Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పెళ్లికి ముందు ఆడవాళ్లలో.. మగవాళ్లు కంపల్సరీ చూడాల్సిన క్వాలిటీస్..!!
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి.. భూమిపై జరుగుతాయని చెబుతుంటారు. అయితే.. పెళ్లి చేసుకోవడానికి ముందు.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అని కూడా అంటుంటారు. ఎందుకంటే.. పెళ్లి సమయంలో.. ఏ చిన్న పొరపాటు చేసి.. ఆ వివాహ బంధంలో కలహాలు తప్పవు.
సాధారణంగా పెళ్లి చేయడానికి ముందు అమ్మాయి తల్లిదండ్రులు.. అబ్బాయి గుణగణాలు, సంపాదన, కుటుంబం, ఆస్తి వంటి రకరకాల విషయాలను చూసి.. అన్నీ సరిపోతాయి అనుకున్నప్పుడే పెళ్లి చేస్తారు. ముఖ్యంగా జాతకాలు చూసి.. అవి కలిసొస్తాయి అని బలాన్ని చేకూర్చినప్పుడే.. పెళ్లి చేయడం సంప్రదాయం.
ఇక అబ్బాయిలు కూడా.. అమ్మాయి చదువుకుందా, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంది.. తన కుటుంబాన్ని చూసుకుంటుందా.. వంటి రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే విష్ణు పురాణం ప్రకారం అబ్బాయిలు పెళ్లికి ముందు అమ్మాయిల్లో ఖచ్చితంగా.. కొన్ని క్వాలిటీస్ చూడాలని సూచిస్తోంది. మరి అవేంటో చూద్దామా..

నాలుగు గుణాలు
మహిళలు ఎవరైతే.. ఇక్కడ చెప్పబోయే ముఖ్యమైన నాలుగు లక్షణాలు కలిగి ఉంటారో.. అలాంటి వాళ్లను మగవాళ్లు పెళ్లిచేసుకోవాలని.. విష్ణుపురాణం చెబుతోంది.

ఒకే ఫ్యామిలీ
ఒకే ఫ్యామిలీకి చెందిన మహిళను ఎట్టిపరిస్థితుల్లో చేసుకోకూడదని.. విష్ణు పురాణం చెబుతోంది. ఒకవేళ వాళ్లిద్దరూ.. సిస్టర్స్, బ్రదర్ రిలేషన్ కాకపోయినా.. ఒకే గోత్రానికి చెందిన వాళ్లను పెళ్లిచేసుకోవడం అశుభం అని చెబుతోంది.

అవినీతి
అవినీతికి పాల్పడే మగవాళ్లు లేదా ఆడవాళ్లతో స్నేహం చేసే మహిళను మగవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటి వాళ్ల.. నెగటివ్ ఎఫెక్ట్ వల్ల.. మంచి భార్యగా ఉండలేరు.

అసభ్యకరమైన భాష
అసభ్యకరమైన పదాలు ఉపయోగించే మహిళలు, ఎక్కువగా తిట్టే మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. ఇలాంటి ప్రవర్తన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ని ఇవ్వలేదు.

ఎక్కువగా నిద్రపోయే మహిళలు
విష్ణు పురాణం ప్రకారం ఎక్కువగా నిద్రపోయే మహిళలను పెళ్లి చేసుకోకూడదట. ఇలాంటి వాళ్లకు.. ఇంట్లో పనులపై ఆసక్తి ఉండదు. తన కోసం, తన కుటుంబం కోసం పనిచేయలేని వాళ్లు.. మ్యారేజ్ ని రిస్క్ లో పడేస్తారు.

అందం మాత్రమే కాదు
సాధారణంగా.. అబ్బాయిలు తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు.. ఆమె తెలివితేటల కంటే.. అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ అందంగా ఉండి.. తెలివితేటలు లేని వాళ్లను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు.

గర్వంగా ఉండే అమ్మాయిలు
చాలా రూడ్ గా వ్యవహరించే అమ్మాయిలు చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలాంటి ఆడవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. ఇలాంటి అమ్మాయిలు భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తారు.

అపద్ధాలు చెప్పేవాళ్లు
భర్త విషయంలో అపద్ధం చెప్పిన మహిళలు.. వాళ్ల కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి మహిళలను పెళ్లి చేసుకోవద్దని విష్ణు పురాణం సూచిస్తోంది.

నిజాయితీ లేనివాళ్లు
నిజాయితీ లేని మహిళలు.. తమ కుటుంబం, భర్త విషయంలోనూ నిజాయితీగా ఉంటారిని చెప్పలేం. కాబట్టి.. ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిచేసుకోవద్దండి.

ప్రేమను పంచడం
సక్సెస్ ఫుల్ మ్యారేజ్ అంటే.. భార్యాభర్తలు ఇద్దరూ.. ఎలాంటి విషయాలు.. తమ భాగస్వామిని సంతోషపెడతాయి అని తెలుసుకున్నప్పుడే. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే.. వైవాహిక బంధం హ్యాపీగా ఉంటుంది.

అమితమైన ప్రేమ
ఒకవేళ మీరు మీ భాగస్వామిపై ప్రేమ కలిగి ఉంటే.. చూపించాలి. మీకున్న అమితమైన ప్రేమను.. ఒకరిపై ఒకరు చూపించుకోవాలి. అప్పుడు.. మీ ప్రేమ ఎక్కడికీ పోదు.

వదిలిపెట్టకండి
వాదించుకునేటప్పుడు.. ఒకరిని ఒకరు చూసుకోండి. ఒకవేళ మీ తప్పు లేకపోయినా.. ఒకరి మాటలు ఒకరు వినడం వల్ల.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

ప్రభావం
మీరు ఎలా ఉండాలి అనుకుంటే.. అలానే ఉండాలి అనుకుంటే.. మీ భాగస్వామికి కూడా అదే విలువ ఇవ్వాలి. వాళ్ల అభిరుచులను గౌరవించాలి.

సమస్యల పరిష్కారం
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కాబట్టి.. మీ ఇద్దరి మధ్య వచ్చిన సమస్యను.. కమ్యునికేషన్ తో పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఏ సమస్య వచ్చినా.. ఇద్దరు మాట్లాడితే.. సమస్య నుంచి బయటపడవచ్చు.

మిమ్మల్ని మీరు మార్చుకోవాలి
మ్యారేజ్ అంటే.. జీవితాంతం కాంప్రమైజెస్ ఉంటాయి. బాగుండటం కోసమే కాంప్రమైజ్ అవుతారు. కాబట్టి.. మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండటానికి కాంప్రమైజ్ అవండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి.



Click it and Unblock the Notifications