముదం ఉపయోగపడుతుంది. అయితే.. ఆముదం ఉపయోగించి కంటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి ? కళ్లకు ఆముదం అందించే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

డ్రైగా మారిన కళ్లకు

డ్రైగా మారిన కళ్లకు

డ్రైగా మారిన కళ్లను నివారించడానికి ఆముదం.. ఎఫెక్టివ్ న్యాచురల్ రెమెడీ. ఆముదం ఆయిల్ చుక్కలను కళ్లలో వేసుకోవాలి. ఇది ల్యూబ్రికేషన్ ని అందించి.. ఎల్లప్పుడూ.. కళ్లకు మాయిశ్చరైజింగ్ తో ఉండేలా సహాయపడతాయి. ఇది చాలా త్వరగా సమస్యను నివారిస్తుంది.

క్యాటరాక్ట్స్ నివారించడానికి

క్యాటరాక్ట్స్ నివారించడానికి

మొదట్లో కనిపించే కాటరాక్ట్స్ సమస్య నివారించడానికి ఆముదం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదంను రాత్రి పడుకోవడానికి ముందు కళ్లలో వేసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కాసేపు.. ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి.. ఈ రెమెడీ రాత్రి పడుకునేటప్పుడే ఫాలో అవ్వాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే 2 నుంచి 6 నెలల్లో ఈ సమస్య తగ్గిపోతుంది.

ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది

ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది

కళ్ల చుట్టూ వాపుని ఆముదం ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే మంట, వాపు, రెడ్ నెస్ ని కూడా చాలా తేలికగా నివారిస్తుంది. ఉంగరపు వేలుకి ఆయిల్ పట్టించుకుని.. కళ్ల చుట్టూ మసాజ్ చేస్తే.. ఈ లక్షణాలన్నీ మాయమవుతాయి.

కంటి ఇన్ఫెక్షన్

కంటి ఇన్ఫెక్షన్

బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ఆముదం పోరాడుతుంది. ఆముదం ఆయిల్ చుక్కను కళ్లలో వేసుకుంటే.. న్యాచురల్ బ్యార్టీరియల్ ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. మెడికేటెడ్ ఐ డ్రాప్స్ ఉపయోగించడం కంటే.. ఆముదంను ఉపయోగించడం వల్ల మరింత తేలికగా ప్రయోజనాలు పొందవచ్చు.

హెయిర్ గ్రోత్

హెయిర్ గ్రోత్

ఆముదంను కనురెప్పలకు, కనుబొమ్మలకు అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. ఇది ఒత్తైన, డార్క్ కనురెప్పలు, కనుబొమ్మలను అందిస్తాయి.

ముడతలు, నల్లటి వలయాలు

ముడతలు, నల్లటి వలయాలు

కళ్లచుట్టూ ఆముదంతో.. మసాజ్ చేయడం వల్ల.. చర్మం సాఫ్ట్ గా, స్మూత్ గా మారుతుంది. అలాగే డార్క్ సర్కిల్స్, ముడతలను కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. దీనివల్ల వయసు చాయలు కనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

6 Amazing Benefits Of Castor Oil For Your Eyes

6 Amazing Benefits Of Castor Oil For Your Eyes. Not only that, castor oil has amazing benefits for your eyes as well! Would you like to know what they are? Read on!
Story first published: Thursday, November 24, 2016, 11:14 [IST]
Desktop Bottom Promotion