For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఒక్క క్షణం మౌనంతో పొందే..ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో..!!

|

కోపంలో ఉన్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ముందుకు సాగడం ఉత్తమం. వీలైనంత వరకు కోపంగా ఉన్నప్పుడు కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. ఇబ్బంది కలిగించిన అంశాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మౌనం అనేది కొన్ని సందర్భాలో ఒక పవర్ ఫుల్ వెపన్ లా పనిచేస్తుంది. భావోద్వేగానికి గురైనప్పుడు, సైలెంట్ గా ఉన్నడటం వల్ల బ్లడ్ ప్రెజర్ ఎలా తగ్గుతుంది? ఆ ఒక్క క్షణం మౌనంగా ఉండటం వల్ల జీవితంలో ఎంత మార్పులు వస్తాయో తెలుసుకుంటారు.

కోపం వస్తే కొందరు ఆ కోపాన్ని వారి భాగస్వామిపై చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆ తర్వాత ఎంత పశ్చాతాప పడినా ప్రయోజనం ఉండదు. కోపాన్ని తగ్గించుకోవడం కొందరికి కష్టమైన పనే. అయితే దాని నుంచి నెమ్మదిగా బయటపడటానికి ప్రయత్నించాలి.

అలాగే కొన్ని విషయాల్లో దంపతుల మధ్య కోపతాపాల వల్ల విభేదాలు రావడం సహజం. అయితే వాటిని పట్టించుకోకుండా కలిసి ముందుకు సాగితేనే వారివారి దాంపత్య జీవితాలు బాగుంటాయి.

అసూయ లేదా పగను పెంచుకోవటం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ముందుకు సాగడం ఉత్తమం. అనుకూలంగా లేని, ఇదివరకు ఇబ్బంది కలిగించిన వాటి గురించి ఆలోచించడం మానేయండి.

కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది. ఒకవేళ మాట్లాడి ఏదైన నోరు జారితే ఆ తర్వాత తీవ్ర పశ్చాతాప పడాల్సి వస్తుంది. అందువల్ల అటువంటి సమయంలో వీలైనంతవరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కోపంగా ఉన్న సమయంలో మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు మౌనంగా ఉండటం ఉత్తమం.

రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం.

ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.

ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.

మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.

మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది.

మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది.

మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా?

 ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

సైలెంట్ క్రీయేటివ్ :

సైలెంట్ క్రీయేటివ్ :

క్రియేటివ్ అంటే ఏదో కొత్తదనం . ఆ కొత్త దనమే జీవితంలో కోరుకునేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది.

మౌనం ఇద్దరి మద్య సంబంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది:

మౌనం ఇద్దరి మద్య సంబంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది:

మౌనం అర్ధంగీకారం అని ఊరకనే అనలేదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. మౌనంగా ఉండటం వల్ల మీ గుండె చప్పుడు మీరే వినవచ్చు. ఇద్దరి వ్యక్తుల మద్య నమ్మకం ఏర్పడుతుంది.

 బ్యాలెన్స్ తప్పతుంది

బ్యాలెన్స్ తప్పతుంది

సైలెంట్ గా ఉండటం వల్ల జీవితంలో బ్యాలెన్స్ తప్పతుంది, జీవితంలో ఆందోళన, మరియు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. సైలెంట్ గా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్నపరిస్థితులు సమతుల్యమవుతాయి. విషయాలను మరింత ఏకాగ్రతగా ఆలోచించడం లేదా అర్ధం చేసుకోవడం జరుగుతుంది.

మౌనంగా ఉండటం వల్ల మనస్సుకు శాంతి చేకూరుతుంది:

మౌనంగా ఉండటం వల్ల మనస్సుకు శాంతి చేకూరుతుంది:

సైలెంట్ గా ఉండటం వల్ల చాలా ముఖ్యం. ఎందుకంటే, శరీరంలో రిథమ్, రేట్ ఆఫ్ బ్రీతింగ్ ఆలస్యమవుతుంది. హార్ట్ రేట్(గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం కూడా తగ్గుతుంది). మనస్సు ప్రశాంత పరుస్తుంది.

మౌనంగా ఉండటం వల్ల మరింత స్ట్రాంగ్ అవుతారు:

మౌనంగా ఉండటం వల్ల మరింత స్ట్రాంగ్ అవుతారు:

మౌనంగా ఉండటం వల్ల మమ్మిల్ని మరింత స్ట్రాంగ్ గా మార్చుతుంది. మీ చుట్టు ప్రక్కల ఏం జరుగుతున్నా మీరు పట్టించుకోరు. మనస్సు స్ట్రాంగ్ గా మార్చుకుంటారు. సైలెంట్ గా ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ బెనిఫిట్.

మైండ్ ఫ్రీ అవుతుంది:

మైండ్ ఫ్రీ అవుతుంది:

నిశ్శద్దంగా ఉండటం వల్ల మైండ్ ఫ్రీ అవుతుంది. ఆలోచనలు కొత్తగా ఉంటాయి. సైలెంట్ గా ఒంటరిగా కూర్చోవడం వల్ల ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు. ఇతరులను మంచిగా అర్ధం చేసుకోగలుగుతారు.

" మౌనం".

ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది. అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా.

English summary

Benefits Of Remaining Silent

Being silent at times is really powerful than expressing out your emotions in certain things. One needs to remember that being silent always works when it is least expected.
Story first published: Monday, August 22, 2016, 18:07 [IST]
Desktop Bottom Promotion