Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ రాశిని బట్టి మీ లవ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకోండి..
జీవితంలో ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో తెలియదు అంటారు. నిజమే.. ఏ క్షణంలో మీ మనసుదోచే అమ్మాయి లేదా అబ్బాయి కనిపిస్తాడో.. ఎవరికీ తెలియదు. మనసుకి నచ్చే డ్రీమ్ గర్ల్ లేదా డ్రీమ్ బాయ్ ఏ ప్రాంతంలో తారసపడతారో కూడా ఊహించలేం.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటారు. మీ ప్రేమ రెస్టారెంట్ లో మొదలవుతుందో.. జిమ్ లో స్టార్ట్ అవుతుందో.. మీ డ్రీమ్ పార్ట్ నర్ పిక్ నిక్ లో కలుస్తారో.. లేదా ఫ్రెండ్స్ అందరితో సరదాగా గడిపే సమయంలో.. కేఫ్ లోనే ఎదురవుతారో.. తెలుసుకోవాలనుందా..
ఎంతో ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది కదూ. మీ లవ్ లైఫ్ జర్నీ ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవాలంటే.. ఎవరికైనా.. ఆసక్తిగానే ఉంటుంది. మరి మీ లవ్ లైఫ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ రాశిని బట్టి మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి తెలుసుకోవచ్చు.

మేష రాశి
మేష రాశివాళ్ల లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా ? జిమ్ లో. జిమ్, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ఎక్కడైనా.. మీ డ్రీమ్ పార్ట్ నర్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారు. ముఖ్యం ఫుడ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. లక్జరీ రెస్టారెంట్ లో వీళ్ల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రారంభమవుతుంది. రొమాంటిక్ క్లైమెట్, స్టైలిష్ ఫుడ్, వైన్ గ్లాస్ వీటన్నింటితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. మీ డ్రీమ్ గర్ల్ లేదా డ్రీమ్ బాయ్ మీ ముందు ప్రత్యక్షమై.. మిమ్మల్ని ఎట్రాక్ట్ చేస్తారు.

మిధున రాశి
కొత్తగా ఉండే సీనరీలను చూడటానికి మిధునరాశి వాళ్లు ఇష్టపడతారు. ఒకవేళ మీరు మిధునరాశి వాళ్లతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే.. బీచ్ లేదా గ్రీన్ ఫారెస్ట్ లేదా ఏదైనా రొమాంటిక్ ప్రదేశంలో మీ లవ్ ఎక్స్ ప్రెస్ చేస్తే.. ఇట్టే ఎట్రాక్ట్ అవుతారు. లేదా.. మీ లవ్ లైఫ్ ఏదైనా పిక్ నిక్ లో స్టార్ట్ అవుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశివాళ్లు వెచ్చగా, చాలా అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఇష్టపడతారు. మీరు కర్కాటక రాశివాళ్లకు లవ్ ప్రపోజ్ చేయాలి అనుకుంటే.. వాళ్లను కేఫ్ కి తీసుకెళ్లండి. ఒక వేడి వేడి కప్పు కాఫీ లేదా టీ మూడ్ ని రిఫ్రెష్ చేసి.. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకోండి. అంతే.. మీ లవ్ సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ మీరు కర్కాటక రాశి వాళ్లు అయితే.. మీ భాగస్వామిని కేఫ్ లోనే కలుస్తారు.

సింహ రాశి
సింహరాశి వాళ్ల లవ్ జర్నీ కచేరిలో మొదలవుతుందట. మ్యూజిక్ అంటే ఇష్టపడే సింహరాశివాళ్లు తమ పార్ట్ నర్ ని కచేరీలో కలుస్తారట. లేదంటే.. మీరు సింహరాశి వాళ్లను ఇష్టపడుతుంటే.. వాళ్లను కచేరీకి తీసుకెళ్లి ప్రపోజ్ చేయండి. సంగీత స్వరాలు వింటూనే.. మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.

కన్యా రాశి
కన్యారశి వాళ్లు సినిమాలు చూడటం, కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడాన్ని.. బోర్ గా ఫీలవుతారు. అందుకే వీళ్లు బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. కాబట్టి వీళ్ల లవ్ జర్నీ బుక్ షాప్ లా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కన్యారాశి వాళ్లను ఇష్టపడుతుంటే.. బుక్ స్టాల్ కి తీసుకెళ్లి.. మీ మనసులో మాటను పుస్తకాల్లో పదాల రూపంలో చూపించండి. అంతే మీకు ఫ్లాట్ అయిపోతారు.

తులా రాశి
తులారాశి మంచి మనసు కలిగినవాళ్లు. వీళ్లు అందంగా, సరైన బాడీ షేప్ కలిగి ఉంటారు. వీళ్లు టెన్నిస్ కోర్ట్ లో ప్రేమలో పడతారు. ఎందుకంటే.. వీళ్లు టెన్నిస్ ని ఇష్టపడతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్ల లవ్ పబ్ లో స్టార్ట్ అవుతుంది. డార్క్ షేడ్స్, మ్యూజిక్, కలర్ ఫుల్ గ్లాసు వీళ్లకు ఫేవరేట్. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పబ్ సరైన ప్లేస్. అందుకే.. ఇక్కడే వృశ్చిక రాశి వాళ్లు తమ లవ్ జర్నీ స్టార్ట్ చేస్తారట.

ధనస్సు రాశి
లైవ్ షోలో ధనస్సు రాశి వాళ్లకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్సీపిరియన్స్ అవుతుంది. ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. అలా మాటలు కలిసి.. మనసుకి దగ్గరవుతారు.

మకర రాశి
మకరరాశి వాళ్ల ప్రేమ ప్రయాణం.. పార్టీలో స్టార్ట్ అవుతుంది. పార్టీలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అందరితో కమ్యునికేట్ అవుతూ ఉంటారు. అలాగే.. వాళ్ల మనసుకి నచ్చినవాళ్లతో.. తన మనసులోని మాట చెప్పేస్తారు. ఇలా వీళ్ల లైఫ్ లో ప్రేమ మొదలవుతుంది.

కుంభరాశి
కుంభరాశి వాళ్ల లవ్ చాలా అడ్వెంచరస్ గా స్టార్ట్ అవుతుంది. మిస్టీరియస్ రూమ్ లో వీళిద్దరి మధ్య ప్రేమ పుడుతుందట. అదే సమయంలో తనను అర్థం చేసుకునేవాళ్లు, తన ఎమోషన్స్ కి విలువనిచ్చే వాళ్లు దొరికారన్న సంతోషం కలుగుతుందట. అలా వీళ్ల లవ్ స్టార్ట్ అవుతుందట.

మీన రాశి
మీనరాశి వాళ్ల లవ్ రొమాంటిక్ లవ్ సీన్ చూస్తుండగా.. వీళ్ల రియల్ లైఫ్ లో కూడా ప్రేమ గంటలు మోగుతాయి. సినిమా చూస్తుండగా.. వీళ్ల మనసులో ప్రేమ చిగురిస్తుంది. అలా వీళ్లు తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తారు.



Click it and Unblock the Notifications