Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలను సెక్స్ లో పాల్గొనకుండా అడ్డుకునే 8 భయాలు..!
సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది. ఎక్కువగా శృంగారం చేయడం వల్ల.. కొంతమంది ఆరోగ్యాప్రయోజనాలు కలుగుతాయి. ఇమ్యునిటీ పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మరికొందరికి.. సెక్స్ వల్ల ఇబ్బంది, భయం, ఆందోళన కలుగుతాయి.
తాజా అధ్యయనాల ప్రకారం.. మహిళల్లో సెక్స్ అంటే.. ఎనిమిది రకాల భయాలు ఉంటాయట. 2000 మంది మహిళలపై జరిపిన ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చాలా కామన్ గా మహిళలకు ఉండే భయాలు, ఆందోళనలు.. వాళ్లను శృంగారం చేయకుండా.. అడ్డుకుంటున్నాయట. వాళ్లను అడ్డుకుంటున్న ఆ ఎనిమిది కారణాలేంటో మీరే చూడండి..

పార్ట్ నర్ కి కండోమ్ ఇష్టంలేకపోతే
కండోమ్స్ ప్రెగ్నన్సీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ భాగస్వామికి కండోమ్ ఇష్టంలేకపోతే.. మహిళలు శృంగారం చేయడానికి భయపడతారు.

ఎస్ టీ ఐ
ఒక వేళ భాగస్వామికి ఎస్ టీ ఐ ( సెక్యువల్లీ ట్రాన్స్ మిట్టెడ్ ఇన్ఫెక్షన్ ) ఉంటే.. ఆడవాళ్లు.. ఇంటర్ కోర్స్ కి ఇష్టపడరు. ఇన్ఫెక్షన్ సోకుతుందని భయపడతారు. ఒకవేళ కండోమ్స్ ఉపయోగిస్తే.. ఆమెకు భయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

ఎక్స్ పెక్ట్ చేయకుండా గర్భం వస్తే
ఒక వేళ ఇంటర్ కోర్స్ సమయంలో.. కండోమ్ బ్రేక్ అవడం వల్ల అనుకోకుండా గర్భం పొందినప్పుడు.. ఆ భయం ఆడవాళ్లలో అలాగే ఉంటుంది. కాబట్టి.. ముందుగా కండోమ్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఆకర్షణీయంగా లేకపోవడం
బెడ్ రూమ్ లో తమ భాగస్వామి అందంగా, ఆకర్షణీయంగా కనిపించకపోవడం వల్ల కూడా.. ఆడవాళ్లు శృంగారం అంటే భయపడే అవకాశాలుంటాయి. అంటే.. నగ్నంగా.. అందంగా లేని భాగస్వామితో ఇంటర్ కోర్స్ కి భయపడే ఛాన్స్ ఉంటుంది.

తమ ఇష్టాన్ని గౌరవించకపోతే
మహిళలు.. తమ భాగస్వామి తమ ఇష్టాలకు ఎంత ప్రాధాన్యత, గౌరవం ఇస్తున్నారు అనేదానిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి.. ఒకవేళ మీరు ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేకుండా.. శృంగారానికి ప్రోత్సహించే తత్వం కూడా.. ఆమెలో సెక్స్ అంటే భయానికి కారణమవుతుంది.

ఇబ్బందికర పరిస్థితులు
ఇంటర్ కోర్స్ సమయంలో రకరకాల ప్రక్రియలు జరుగుతాయి. సౌండ్, శరీరంలో మార్పులు, లిక్విడ్స్ వంటివన్నీ ఇబ్బంది కలిగించడం వల్ల కూడా.. ఆమె శృంగారం అంటే భయపడటానికి కారణమవుతుంది.

భాగస్వామిలో ఉద్వేగం లేకపోవడం
భాగస్వామిలో ఉద్వేగం లేకపోవడం, స్ఖలనం జరగకపోవడం వల్ల కూడా.. మహిళలు.. ఇంటర్ కోర్స్ అంటే భయపడవచ్చు. కాబట్టి.. ఆమెను సంతృప్తి పరచడానికి మరో విధానాన్ని ప్రయత్నించండి.

బ్యాడ్ ఎట్ సెక్స్
కాస్త అనుభవం వల్ల కొంతమంది ఇంటర్ కోర్స్ లో ఫెయిల్ అవడం, మహిళలను ఇబ్బందిపెట్టడం జరుగుతుండవచ్చు. కానీ.. ఇద్దరు ఆ విషయంపై చర్చించుకునే.. ఏ విషయాల్లో మార్పులు అవసరమో తెలుసుకుని నడుచుకుంటే.. దాంపత్య జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications