Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రొమాన్స్ లో దాగున్న హెల్త్ సీక్రెట్స్
రొమాన్స్ ని ఇష్టపడతారా ? రొమాంటిక్ గా ఉండటానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారా ? అయితే రొమాన్స్ కూడా ఒక థెరపీనే ? నమ్మలేకపోతున్నారా ? నిజమే.. రొమాన్స్ కూడా ఆరోగ్యకరమే అంటున్నారు నిపుణులు. రొమాన్స్ చేసే ప్రతి పద్ధతి ద్వారా ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం పొందుతారని స్టడీస్ తేల్చాయి. లవర్స్, కపుల్స్ ఇష్టపడేది రొమాన్స్. రొమాన్స్ ని రకరకాల యాంగిల్స్ లో ఎంజాయ్ చేస్తారు. మరి ఎందులో ఏ హెల్త్ సీక్రెట్ దాగుందో ఇప్పుడు చూద్దాం..
నిద్రించే భంగిమ.. భార్యభర్తల బంధాన్ని తెలుపుతుందా ?
కిస్:ముద్దు. దీనిపై చాలా స్టడీసే జరిగాయి. ప్రతి ఒక్క కపుల్ లైఫ్ లో కిస్ ఎక్సీపిరియన్స్ తప్పనిసరిగా ఉండే ఉంటుంది. కానీ.. దీనితో పొందే లాభం మాత్రం అందరికీ తెలిసుండకపోవచ్చు. అయితే.. ఇద్దరూ కలిసి ముద్దు పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 10 సెకన్ల కిస్ ద్వారా 80 మిలియన్ల బ్యాక్టీరియా పాస్ అయి.. ఇద్దరిలోనూ ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది.

చేతులు పట్టుకోవడం:
భర్త చేయి పట్టుకోవడం వల్ల మహిళల పెయిన్ రిలీఫ్ అవుతుందని స్టడీస్ చెబుతున్నాయి. భర్త చేయి పట్టుకుంటే.. చాలా మంది మహిళలు.. తమకు ఉన్న నొప్పి తాలూకు బాధలన్నీ తగ్గుతాయి. అందుకే భర్త చేయి పట్టుకునే సంప్రదాయం పెళ్లిలోనే మొదలవుతుంది.
సెక్స్:
సెక్స్ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా ఎవరైతే సెక్స్ లో పాల్గొనరో వాళ్లకు ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని.. ఎవరైతే రెగ్యులర్ గా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారో వాళ్లకు ఒత్తిడి దరి చేరదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కిస్ చేసినప్పుడు, టస్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ అనే ముఖ్యమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ఇమ్యునిటీ పవర్ పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
లవ్:
ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యాక.. ఏది పడితే అది అనారోగ్యకరమైన ఆహారం తింటారని అపోహ ఉంది. కానీ.. మహిళలు ప్రేమలో ఉన్నప్పుడు అన్ హెల్తీ ఫుడ్ తీసుకుంటారేమో గానీ.. మగవాళ్లు మాత్రం హెల్తీ డైట్ ఫాలో అవుతారట.

హగ్:
20 నిమిషాలు పార్టనర్ ని హగ్ చేసుకోవడం వల్ల.. వాళ్లలో చాలా మార్పులు వస్తాయట. ఐ కాంటాక్ట్ కంటే ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా.. హార్ట్ బీట్ రేట్ తగ్గి, బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క కౌగిలింత చాలా ఆరోగ్యకరమని స్టడీస్ చెబుతున్నాయి.
హనీమూన్ టైంలో కపుల్స్ ఫాలో అవ్వాల్సిన రొమాంటిక్ టిప్స్
రిలేషన్:
ఎవరైతే రిలేషన్ లో ఉండరో వాళ్లకు స్ర్టోక్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే.. రిలేషన్ షిప్ లో ఉండే వాళ్లకు స్ర్టోక్ రిస్క్ చాలా తక్కువని స్టడీస్ నిరూపించాయి. ఒంటరి జీవితం గడిపేవాళ్లు 36 శాతం మంది చనిపోతే.. రిలేషన్ షిప్ లో ఉండేవాళ్లు 17 శాతం మంది చనిపోతున్నారు. రిలేషన్ లో ఉండటం వల్ల.. లైఫ్ హెల్తీగా, హ్యాపీగా ఉంటుందని.. స్టడీస్ వివరిస్తున్నాయి.



Click it and Unblock the Notifications