For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో సెలబ్రేట్ చేసుకునే 8 రకాల న్యూ ఇయిర్స్ ఏంటి ?

By Swathi
|

సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలతో భారతదేశ కీర్తి చాలా గొప్పస్థానికి వెళ్తుంది. ఇండియా ఒక దేశమైనా.. పలు జాతులు, ప్రాంతాలు, వివిధ ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం. అందుకే.. న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకునే విధానంలో ఇండియా చాలా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఎక్కడలేని విధంగా ఇండియాలో కొత్త ఏడాదికి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది రకాలుగా వెల్ కమ్ చెప్తారు.

ప్రపంచంతో పాటు ఇండియా కూడా.. జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది. దేశమంతా.. కొత్త ఏడాదితో ఎంతో సంతోషంగా, గ్రాండ్ గా స్వాగతం పలుకుతారు. అయితే.. అలాగే.. వివిధ రాష్ట్రాలు తమ పంట చేతికి వచ్చిన సమయాన్ని బట్టి, లేదా వాళ్ల వాళ్ల ఆచారాలు, పంచాగాన్ని బట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే న్యూ ఇయర్ విశేషాలు మీ కోసం..

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వాసులు కొత్త ఏడాదిని ఉగాదిగా జరుపుకుంటారు. చైత్రమాసంలో అంటే మార్చ్ లేదా ఏప్రిల్ ఈ పండుగ జరుపకుంటారు. ఈ పర్వదినాన కుటుంబ సభ్యులంతా కలిసి గ్రాండ్ గా చేసుకుంటారు. ఈ ఉగాదికి ప్రత్యేకంగా తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు కలిసిన పచ్చడి చేసుకుని తినడం ఆనవాయితీ. అలాగే ఈ పండుగ రోజు ఆలయాల్లో పంచాగ శ్రవణం ప్రత్యేకమైనది.

తమిళనాడు

తమిళనాడు

తమిళుల క్యాలండర్ ప్రకారం న్యూ ఇయర్ ను వాళ్ల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ మధ్యలో చేసుకుంటారు. ఇదే వాళ్లకు కొత్త ఏడాది ప్రారంభమైనట్టు. న్యూ ఇయర్ ను పుత్తండు లేదా వరుష పిరప్పు అని పిలుస్తారు. ఈ పండుగ రోజు ఒక ప్లేట్ లో 3 రకాల పండ్లు ముఖ్యంగా మామిడి, అరటి, పనసపండ్లు, పూలు, తమలపాకులు, అద్దం.. అన్నింటిని తమిళుల న్యూ ఇయర్ రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తారు. తర్వాత రోజు ఉదయం లేవగానే ఈ ట్రే చూడటం వాళ్ల సంప్రదాయం. ఎంట్రెన్స్ లో రకరకాల రంగు రంగుల ముగ్గులతో అలంకరిస్తారు.

కేరళ

కేరళ

కేరళలో న్యూ ఇయర్ ని విష్ణు అని పిలుస్తారు. ఈ పండుగ రోజు.. ఉదయం నిద్రలేవగానే విష్ణువుని చూస్తే.. ఏడాదంతా.. వాళ్లు అనుకున్నది జరుగుతుందని నమ్ముతారు. ఈ సంప్రదాయాన్ని విష్ణుక్కాని అంటారు.

గుజరాత్

గుజరాత్

గుజరాతీయులు దీపావళి మరుసటి రోజుని న్యూ ఇయర్ గా అంటే.. బెస్తు వారాస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. రకరకాల ఆచార సంప్రదాయాలు, పద్ధతులతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. ఈ న్యూ ఇయర్ రోజు శ్రీకృష్ణుడికి 56 లేదా 108 రకాల వంటకాలు సమర్పించడం గుజరాతీయుల ఆచారం.

పంజాబ్

పంజాబ్

బైసఖిగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు సిక్కులు. మనుషులంతా సమానమని నమ్ముతూ 10వ గురువు గురు గోబింద్ సింగ్ కలశ స్థాపన చేసిన రోజుకి బైసఖిగా జరుపుకుంటారు. ఈ న్యూ ఇయర్ రోజున పంజాబ్ లో అన్ని గురుద్వార్ లు చాలా గ్రాండ్ గా డెకరేట్ చేస్తారు. ప్రజలంతా సందర్శిస్తారు. అలాగే డ్యాన్సింగ్, సింగింగ్ వంటి కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు.

మహారాష్ట్ర

మహారాష్ట్ర

మహారాష్ట్రలో కూడా న్యూ ఇయర్ ని పంట పండుగగా జరుపుకుంటారు. వీళ్లు న్యూ ఇయర్ ని గుడి పడ్వా అని పిలుస్తారు. మార్కెట్ లో ఎక్కువగా మామిడిపండ్లు వచ్చే సమయాన్ని బట్టి ఈ పండుగ డేట్ ని ఫిక్స్ చేస్తారు. శివాజీ మహరాజ్ కి గుర్తుగా ఈ పండుగ రోజు ద్వారాలకు పసుపు రంగు క్లాత్ కడతారు. అందరూ శివాజీకి గ్రాండ్ గా సంతాపం తెలుపుతారు.

అస్సాం

అస్సాం

అస్సాంలో కొత్త ఏడాదిని రొంగాలి బిహు లేదా బొహగ్ బిహు అని పిలుస్తారు. ఏప్రిల్ మధ్యలో అస్సామీయులు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే వీళ్లకు వ్యవసాయానికి సంబంధించిన సీజన్ ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజుకి వ్యవసాయదారులంతా.. పొలాలను పంటకు రెడీ చేస్తారు. ఆడవాళ్లు బియ్యం, కొబ్బరితో పితా, లారస్ వంటకాలు తయారు చేస్తారు.

బెంగాల్

బెంగాల్

బెంగాలీయులు న్యూ ఇయర్ ని పొహెలె బయోశఖ్ అని పిలుస్తారు. బెంగాల్ లో ఇది చాలా పెద్ద పండుగ. ఇక్కడ న్యూ ఇయర్ కి కల్చరల్ ఫెయిర్స్, షాపింగ్, పూజలు, పెళ్లిళ్లు నిర్వహిస్తారు. పొహెలె అంటే మొదటి అని, బయోశఖ్ అంటే..మొదటి నెల అని అర్థం.

English summary

8 Different New Year celebrated by Indians

8 Different New Year celebrated by Indians. India is a country rich in diverse culture, traditions and festival. Despite the diversity, a common festival celebrated by all is the welcoming of the New Year.
Desktop Bottom Promotion