Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించాల్సిన వ్యక్తులు
మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా ? ఇదేం ప్రశ్న. ఈ కాలంలో ఫేస్ బుక్ అకౌంట్ లేనివాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారా ? నిజమే ఫేస్ బుక్ అకౌంట్ లేనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. అయితే మీ అకౌంట్ లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ ఒక్కసారి చూసుకోండి. రియల్ లైఫ్ లో స్నేహితులని ఎంచుకోవడంలోనే కాదు ఫేస్‌బుక్ స్నేహితులని ఎంచుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ స్నేహితులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వాటిని చూసి మీరెప్పుడైనా కృంగుబాటుకి గురయ్యారా ? లేదా కోపం వచ్చిందా? అయితే వారిని మీ స్నేహితుల జాబితా నుంచి తొలగించాల్సిందే. ఎలాంటి వారిని మీ స్నేహితుల జాబితా నుంచి తొలగించాలో ఈ ఆర్టికిల్ ద్వారా తెలుసుకోండి.
మన జీవితాన్ని మనకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు సంపూర్ణంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఇబ్బందులలోకి నెట్టేవారికి అనవసర సాయం కూడా చేయనక్కర్లేదు.ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లని మన స్నేహితులని కలుసుకోవడానికో లేదా కాస్త సేద తీరడానికో ఉపయోగిస్తుంటాము. కానీ తీరా ఫేస్‌బుక్ తెరిచాక నా కొత్త కారు, నా కొత్త బంగ్లా అంటూ ప్రతీదీ ఆడంబరంగా చాటుకునే స్నేహితుల ఫోటోలు చూసి మీరు కృంగుబాటుకి గురి కావచ్చు.
మీ మనశ్శాంతి పోగొట్టే ఇలాంటి వాళ్లని ఫేస్‌బుక్ ద్వారా అన్‌ఫ్రెండ్ చెయ్యడమెలాగో మీకు తెలియాలి. ఫేస్‌బుక్ లేదా ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లల ద్వారా మీరు పొందే ఆనందం మీ ఆలోచనలనీ, ప్రవర్తననీ నిర్దేశిస్తుంది. ఇంతకీ అన్ ఫ్రెండ్ చేయాల్సిన ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి చూసేద్దాం..

షో ఆఫ్:
మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లో కొంతమంది ప్రతీ చిన్న విషయాన్నీ ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంటూ వారి జీవితమంతా ఆనందమయం అన్నట్లు చూపించుకునేవారుండే ఉంటారు. వీరు తమ విశాలమైన స్నానాల గదుల దగ్గర నుంచీ, తాము సెలవలు గడపడానికి వెళ్లిన ప్రదేశం వరకూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటారు. వీటన్నింటి వెనుకా ఉన్న అంతరార్ధం వారు తమ గొప్పని ప్రదర్శించడమే. ఇలాంటి వాళ్ల పోస్ట్‌లు చూసి మీరు మీకున్న జీవితం పట్ల అసంతృప్తికి గురి అవుతుంటే.. వారిని అర్జెంటుగా మీ స్నేహితుల జాబితా నుంచి తొలగించండి.

వాదించేవాళ్ళు:
మీ ఫ్రెండ్స్‌లో మరి కొంత మంది.. వారికి ఎదురైన ప్రతీ చిన్న సంఘటన మీదా వాదించేవారుండే ఉంటారు. రాజకీయాలు, మతం లాంటి సున్నిత అంశాల మీద వీరు సామాజిక మాధ్యమాలలో చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు మాట తూలి అభ్యంతరకరమైన పదాలు వాడవచ్చు. వారి వల్ల మీరు ఇబ్బందులలో పడకముందే వారిని స్నేహితుల జాబితా నుంచి తొలగించడం ఉత్తమం.

బాస్:
మీ స్నేహితుల జాబితాలో మీ బాస్ ఉండటం అత్యంత పెద్ద తప్పు. మీరు ఆరోగ్యం బాగా లేదంటూ సిక్ లీవ్ తీసుకుని మీరేమి చేశారో లేదా మీ నైట్ అవుట్ గురించో మీ బాస్ ప్రశ్నించడం మీకు నచ్చదు కదా. ఎందుకంటే ఎంతైనా ఆమె/ఆయన మీ బాస్ మరి.

విమర్శకులు:
మన అందరి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఓ విమర్శకుడు ఉండే ఉంటారు. సామాజిక మాధ్యమాలంటే కాసేపు సరదా కోసమో లేదా మీరు తీసుకున్న సరదా ఫోటోలని పంచుకోవడానికో మాత్రమే. కానీ ఈ ఫోటోలు నచ్చలేదంటూ విమర్శించే వాళ్ళని మీరు పట్టించుకోనక్కర్లేదు కానీ తక్షణమే వారిని మీ స్నేహితుల జాబితా నుండి తొలగించండి.

మీ మాజీ ప్రియుడు/ప్రియురాలు:
అవును మీరు సరిగ్గానే విన్నారు. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మీ స్నేహితుల జాబితా నుంచి తొలగించడం హేయమైన చర్య ఏమీ కాదు. ఇది మీరు హాయిగా ఉండేందుకు దోహదపడుతుంది. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ స్నేహితుల జాబితాలో ఉండటం వల్ల మీకు మీ గతం గుర్తుకు రావచ్చు లేదా మీకు భవిష్యత్తులో ఏర్పడబోయే ఇతర సంబంధాల మీద ప్రభావం చూపవచ్చు. అందుకే వారిని అన్‌ఫ్రెండ్ చెయ్యండి.

ప్రౌడ్ పేరెంట్స్:
కొంతమంది తమ చిన్న పిల్లల ఫోటోలని తరచూ సామాజిక మాధ్యమాలలో పెట్టి గర్వపడుతుంటారు. అలాంటి వారిని వెంటనే వారిని అన్‌ఫ్రెండ్ చెయ్యండి. చిన్న పిల్లల ఫోటోలు చూడటానికి క్యూట్ గానే ఉంటాయి కానీ ఒక వేళ మీకు కనుక పెళ్ళయ్యి అప్పుడే పిల్లలు వద్దనుకునే వారయితే ఇలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.

పరిచయం లేని వ్యక్తులు:
మీ స్నేహితుల జాబితాలో సగం మంది కనీసం మీరెప్పుడూ కలవని వారై ఉంటారు.వారు పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఆమోదించి వారిని మీ స్నేహితుల జాబితాలో చేర్చుకుని ఉండవచ్చు మరియూ వీరితో చాలా అరుదుగా మాట్లాడుతుంటారు కదా??.మీకు పరిచయం లేని వ్యక్తులని వెంటనే మీ స్నేహితుల జాబితా నుండి తొలగించడం ఉత్తమం ఎందుకంటే వారి బ్యాక్ గ్రౌండ్ అదీ మీకు తెలీదు కదా.అసలు ఎప్పుడూ కలవని లేదా మాట్లాడని వ్యక్తులని ఫేస్బుక్ లో చేర్చుకుని ఏమి లాభం??



Click it and Unblock the Notifications