అప్పగింతలకు కాదు.. 30 రోజులు ఏడ్వాలి.. ఇదో వింత ట్రెడిషన్

By Swathi

వధువు చేయి పట్టుకుని ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు. వరుడిని పెళ్లికాని అమ్మాయిలంతా ముద్దు పెట్టుకోవచ్చు. పెళ్లి కూతురు నెలరోజులు ఏడుస్తూ కూర్చోవాలి. పెళ్లికొడుకుని చితకబాదవచ్చు. ఇదేంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా ? ఇవన్నీ బంపర్ ఆఫర్లని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. ఈ వింత ఆఫర్లు, విచిత్రమైన పద్ధతులు పెళ్లి సంప్రదాయాలు !! వివిధ దేశాల్లో ఫాలో అవుతున్న ఆశ్చర్యకర, నవ్వుతెప్పించే వివాహ సంప్రదాయాలు.

పెళ్లి వేడుక సంప్రదాయాలు, మతాలు, దేశాలు, ప్రాంతాలను బట్టి వారి వారి ఆచారం ప్రకారం చేస్తారు. చాలా వరకు పెళ్లి అంటే.. పెళ్లి జంట తాళి కట్టడం, రింగ్స్ మార్చుకోవడం, పూలదండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడం వంటి సంప్రదాయాలు చూస్తుంటాం. చుట్టాలు, స్నేహితులు అందరూ వచ్చి వాళ్లను ఆశీర్వదిస్తారు. మరికొంతమంది వైట్ వెడ్డింగ్ అంటే.. క్వీన్ విక్టోరియా వెడ్డింగ్ మాదిరిగా పెళ్లికూతురు వైట్ డ్రెస్ లో ముస్తాబవడం వంటి సంప్రదాయం కూడా నడుస్తోంది.

పెళ్లి అనేది యూనివర్సల్ అకేషన్. అనేక సంప్రదాయాలు, ఆచారాలు, పాత పద్ధతులు, కొత్త పద్ధతులు ఇలా ఎన్నో మ్యారేజ్ కల్చర్స్ ఉన్నాయి. చాలా మంది ఒక కళ్యాణ మండపం బుక్ చేసి, వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేసి, చుట్టాలందరి సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అయితే ఇలాంటి సంప్రదాయాలు సాధారణం. కానీ.. ఇక్కడున్న, ఫాలో అవుతున్న సంప్రదాయాలు చూస్తే షాక్ అవడమే కాదు.. నవ్వు ఆపులేకపోతారు. అంత ఫన్నీగా ఉన్న వింత పెళ్లి సంప్రదాయాలేంటో ఇప్పుడు చూద్దాం...

చైనా

చైనా

అప్పగింతలప్పుడు కాదు.. నెలరోజులు ఏడుస్తూ కూర్చోవాలి. అవును వెడ్డింగ్ డేని క్రైయింగ్ డేగా మార్చడం చైనీస్ ప్రత్యేకత. చైనాకి చెందిన తుజ్జియా ప్రజలు నెలరోజుల ముందు నుంచి వివాహ ఏర్పాట్లు చేస్తారు. అది కూడా పెళ్లి రోజులన్నింటినీ ఏడుపు రోజులుగా మార్చడానికి. మొదటి 10 రోజులు పెళ్లి కూతురు రోజుకి గంటపాటు ఏడ్చాలి. తర్వాత 10 రోజులు ఆమెతోపాటు ఆమె తల్లి గంటపాటు ఏడ్చాలి. ఆ తర్వాత 10 రోజులు వాళిద్దరితోపాటు అమ్మమ్మ ఏడుస్తుంది. ఇలా.. ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ అయిపోయేంతవరకు.. ఇలా రోజూ గంటసేపు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ విశేషమంతా బాధాకరంగా జరగదు. జాయ్ ఫుల్ గా, ప్రేమగా సాగుతుంది. ఎందుకంటే.. మహిళలందరూ వివిధ రకాల సౌండ్స్ లో ఏడవడం వల్ల సాంగ్ లా మారిపోతుందట.

కెన్యా

కెన్యా

కెన్యాలో ఫాలో అయ్యే ట్రెడిషన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మస్సాయ్ జాతికి చెందిన వాళ్ల పెళ్లి సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురికి గుండు చేసి.. ఆయిల్ అప్లై చేస్తారు. పెళ్లికూతురు తండ్రి ఆమె గుండుపై, బ్రెస్ట్ పై ఉమ్ము వేసే సంప్రదాయం చాలా వింతగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని వాళ్ల నమ్మకం.

