Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
టైటానిక్ గురించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్
టైటానిక్ అని వినగానే ముందుగా గుర్తొచ్చేది ప్రేమికులు. టైటానిక్ పేరుతో వచ్చిన సినిమాలో ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది. అయితే టైటానిక్ ప్రమాదం మాత్రం అందరికీ కన్నీటిసంద్రమే. ఈ సినిమా చూసేటప్పుడు ఆ విషాదగాధ చూస్తే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరగాల్సిందే.
1912లో జరిగిన యదార్థ సంఘటన గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ప్రమాదంలో ఐస్ గడ్డలో టైటానిక్ షిప్ ఇరుక్కుని 2 మూడు గంటలు అలానే ఉండిపోయింది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారు. ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయాలని టైటానిక్ షిప్ లో ప్రయాణిస్తున్న వాళ్లు అనుకోని ఉప్పెనలా వచ్చిన ప్రమాదం వాళ్ల ప్రాణాలు తీసుకుంది.
నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ షిప్ ఇరుక్కుంది. ఈ సంఘటన రాత్రి 11:40 కి జరిగింది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన టైటానిగ్ గురించి విషాదమే కాదు.. ఆశ్చర్యపరిచే నిజాలు దాగున్నాయి. టైటానిక్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

అతిపెద్ద షిప్
ఆర్ఎమ్ఎస్ టైటానిక్ షిప్ అతిపెద్ద షిప్. ఇది 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో పూర్తికాని ప్రయాణం చేసింది.

104 అడుగుల పొడవు
ఈ షిప్ ఎత్తు 882 అడుగులా 9 ఇంచులు, 92 అడుగుల వెడల్పు, 46 వేల 328 టన్నుల బరువు ఉంటుంది.

9 డెక్స్
ఈ టైటానిక్ం షిప్ లో 9 డెక్ లు ఉన్నాయి. వాటిని ప్రయాణికుల కోసం క్లాసులుగా విడదీశారు. లేటెస్ట్ మిషిన్లతో.. ఈ షిప్ లో జిమ్ కూడా ఉండేది. అలాగే.. లా కార్టే రెస్టారెంట్ బి డెక్ లో ఉంది. దాన్ని ఇటాలియన్ చెఫ్ రన్ చేసేవాడు.

800 టన్నుల బొగ్గు
ఈ అతిపెద్ద షిప్ నడపడానికి 800 టన్నుల బొగ్గును ప్రతి రోజూ ఉపయోగించేవారట. ఈ షిప్ గంటకు 27 మైళ్ల దూరంతో దూసుకెళ్లేదట.

ఎలక్ట్రిసిటి
టైటానిక్ షిప్ లో ఇంటీరియర్ డెకరేషన్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. వెండి స్పూన్లు, ఖరీదైన వంట సామాగ్రి ఉండేది. ఈ షిప్ లో ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ కనెక్షన్ కూడా ఉండేది.

టైటానిక్ న్యూస్ పేపర్
టైటానిక్ షిప్ కి సొంత ప్రింటెడ్ పబ్లికేషన్ ఉండేది. అట్లాంటిక్ డైలీ బులిటెన్ పేరుతో ఉండే న్యూస్ పేపర్ లో యాడ్స్, న్యూస్, ఎంటర్ టైన్మెంట్, స్టాక్ మార్కెట్, గాసిప్స్, హార్స్ రేసింగ్ రిజల్ట్స్ ఇలా అన్నీ ప్రచురితమయ్యేవి.

అమెనిటీస్
టైటానిక్ షిప్ లో 4 ఎలివేటర్స్, 2 బార్బర్ షాప్స్, 1 హీటెడ్ స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉండేలి. రెండు పెద్ద లైబ్రరీలు కూడా ఉన్నాయి.

నీళ్లు
ఈ షిప్ 3వేల 547 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ప్రయాణికులు, వర్కర్లు తాగడానికి 14 వేల గలాన్ల నీటిని సరఫరా చేసేవాళ్లట.

చిమ్నీస్
పొగ బయటకు వెళ్లడానికి ఈ షిప్ కి నాలుగు చిమ్నీలు ఉండేవి. కానీ మూడు మాత్రమే ఉపయోగించేవాళ్లు. నాలుగోది షిప్ అందంగా కనిపించడానికి కట్టారు.

టిక్కెట్
ఇది టైటానిక్ షిప్ లో ఫస్ట్ క్లాస్ టికెట్. ప్రస్తుతమున్న వ్యయంతో పోల్చితే ,.. ఈ టిక్కెట్ ఖరీదు.. 99 వేల డాలర్లు.

ఫుడ్ సప్లై
2వేల 200 మంది ప్రయాణికులకు 86 వేల పౌండ్ల మాంసం, 40 వేల ఎగ్స్, 40 టన్నుల బంగాళదుంపలు, 3వేల 500 పౌండ్ల ఉల్లిపాయలు, 36 వేల యాపిల్స్ సప్లై చేసేవాళ్లు.



Click it and Unblock the Notifications
