Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
గౌతమ బుద్ధుడి గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!
గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్త. నేపాల్ కి చెందిన గౌతమ బుద్దుడు ప్రారంభించిన బుద్ధిజం.. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది.. అలాగే అనేకమందికి స్పూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఇప్పటికీ.. బుద్ధిడి హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది.
ప్రేమ పంచడం, ప్రేమ తత్వం కలిగి ఉంటడం అనేది బుద్ధిడి హితబోధ సారాంశం. మనిషిలో ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో జయించలేనిది అంటూ ఏదీ ఉండదు. మీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో.. మీ నుంచి నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందని గొప్ప తత్వం బుద్ధిజం వివరిస్తుంది.

మనుషులు ఉన్నంతవరకు బుద్ధిజానికి విలువ ఉంటుంది. బుద్ధిడి జీవితంలో ప్రతి అంశం స్పూర్తిదాయకం, జ్ఞానం ప్రబోధించేదే. బుద్ధుడి నుంచి మనం నేర్చుకోవాల్సి ఎన్నో విషయాలు, ఆసక్తికర అంశాలున్నాయి. బుద్ధుడు ప్రస్తుతం జరుగుతున్న దానిపైనే దృష్టి కేంద్రీకరించాలని చెబుతాడు. జరిగిపోయిన గతం, జరగబోయే భవిష్యత్ గురించి పట్టించుకోకూడదని సూచించారు. ఈ సింపుల్ లాజిక్ ఫాలో అయితే.. ఈ పోటీ ప్రపంచంలో మనం టార్గెట్ రీచ్ అయ్యే ధైర్యాన్ని పొందగలుగుతాం. ఇలాంటి స్పూర్ఫి కలిగించే బుద్ధుడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలున్నాయి.
*పెయింటింగ్స్, శిల్పాల్లో చూపించినంత బొద్దుగా గౌతమ బుద్ధుడి అసలు రూపం ఉండదు.
*ప్రతి రోజూ గౌతమ బుద్ధుడు ఉపవాసం ఉండేవారు. అలాగే వందలాది మైళ్లు నడక సాగించేవారు. సిద్ధాంతాలు, జ్ఞానం బోధించడానికి నడుచుకుంటూ వెళ్లేవారు.

*బుద్ధుడి సిద్ధాంతాలు కేవలం నోటి వాక్కు, నోటి మాట ద్వారానే విస్తరించేవి. లేదా రాతి పలకాలపై చెక్కిన పదాల ద్వారా విస్తరించాయి.
*బుద్ధుడుకి జ్ఞానోదయం పొందినది బోధి వృక్షం కింద. అది ఇప్పటికీ ఇంకా ఉంది.
*బుద్ధుడు తన జీవితం చివరి దశకు అంటే 80 ఏళ్లు వచ్చే వరకు తన సిద్ధాంతాలను ప్రబోధిస్తూ.. ప్రయాణించారు. చనిపోయేటప్పుడు కూడా తన ప్రబోధాలను వివరించారు.

*బుద్ధుడి కుటుంబ సభ్యులంతా.. ఆయన శిష్యులయ్యారు.
*మొదటిసారి, మొదటి ప్రాంతంలో బుద్ధుడు తన సిద్ధాంతాలను ప్రబోధించడానికి అయిష్టత చూపించారు. ఎందుకంటే కొన్ని విషయాలను నేర్చుకోవడం కష్టం, కొన్ని విషయాలను ప్రబోధించడం కష్టం. అలాగే బుద్ధుడి ప్రబోధాలు *నేర్చుకునే వ్యక్తి స్వచ్ఛమైన మనసు, మైండ్ ఉంటేనే.. వాటిని నేర్చుకోవడం కుదురుతుందని భావించారు గౌతమ బుద్ధుడు. అందుకే.. వాటిని ప్రబోధించడానికి మొదట్లో అయిష్టత చూపించారు.



Click it and Unblock the Notifications