Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ?
లైఫ్ లో సక్సెస్ అవ్వాలని, మంచి కెరీర్ ఎంచుకోవాలని, ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. కెరీర్ ఛాయిస్ లో వేసే తప్పటడుగులే.. వాళ్ల ఫెయిల్యూర్ కి కారణమవుతుంటాయి. కొంతమంది వాళ్లు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు.

అయితే టాలెంట్ ని, మీ చదువుని, మీరు చేసిన డిగ్రీని, ఆర్థిక స్థోమతను బట్టి ఎంచుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా.. అదే ప్రొఫెషన్ లో వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్లు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు. ఏది ఏమైనా.. మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది.
జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునే శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అందుకే ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్నవాళ్లకు ఈ ఆర్టికల్ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ రాశిని బట్టి మీరు మీ కెరీర్ ని ఎంచుకోవచ్చు. మరి మీకు కలిసొచ్చే కెరీర్ ఏంటో చూసేద్దామా..

మేషరాశి
మేషరాశి వాళ్ల బుర్ర చాలా పదునుగా ఉంటుంది. చాలా పట్టుదల కలిగి ఉంటారు. వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాలు, రెస్క్యూ వర్క్ లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.

వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు హార్ట్ వర్క్ చేస్తారు. వీళ్లు చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు. డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.

మిధున రాశి
మిధున రాశి వాళ్లు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు. వీళ్ల టాలెంట్ కి, వీళ్ల మనస్తత్వానికి స్టాక్స్ లో వర్క్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. లేదా టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ కూడా సక్సెస్ అవుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశివాళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు. వీళ్లు టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్, గార్డెనర్స్ జాబ్స్ కి బాగా సూట్ అవుతారు. సక్సెస్ ఫుల్ అవుతారు.

సింహరాశి
సింహరాశి వాళ్ల పర్సనాలిటీకి తగ్గట్టు.. చాలా మంచి కెరీర్ ఉంటుంది. వీళ్లకు భయమంటే తెలియదు. వీళ్లు కెరీర్ లో బాగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు. అలాగే డబ్బులు సంపాదిస్తారు. వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.

కన్యా రాశి
కన్యా రాశి వాళ్లు చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. వీళ్లు ఎడిటింగ్, వ్రైటింగ్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్ జాబ్స్ లో సెటిల్ అవడం మంచిది.

తులారాశి
తులారాశివాళ్లు మంచి తెలివైనవాళ్లు. వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి. వీళ్లు చర్చలను ఇష్టపడతారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కాబట్టి వీళ్లు లాయర్స్ గా రాణిస్తే.. మంచి జీవితం ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్లకు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వాళ్లు చాలా సైలెంట్ గా ఉంటారు. ట్రావెలింగ్ ను ఇష్టపడతారు. జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువగా ఆధ్మాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీళ్లు ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.

మకర రాశి
మకర రాశి వాళ్లు చాలెంజ్ లను ఇష్టపడతారు. అప్పుడే సంతోషంగా ఉంటారు. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఉంటారు. వీళ్లు కెరీర్ ఎంపికలో ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.

కుంభరాశి
కుంభరాశి వాళ్లు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం అలవాటు. చాలా క్యూరియాసిటీగా ఉంటారు. కాబట్టి వీళ్లు మంచి సైంటిస్ట్ లు అయ్యే అవకాశాలున్నాయి. లేదా ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.

మీన రాశి
మీన రాశి వాళ్లు సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు. కాబట్టి వీళ్లు ఆర్టిస్ట్ లు మంచి లైఫ్ ఉంటుంది.



Click it and Unblock the Notifications