స్వీడెన్

స్వీడెన్

స్వీడెన్ లో మరో వింతైన ఆచారం. కిస్సింగ్. అంటే.. పెళ్లికొడుకు, పెళ్లికూతురి మధ్య కిస్ కాదండోయ్. వధూవరులు కిస్ చేసే సంప్రదాయం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ స్వీడెన్ లో మరింత స్పెషల్ ట్రెడిషన్. పెళ్లికూతురు ఏదైనా కారణం వల్ల ఫంక్షన్ లో కనిపించకపోతే.. పెళ్ళికాని అమ్మాయిలంతా పెళ్లికొడుక్కి ముద్దు పెట్టేస్తారు. అలాగే పెళ్లికొడుకు పెళ్లికూతురు పక్కన లేకపోతే.. పెళ్లికాని అమ్మాయిలు ముద్దుపెట్టేస్తారు.

ఇండియా

ఇండియా

కుంభ్ వివాహ్ లేదా మాంగ్లిక్ దోషం అనే సంప్రదాయం ఇండియాలో ఫాలో అయ్యే అమేజింగ్ సంప్రదాయం. ఒకవేళ అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ కుజదోషం ఉంటే.. ఇలా విష్ణు విగ్రహానికి లేదా అరటిచెట్టుతో ముందుగా పెళ్లి చేస్తారు. కుజదోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని ఇలాంటి సంప్రదాయం పాటిస్తారు.

సౌత్ కొరియా

సౌత్ కొరియా

సౌత్ కొరియన్స్ భయంకరమైన ఆచారం ఫాలో అవుతారు. పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత.. పెళ్లికొడుకి పాదాలను బాదడం వీళ్లు ఫాలో అయ్యే వింత సంప్రదాయం. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అతని షూస్ తొలగించి ఒక కర్రకు పాదాలు కట్టేసి.. పైకి లేపి ఒక కట్టి లేదా తాడుతో కొట్టేస్తారు. ఇలా కొట్టడం వల్ల వెడ్డింగ్ నైట్ కి అతను బలంగా అవుతాడని వాళ్ల నమ్మకం. చాలా నొప్పిగా ఉండేదే అయినా.. హింస కంటే ఫన్నీగా ఉంటుంది.

యూరప్

యూరప్

పెళ్లికూతురిని భుజాలపై ఎత్తుకుని చుట్టూ తిరగాలి. ఇది కొత్త సంప్రదయమేమీ కాదు. కానీ.. పూర్వం కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉండేది. పెళ్లి కూతురిపై ఎలాంటి దుష్టశక్తులు పడకుండా.. పాదాలు కింద తగలకుండా.. ఆమెను తమ కొత్త ఇంటి వరకు తీసుకెళ్తాడు వరుడు. మరో నమ్మకం ఏంటంటే.. వధువు తమ పుట్టింటిని వదిలి రావడం ఇష్టం ఉండదు కాబట్టి పెళ్లి తర్వాత భార్యను తమ ఇంటికి ఎత్తుకెళ్లే సంప్రదాయం తీసుకొచ్చారు.

స్కాట్ లాండ్

స్కాట్ లాండ్

పెళ్లి కూతురిని అందంగా, కొత్తబట్టలలో ముస్తాబు చేసే సంప్రదాయం సాధారణంగా చూస్తూ ఉంటాం. మరి స్కాట్ లాండ్ సంప్రదాయం ఏంటో తెలుసా.. వధూవరులను థార్ తో ముంచెత్తడం. అవును వీళ్లద్దరినీ.. కళ్లకు గంతలు కట్టి.. దూరంగా తీసుకెళ్లి.. వాళ్లకు తెలియకుండా.. తల నుంచి పాదాల వరకు థార్ పోసేస్తారు.

ఖిజకిస్తాన్

ఖిజకిస్తాన్

పెళ్లి కాని అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ? ఇంకేమయినా ఉందా.. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కానీ.. కొన్ని ప్రాంతాల్లో పెళ్లికావాల్సిన అమ్మాయిని కిడ్నాప్ చేయడం కూడా ఒక సంప్రదాయమే. అలా కిడ్నాప్ చేసేది కూడా రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి అని భావించిన వ్యక్తి ఆమెను కాపాడి తీసుకురావాలి. ఇలాంటి వింత ఆచారం పాటిస్తున్నారు ఖిజకిస్తాన్ వాసులు.

పోలాండ్

పోలాండ్

పెళ్లి కూతురికి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్లు ఆమెతో డ్యాన్స్ చేసే ఛాన్స్. ఇదేదో ఆఫర్ అనుకోకండి. ఇది పోలాండ్ లో 1990 నుంచి అనుసరిస్తున్న ఆచారం. వెడ్డింగ్ రిసెప్షన్ లో మగవాళ్లు పెళ్లి కూతురితో.. ఆడవాళ్లు పెళ్లి కొడుతో డ్యాన్స్ చేయవచ్చు. అది కూడా డబ్బులు చెల్లిస్తేనే ఛాన్స్. ఈ ఆచారాన్ని మనీ డ్యాన్స్ అని పిలుస్తారు.

Story first published: Wednesday, February 3, 2016, 14:10 [IST]
Desktop Bottom Promotion