Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ రాశిప్రకారం ఏ కలర్ పర్స్ ఉపయోగిస్తే.. అదృష్టవంతులవుతారు !
సాధారణంగా చాలామందికి పర్స్ ని లక్కీగా ఫీలవుతారు. వాళ్లు ఎంతో కాలంగా వాడుతున్న పర్స్ ని వదిలిపెట్టడానికి చాలా ఫీలవుతారు. అలాగే.. కొన్ని పర్స్ లను లక్కీగా ఫీలవుతారు. వాటిని ఎంత పాతగా మారినా.. తమ దగ్గరే ఉంచుకుంటారు.
అయితే మీకు అదృష్టం వరించాలంటే.. మీ రాశిని బట్టి మీరు వాడాల్సిన పర్స్ కలర్ ని జ్యోతిష్యం సూచిస్తోంది. మీ రాశిని బట్టి మీరు మీ పర్స్ కలర్ ఎంపిక చేసుకుంటే.. అదృష్టం మీ వెంట వస్తుందట. ఎప్పటికీ.. డబ్బు లేదన్న బాధ, ఇబ్బంది మీ దరిచేరదట. ఇలాంటి విషయాలు కాస్త సిల్లీగా అనిపించినా.. ఒక్కసారి ఫాలో అయితే.. దీనివెనక ఉన్న పవర్ మీకే తెలుస్తుంది.
మామూలుగా అయితే.. నచ్చిన కలర్, లక్కీ కలర్, లేదా మీ పార్ట్ నర్ కి నచ్చిన కలర్ పర్స్ లను ఎంచుకుంటూ ఉంటారు. అదే.. ఇకపై మీ రాశిని బట్టి.. వాడాల్సిన కలర్ పర్స్ ని ఎంచుకోవడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ రాశి ప్రకారం మీరు ఏ కలర్ పర్స్ ఎంచుకోవాలో.. ఇప్పుడే.. చెక్ చేసుకోండి..

మేషరాశి
మేషరాశి వాళ్లను అంగారకుడు పాలిస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్లు.. మెరూన్ కలర్ పర్స్ లను వాడటం వల్ల లక్కీ సిగ్నల్స్ మీ చుట్టూ వైఫైలా ఉంటాయి.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లను శుక్ర గ్రహం పాలిస్తుంది. ఈ రాశి వాళ్లు ఖచ్చితంగా తెలుపు లేదా సిల్వర్ కలర్ పర్స్ ఉపయోగించాలి. అప్పుడే.. అదృష్టవంతులవుతారు.

మిధున రాశి
మిధున రాశి వాళ్లను బుధగ్రహం పాలిస్తుంది. కాబట్టి.. ఈ రాశివాళ్లు.. గ్రీన్ కలర్ పర్స్ లను ఉపయోగించడం వల్ల లక్కీ పర్సన్స్ గా మారిపోతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్లను చంద్రుడు పాలిస్తాడు. కాబట్టి.. కర్కాటక రాశివాళ్లు.. లైట్ కలర్ వాలెట్స్ లేదా పర్స్ లను ఖచ్చితంగా ఉపయోగించాలి.

సింహరాశి
సింహరాశి వాళ్లను సూర్యుడు పాలిస్తాడు. కాబట్టి.. సూర్యుడి దగ్గరి రంగులైన ఎల్లో, రెడ్, ఆరంజ్ పర్స్ లను సింహరాశి వాళ్లు ఉపయోగించాలి.

కన్యారాశి
కన్యారాశి వాళ్లను శుక్రగ్రహం పాలిస్తుంది. కాబట్టి.. కన్యారాశివాళ్లు ఖచ్చితంగా.. డార్క్ గ్రీన్ కలర్ పర్స్ లనే ఉపయోగించాలి.

తులారాశి
తులారాశి వాళ్లను పాలించేది బుధగ్రహం. కాబట్టి.. ఈ రాశివాళ్లు వైట్ లేదా సిల్వర్ లేదా మడ్ కలర్స్ ఉపయోగించాలి. ఈ కలర్స్ అంటే.. బుధుడికి చాలా ఇష్టమైనవి. వీటిని ఉపయోగించడం వల్ల లక్ మీ వెంటే ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిని అంగారకుడు పాలిస్తాడు. ఈ రాశి కిందకు వచ్చేవాళ్లు ఖచ్చితంగా ఎరుపు రంగు పర్స్ లనే ఉపయోగించాలి.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వాళ్లను బృహస్పతి గ్రహం పాలిస్తుంది. కాబట్టి.. ఈ రాశివాళ్లు ఎల్లో కలర్ పర్స్ లు, వాలెట్ లు ఉపయోగించడం చాలా మంచిది.

మకర రాశి
మకర రాశి వాళ్లను శని గ్రహం పాలిస్తుంది. ఈ రాశివాళ్లు.. బ్లాక్ కలర్ పర్స్ ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాలుగా కలిసొస్తుంది.

కుంభ రాశి
కుంభరాశి వాళ్లను కూడా శనిగ్రహమే పాలిస్తుంది. కాబట్టి.. ఈ రాశివాళ్లు.. డార్క్ కలర్స్ లేదా బ్లాక్ కలర్ పర్స్ ఉపయోగించడం వల్ల అదృష్టవంతులవుతారు.

మీన రాశి
మీనారాశి వాళ్లను బృహస్పతి పాలిస్తుంది. కాబట్టి.. ఈ రాశి వాళ్లు ఖచ్చితంగా ఎల్లో కలర్ పర్స్ లు ఉపయోగించాలి. దీనివల్ల వీళ్లకు ఎప్పుడూ.. ఆర్థిక సమస్యలు కలగవు.



Click it and Unblock the Notifications