Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ఏడు జన్మల వెనక ఉన్న ఆసక్తికర రహస్యాలు..!!
పునర్జన్మ ఎప్పుడూ మనకు అర్థంకాని.. అద్భుతమైన కాన్సెప్ట్. హిందూమతంతో పాటు, ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్లీ, మళ్లీ ఈ భూమ్మీద పుడతారని చెబుతాయి. ఉదాహరణకు బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్ లో చాలా ధృడమైన నమ్మకం ఉంది.
వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ?
హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ విష్ణువు. అతను మనిషి రూపంలో.. అనేకసార్లు జన్మెత్తారు. భూమ్మీద ఉండే దుర్మార్గులను నాశనం చేయడానికే విష్ణువు అన్ని సార్లు పునర్జన్మ పొందారు. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూశాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది. అది సాధ్యం కాదన్న భావం ఉంది. అయితే.. పునర్జన్మ గురించి.. కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలున్నాయి.

ఆత్మ బతికే ఉంటుంది
హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరం మరణించినా.. ఆత్మ బతికే ఉంటుందని చెబుతుంది. మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట.

కర్మను బట్టి ఆత్మ ప్రవేశం
ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది మనం మన పూర్వ జన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి, చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి, మంచి కర్మ పొంది ఉంటే.. ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి, చెడు కర్మను పొంది ఉంటే.. అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది.

జంతువులుగా కూడా జన్మించే అవకాశం
చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ.. కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉంది.

ఆత్మ దెయ్యంగా మారుతుంది
ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే.. అతను లేదా ఆమె దయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చేన తర్వాత పునర్జన్మ పొందుతారు.

అంత్యక్రియలు
హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది. ఎందుకంటే.. మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూదని.. దేహాన్ని కాల్చడం, లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ.. ఈ మెమరీస్ కోసం వెతుక్కోకుండా..మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు.

ఏడు జన్మలు
ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా మగవాళ్లు, ఆడవాళ్లు మాదిరిగానే ఏడు సార్లు జన్మిస్తారు. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది.

అనుకూల పరిస్థితుల్లో ఆత్మ ప్రవేశం
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చనిపోయిన వెంటనే.. ఆత్మ మరో శరీరరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత.. కొత్త శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుంది.

పూర్య జన్మ గురించి రికార్డ్
మహర్షుల ప్రకారం.. మన గత జన్మ గురించి ప్రతీది మనకు గుర్తు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే.. పూర్వ జన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే.. మన పూర్వ జన్మల గురించి మన అన్ కాన్సియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటాయన్నమాట.



Click it and Unblock the Notifications