Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీవితంలో వీటిని కలిగి ఉన్నవాళ్లే.. నిజమైన అదృష్టవంతులు..!!
జీవితం అనేది తలరాతను బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి తలరాత ఒక్కోలా ఉంటుంది కాబట్టే.. ఒకరి జీవితంలో ఉండేవి, మరొకరి జీవితంలో ఉండవు. అలాగే కొంతమందికి తమ పూర్వీకుల సంపాదించిన ఆస్తుల ద్వారా.. లగ్జరీ లైఫ్ పొందుతారు. మరికొందరు.. పట్టుదలతో కష్టపడి పనిచేసి.. తమకు కావాల్సినవి సంపాదించుకుంటారు.

అయితే విధుర నీతి ప్రకరాం.. డబ్బు, ఆస్తి, ఇళ్లు వంటివి మాత్రమే కాదు.. జీవితంలో వీటిని కలిగి ఉన్నవాడే.. అసలైన అదృష్టవంతులని.. చెబుతోంది. జీవితంలో, జీవితాంతం ఇప్పుడు చెప్పబోయేవి కలిగి ఉన్నవాడే.. లక్కీ పర్సన్ అని చెబుతోంది. మరి ఆ లక్కీ థింగ్స్ ఏంటో మీరే చూడండి..

ఆరోగ్యం
వ్యాధులు మనుషులను బలహీనంగా మారుస్తాయి. తరచుగా అనారోగ్యం పాలయ్యే వాళ్లు.. జీవితంలో.. తేజాన్ని కోల్పోతారు. డబ్బు సంపాదించే సత్తా కోల్పోతాడు. కాబట్టి.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అదృష్టవంతులు.

విధేయత కలిగిన భాగస్వామి
మర్యాద, విధేయత కలిగిన భాగస్వామిని కలిగి ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అదృష్టవంతులు. ఒకవేళ భాగస్వామి.. క్రమశిక్షణతో లేకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

విధేయత కలిగిన పిల్లలు
విధేయత కలిగిన పిల్లలు కలిగి ఉండటం అనేది.. అది పెద్ద వరం. వాళ్లు పెరిగి పెద్దవాళ్లు అయిన తర్వాత.. కుటుంబ గౌరవాన్ని పెంచుతారు. ప్రశాంతత, అదృష్టాన్ని తీసుకొస్తారు.

ఆటంకం లేకుండా ఆదాయం
ఎలాంటి ఆటంకం లేకుండా.. జీవితాంతం ఆదాయం పొందగలిగే వాళ్లు అదృష్టవంతులు. ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంది అంటే.. బతకడానికి మార్గం దొరుకుంది. డబ్బు సంపాదించగలుగుతారు.

ఎడ్యుకేషన్
చదువుకున్న వ్యక్తికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఎదగడానికి.. విద్య చాలా సహాయపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చదువు.. మీతోనే ఉంటుంది.. మీ సమస్యకు పరిష్కారం చెబుతుంది.

తెలివైన భార్య
ఎవరికైతే.. తెలివైన భార్య ఉంటుందో.. వాళ్లు జీవితంలో నిజమైన అదృష్టవంతులు. ఆమె తెలివైన వ్యక్తిత్వం కలిగి ఉంటే.. ఇంటిని.. సొంతంగా దారిలోపెట్టగలుగుతుంది.



Click it and Unblock the Notifications