Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియన్స్ అని నిరూపించే.. వింత అలవాట్లు.. లక్షణాలు..!
ఇండియన్స్ ఏది చేసినా.. వెరైటీగా చేస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు. ప్రతి పనిలోనూ.. కాస్తైనా విభిన్నత ఉంటుంది. భారతీయుల కొన్ని అలవాట్లు ప్రపంచంతో పోల్చితే చాలా స్పెషల్ గా, స్మార్ట్ గా అనిపిస్తాయి. అయితే కొన్ని అలవాట్లు చాలా విచిత్రంగా అనిపించినా.. భారతీయ సంప్రదాయాన్ని, కట్టుబాట్లను వివరిస్తాయి.

అయితే.. మరికొన్ని లక్షణాలు మాత్రం కక్కుర్తి అనిపిస్తారు. పబ్లిక్ లో ఇండియన్స్ చేసే పనులు చాలా ఫన్నీగా, వింతగా, నవ్వుతెప్పించేలా ఉంటాయి. ఆ లక్షణాలు.. పక్కా ఇండియన్స్ అని నిరూపించేలా ఉంటాయి. మరి.. ఇండియన్స్ పబ్లిక్ లో చేసే అత్యంత వింత పనులు ఏంటో చూద్దామా..

పెళ్లి కార్డ్స్
మన ఇండియన్స్ పిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా.. చాలా వింతగా బిహేవ్ చేస్తారు. పెళ్లి కార్డ్స్, ఏవైనా మ్యాగజైన్స్ వచ్చిన అందమైన బొమ్మలను కట్ చేసి.. ఫ్రిడ్జ్ లపై అతికిస్తుంటారు.

కార్ల సీట్లకున్న కవర్లను
కార్లు కొంటారు. అంతా బాగానే ఉంటుంది. అయితే.. కార్ల సీట్లకున్న కవర్లను మాత్రం.. ఎన్ని నెలలు గడిచినా తొలగించరు.

సోంఫు
రెస్టారెంట్ కి వెళ్లారంటే.. భోజనం మొత్తం హ్యాపీగా లాగిస్తారు. ఇక చివర్లో పెట్టే సోంఫు గింజలను మాత్రం గుప్పులు గుప్పులుగా తీసేసుకుంటారు. అంత బిల్ కట్టాముగా.. ఇవి తీసుకుంటే తప్పా అన్నది మన ఇండియన్స్ ఫీలింగ్.

మార్కెట్
మార్కెట్ లో మన ఇండియన్స్ చూపించే లక్షణాలు మరీ వింతగా ఉంటాయి. కూరగాయలన్నీ కొన్న తర్వాత.. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కోసం అడిగే లక్షణం చాలామందికి ఉంటుంది.

పానీపూరీ
పానీపూరీ అంటే.. చాలామంది ఇష్టపడతారు. అయితే.. పానీ పూరీ మొత్తం తిన్న తర్వాత.. మరో ఎక్స్ ట్రా పూరీ అంటే.. స్వీట్ పూరీ ఇవ్వండి అంటూ.. ఫ్రీగా ఒక పూరీ కొట్టేసే అలవాటు ఉంటుంది.

రిమోట్
రిమోట్ పనిచేయకపోయినా.. దాన్ని సాధించి మరీ ఉపయోగిస్తారు. రిమోట్ వెనక భాగాన్ని కొట్టి కొట్టి మరీ పనిచేసేలా చేస్తారు.

హాఫ్ టికెట్
బస్సులో చాలా ఫన్నీ విషయాలు చూస్తుంటాం. ముఖ్యంగా.. పిల్లలకు టికెట్ తీసుకునేటప్పుడు.. హాఫ్ టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెబితే.. ఆరేళ్లపిల్లలను కూడా.. మూడేళ్ల చెప్పి బుకాయిస్తూ ఉంటారు.

గిఫ్ట్
ఇక పెళ్లిళ్లలో ఎవరూ ఏ గిఫ్ట్ ఇచ్చారు అన్నది ఒక అత్యుత్సాహం అయితే.. ఆ గిఫ్ట్ లను.. మరొకరికి బహుమానంగా ఇచ్చేయడం.. చాలా ఫన్నీ అలవాటే కదూ..

ట్యాగ్
మరో ఫన్నీ విషయం ఏంటో తెలుసా.. మన ఇండియన్స్ విమానాల్లో ప్రయాణించారంటే.. ఆ ట్యాగ్ ని బ్యాగ్ నుంచి.. తొలగించే ప్రసక్తే ఉండదు. మేం ఫ్లైట్ ఎక్కామని.. అందరికీ చెప్పడానికే కాబోలు.



Click it and Unblock the Notifications