For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ లైఫ్ సింపుల్ అండ్ స్మార్ట్ గా మార్చుకోవడానికి అమేజింగ్ బ్రెయిన్ ట్రిక్స్...

By Super Admin
|

బ్రెయిన్ హ్యాకింగ్ అంటే సాధన ద్వారా అప్పటివరకూ అలవాటు లేని పనులు మెదడు చేసేటట్లు చెయ్యడం.ఈ హ్యాక్స్(చిట్కాలు)మీ మెదడు పని తీరుని మెరుగుపరుస్తాయి.అసలు ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు మెదడు గురించి పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారన్నది నిజం.మెదడు కి లేనివి ఉన్నట్లు భావన కలిగించడం చాలా సులభం. ఉదాహరణకి మన చుట్టూ బాగా చల్లగా ఉందనుకోండి, చుట్టూ వేడిగా ఉంది అని అనుకుంటే వేడిగానే ఉంది అని మెదడు అనుకుంటుంది అందువల్ల మనమూ వెచ్చదనాన్ని అనుభూతి చెందుతాము.ఇదే ట్రిక్ మీ ఆందోళనలకి కూడా వర్తిస్తుంది.మన సమస్యల పట్ల సానుకూల దృక్పధంతో ఉంటే మన పరిస్థితి మెరుగుపడుతుంది లేదా కనీసం సమస్యల పట్ల మన దృక్పధం మారుతుంది.

అసలు మెదడు వల్లే మనకి మంచీ, చెడు తెలుస్తాయి. అందువల్ల ఈ మెదడు కి అంతా బాగుంది అనుకునేటట్లు చెయ్యగలిగితే మనకి నచ్చని విషయాలు కూడా కొన్ని రోజులకి మనకి నచ్చుతాయి.కొన్ని చిన్న చిన్న బ్రెయిన్ ట్రిక్స్ వల్ల పాజిటివ్ ఫలితాలు రాబట్టవచ్చు.మన జీవితాన్ని సరళం చేసే ఆ బ్రెయిన్ ట్రిక్స్ ఏమిటో చూద్దామా:

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

1.కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎడమ చేయి వాడండి
మీకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తున్నట్లయితే మీ మెదడు మీ కోపాన్ని నియంత్రించేటట్లు చెయ్యాలి.ఇందుకు ఒక చిన్న చిట్కా ఉంది.మీరు కుడి చేటి వాటం అయితే ఎడమ చేతితో పనులు చెయ్యండి లేదా ఎడమ చేతి వాటం అయితే కుడి చేతితో చెయ్యండి.అందువల్ల మీరు కోపంలో ఉన్నప్పుడు మీ భావాలని మీ మెదడు అదుపులో ఉంచగలుగుతుంది.

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

2.చేయి సంఙలు:
ఒక అధ్యయనం ప్రకారం మీరు కనుక ఇతరులతో మాట్లాడేటప్పుడు చేతుల ద్వారా సంఙలు చేస్తూ మాట్లాడితే కనుక ముఖ్యమైన విషయాలని మర్చిపోకుండా ఉంటారని నిరూపించబడింది.అందువల్ల మీరు మంచి భావ వ్యక్తీకరణ ఉన్న వ్యక్తిగా గుర్తించబడతారు.

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

3.క్రియేటివ్‌గా ఉండటానికి కనుబొమ్మ ఎగరేయడం:
మీ మెదడులోకి క్రియేటివిటీ(సృజనాత్మకత) రావాలంటే కనుబొమ్మలెగరెయ్యాలని ఒక అధ్యయనంలో నిరూపించబడింది. ఒక కనుబొమ్మని మాత్రమే ఎగరెయ్యడం ద్వారా గ్రాహ్య శక్తి పెరుగుతుంది.తద్వారా శ్రద్ధ పెరిగి ఇదివరకు లేని సృజనాత్మకత మీ సొంతమవుతుంది.

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

4.రాసి పెట్టుకోవడం:
మీకు కనుక మరునాడూ ప్రొద్దున్నే ఒక ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్నట్లయితే ముఖ్యమైన వాటిని గుర్తు పెట్టుకోవడానికక మార్గం ఉంది.మీకు కావాల్సిన ముఖ్య సమాచారాన్ని ముందు రోజు రాత్రి నిద్ర పోయే ముందు జాగ్రత్తగా రాసిపెట్టుకోండి.మీరు కనుక చదివిన వాటిని గుర్తు పెట్టుకుని పేపర్ మీద రాసిపెడితే ఆ సమాచారం మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది అని ఒక పరిశోధనలో నిరూపించబడింది.

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

5. సీరియస్ పరిస్థితుల్లో నవ్వడం:
పరిస్థితి సీరియస్ గా ఉన్నప్పుడు కూడా నవ్వగలిగితే కనుక మీ రక్తపోటు అదుపులో ఉండి అంతా బాగానే ఉంది అన్న సంకేతం మెదడుకి వెళ్తుంది(మన నవ్వు నిజం కాకపోయినా కానీ).

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

6.చెయ్యకూడని పనులు:
చాల మందికి చెయ్యల్సిన పనులు రాసి పెట్టుకునే అలవాటు ఉంటుంది.అందువల్ల వారి ప్లానింగ్ అదీ సరిగ్గా ఉండీ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలరు. కానీ చెయ్యకూడని పనులు కూడా రాసుకున్నట్లయితే మన ఉత్పాదకత పెరిగి చెయ్యాల్సిన పనుల జాబితా రాసుకున్నప్పటి కంటే సమర్ధవంతంగా పని చేస్తామని ఒక పరిశోధనలో నిరూపించబడింది.

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

7.మల్టీ టాస్కింగ్ మానెయ్యండి.
అన్ని పనులూ ఒకేసారి చేసే మల్టీ టాస్కింగ్ అలవాటు వల్ల మన ఙాపక శక్తి తగ్గి మన మెదడు పని తీరు కూడా తగ్గిపోతుందని ఒక అధ్యయనం లో నిరూపించబడింది.మన మెదడు ఒకేసారి వివిధ రకాల పనుల మీద ధ్యాస నిలుపలేకపోవడం ఇందుకు కారణం. మల్టీ టాస్కింగ్ వల్ల చేసే పనిలో నాణ్యత తగ్గి మీరు చేసే ప్రతీ పని మీదా శ్రద్ధ పెట్టలేకపోతారు.

English summary

Amazing Brain Tricks That Will Make Your Life Simple And Smart

Brain hacking means to trick the brain to do the things that it is not trained to do so. These hacks will improve the normal functioning of our brain.
Story first published:Thursday, June 30, 2016, 13:08 [IST]
Desktop Bottom Promotion