For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ల వెంట కన్నీరు తెప్పించే ప్రేమికుల ప్రేమ కథ ఇది..!

|

మనందరం మన ప్రేమ కధల గురించి కలలు కంటూ ఉంటాము, ప్రత్యేకంగా మన చుట్టూ సంతోషంగా ఉండే జంటను చూసినపుడు. పంచుకోవడానికి అద్భుతమైన ప్రేమ కధ ఉన్నవారు చాలా అదృష్టవంతులు.

అనవసరమైన అనేక రకాల గొడవల వల్ల విడాకులు లేదా తెగ తెంపులు చేసుకోవడం మనం చూసాం. ఒక జంట వారి అనుబంధం కోసం తాపత్రయ పడినపుడు ఇలాంటివి జరగవు; ఈ విషయం ఒక అందమైన, ప్రేరణా పూరితమైన ప్రేమ కధను సృష్టిస్తుంది.

ఇక్కడ, ఈ వ్యాసంలో, ఒక మిలటరీ వ్యక్తి తన ప్రేమ జీవితంలో మార్చుకున్న విషయాలను ప్రేరణా పూరితం, నిజమైన ప్రేమ కధ ను మనం పంచుకుందాం.

ప్రేమికుల భావాలూ ఎప్పుడూ నిజాయితీగా ఉంటే, ప్రేమ అనేది పూర్తిగా షరతులు లేనటువంటిది, దాన్ని అడ్డుకునేవారు ఎవరూ లేరని ఈ కధ వల్ల మనం గ్రహించవచ్చు.

జీవితంలో ఈ అత్యంత అద్భుతమైన, ప్రభావితం చేసే ఈ ప్రేమకధ మీ ముఖంపై చిరునవ్వును తెస్తుంది.

వారు కలిసినపుడు....

వారు కలిసినపుడు....

వారు చాలా కాలం నుండి సహవిద్యర్ధులు, వారి స్నేహం ప్రేమగా చిగురించింది. వారిద్దరూ వేరువేరు కులాలకు చెందిన వారు, కానీ వారు భవిష్యత్తులో కలిసి ఉండాలనే కలలకు అవి అడ్డం కావు.

మొదట్లో కుటుంబం వ్యతిరేకం...

మొదట్లో కుటుంబం వ్యతిరేకం...

ఆ అబ్బాయి తక్కువ కులానికి చెందినప్పటికీ ఆర్మీలో పనిచేస్తాడు, ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనే సందేహం ఆ కుటుంబానికి ఉంది. అయితే, వారిద్దరూ ఇష్టపడుతున్నారు, వారికి జీవితాన్ని ఇద్దాం అని తలిదండ్రులు గ్రహించారు.

యుద్ధ సన్నివేశం జరిగింది....

యుద్ధ సన్నివేశం జరిగింది....

ఆ అబ్బాయిని అత్యవసరంగా యుద్ధానికి పిలిచారు. కానీ అతను వెళ్లేముందు, మోకాలు మీద కూర్చుని తను ఎక్కువగా ప్రేమించే ఆ అమ్మాయికి ప్రేమ ప్రతిపాదన చేసాడు. వారికి నిశ్చితార్ధం జరిగింది, తరువాతి సంవత్సరం వివాహం చేద్దామని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రతిదీ ఖచ్చితంగా కనిపించింది.

విషాదం అలుముకుంది!

విషాదం అలుముకుంది!

అతను యుద్ధానికి వెళ్ళే ముందు, ఒకరోజు ఆమె అతని బైక్ మీద ప్రయాణం చేస్తుంది, దాదాపు చచ్చిపోయినంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆమె కోమా లోకి వెళ్ళింది. ఆమె అందమైన ముఖంపై తగిలిన దెబ్బలను చూసి భయపడని వారు లేరు.....

ఒకరోజు ఆమె లేచింది.....

ఒకరోజు ఆమె లేచింది.....

చివరిగా, ఒకరోజు ఆమె లేచి, ఆమె మంచం పక్కన ఉన్న తన తల్లిదండ్రులను చూసింది. ఏడ్చింది, ఆమెకేదో చెడు జరిగిందని తెలుసుకుంది. ఆమె వెంటనే అద్దం చూపించమని తల్లిదండ్రులను ప్రాధేయపడింది, ఆమె మనసు ముక్కలై, కళ్ళ వెంట నీళ్ళు రాలాయి.

ఆమె వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది....

ఆమె వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది....

తను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తీ జీవితాన్ని నాశనం చేయడం ఆమెకు ఇష్టం లేదు. అతని ఫోన్ కు సమాధానం చెప్పలేదు, అతని మెయిల్స్ కు సమాధాన౦ చేయలేదు. తన గదిలో ఏడుస్తూ కాలం గడుపుతుంది, ఆరోజు చనిపోయి ఉంటే బాగుండేది అనిమాత్రమే అనుకుంటుంది.

చివరికి, ఇది జరిగింది....

చివరికి, ఇది జరిగింది....

ఆ అమ్మాయి తల్లి గదిలోకి వచ్చి, "అతను వెనక్కు వచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు" అని చెప్పింది. ఆమెకు గుండె ఆగినట్టైంది, కళ్ళు తుడుచుకుని, వాల్ల అమ్మ ఈ అమ్మాయికి చూపిద్దామని తీసుకువచ్చిన వివాహ పత్రికను తీసుకుంది. ఆ పత్రిక మీద తన పేరు చూసి, తన తల్లివైపు ఏమీ అర్ధం కానట్టు చూసింది.....

ఆమె విస్మయంతో చూసింది!

ఆమె విస్మయంతో చూసింది!

ఒక పూలగుత్తితో అతను గదిలోకి వచ్చి, ఆమెకు జరిగిన వివరాలు అన్నీ తనకు తెలుసనీ, తన తల్లితో అతను మాట్లాడుతున్నట్టు, ఆమె ఫోటోలను తనతో షేర్ చేసుకున్నట్టు చెప్పాడు.

ఆమె అందంగా ఉండేదని అతనికి తెలుసు...

ఆమె అందంగా ఉండేదని అతనికి తెలుసు...

ప్రతిసారీ అతను ఆ చిత్రం వైపే చూస్తాడు, అతనికి ఆమెపై ఉన్న ప్రేమలో ఎటువంటి మార్పు లేదని అతను తెలుసుకున్నాడు, అతనికి ఇప్పటికీ ఆమె అందంగానే కనిపిస్తుంది, తను ఎక్కువగా ప్రేమించిన ఆ అమ్మాయినే తను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అతనికి తెలుసు...

మంచిది, జీవితంలో షరతులు లేని ప్రేమకు మించిన అందమైనది, అద్భుతమైనది మరోటి లేదని మనకు స్పష్టమైంది. మీరేమనుకుంటున్నారు?

English summary

An Unconditional Love Story...

We all dream of having our own love stories, especially when we see a happy couple around us. Lucky are those who have an amazing true love story to share.We have seen so many unnecessary feuds that lead to divorce or breakups. These can all be avoided when the couple work towards their relationship; and that is something which will create a beautiful and inspirational love story.
Story first published: Thursday, September 22, 2016, 17:36 [IST]