For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి మీ బాడీ షేప్ కు ఎటువంటి దుస్తులు ఫర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి..

|

నలుగురికి నచ్చినది మీకస్సలు నచ్చకపోవచ్చు.. పరులెవరూ మెచ్చని వాటినే మీరు కావాలనుకోవచ్చు.. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ.. ఐకాన్‌లుగా ఉండాలనుకునేవాళ్లే! మీ రాశిని బట్టి మీ ఎంపిక ఉంటుందనే విషయం తెలుసా?

శరీరాకృతినిబట్టి మాత్రమే కాకుండా వారి వారి రాశులను బట్టి, వారి మనస్తత్వాలను అంచనా వేసి వారికి సరిపోయే దుస్తులను డిజైన్‌ చేయడం నేటి ఫ్యాషన్‌ స్టైల్‌. ఇతరులకు డ్రెస్సులను బహుమతులుగా అందించేటప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. వారి రాశేంటో తెలుసుకుని వారు మెచ్చే డ్రెస్‌ను అందజేయవచ్చు.

మేషరాశి :

మేషరాశి :

వీరు అందరికీ అనుసరణీయులు. చూడగానే ఆకట్టుకునే రూపం కలిగి ఉంటారు. వీరికి పొడవాటి దుస్తులు బాగా నప్పుతాయి. అందరిలో అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటారు.నలుగురిలోనూ సెంటర్‌ ఆఫ్‌ది ఎట్రాక్షన్‌గా ఉంటారు. సెక్సీగా,బోల్డ్‌గా కనిపించే డ్రెస్సులు వీరికి బాగా నప్పుతాయి. మగువలకు టైట్‌ జీన్స్‌లు, బ్లాక్‌ స్కర్ట్‌లు అమరినట్లు సరిగ్గా సరిపోతాయి. శరీరానికి అతుక్కుపోయే డ్రెస్సులలో వీరు మరింత అందంగా కనిపిస్తా రు. మగవారు ఎక్కువగా నల్లని ట్రౌజర్స్‌ను ఇష్టపడతారు.

వృషభ రాశి :

వృషభ రాశి :

ఈ రాశివారు ఎక్కువగా డిజైన్‌ డ్రెస్సులను ఇష్టపడతారు. వీళ్లకి టైట్‌గా ఉండే దుస్తులు బాగోవు. అలాగని మరీ లూజ్‌గా ఉండేవి, మరీ పొడవుగా ఉండేవి కూడా అంతగా బాగుండవు. సాదా డ్రెస్సులే బాగుంటాయి. వీళ్లు ఏదైనా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొత్త డ్రెస్సులు కొనుగోలు చేస్తుంటారు.

మిధున రాశి :

మిధున రాశి :

ఈ రాశి వారు ఆర్భాటంగా కనిపించే డ్రెస్సులు వేసుకోనవసరం లేదు. వాళ్లు సహజంగా అందమైన ముఖవర్ఛస్సు గలవారు. వీళ్లకి కాటన్‌ దు స్తులు బాగా సరిపోతాయి. పైగా వీళ్లు ఏ పార్టీలోనైనా ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేక భావాలు కలిగివుంటారు.మగువలకు కాటన్‌ దుస్తులు, అందుకు అనుగుణమైన హైీహల్స్‌ స్యాండల్స్‌ చాలా బాగుంటాయి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

వీరు ఎప్పుడూ ఏదో మూడీగా ఉంటారు. లేదా చాలా కోపంగానైనా ఉంటారు. వీళ్లు ఎప్పుడూ తమ మూడ్‌కు తగిన డ్రెస్‌నే ధరించడానికి ఇష్టపడతారు. ఆడవారికి సిల్కీకాటన్‌ చీరలుగానీ, డ్రెస్సులుగానీ బాగుంటాయి. ఎక్కువగా పారదర్శకంగా ఉండే దుస్తులు, లైట్‌ కలర్స్‌, ఎంబ్రాయిడరీ డిజైన్‌ లంటే వీరికి మక్కువ.

సింహ రాశి :

సింహ రాశి :

ఈ రాశికి తగ్గట్లే సింహంలా దర్పం గా ఉండాలనుకుంటారు. వీరు వేసుకునే డ్రెస్‌లోనే దర్పం ఉట్టిపడేవిధంగా ఉంటుంది. కాకపో తే వీళ్లు కూడా ఒక్కొక్కసారి బాగా ఆకర్షణీయం గా ఉండాలని కోరుకుంటారు.ఒక్కొక్కప్పుడు చెదిరిన జుట్టుతో చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తారు. క్రీమ్‌ కలర్‌ టాప్‌, టైట్‌ జీ న్స్‌ మగువలకి బాగుంటాయి. ఏదైనా పార్టీలలో ఆడవాళ్లు ప్రత్యేకంగా కనిపించాలంటే చేతితో వేసిన పెయిం టింగ్‌ డ్రెస్సులు బాగుంటాయి.

కన్య రాశి :

కన్య రాశి :

వీరు స్కూలు యూనిఫాంలో చూడముచ్చటగా ఉంటారు. వీరికి తెలుపు దుస్తులు చాలా బాగుంటాయి.ఎక్కువగా నగ లు కనిపించేలా డ్రెస్సులు వేసు కుంటే వీరికి అస్సలు బాగుం డదు. చేతితో వేసిన పెయిం టింగ్‌, పారదర్శకంగా కనిపించే ఫ్యాబ్రికేటెడ్‌ డ్రెస్సు లు వీరి అందాన్ని రెట్టింపు చేస్తాయి.

తుల రాశి :

తుల రాశి :

వీరు వేసుకునే దుస్తులు సహజంగా వీరిని ఎక్కువ సెక్సీగా కనిపించే లా చేస్తాయి. ఈ రాశివారు శృంగార ప్రియులు. గులాబి, పసుపు, నలుపు, గ్రే కలర్‌ డ్రెస్సులు వీరికి చాలా బాగుంటాయి. వీరి ముఖానికి చిరునవ్వే అందం. మగవారు సంప్రదాయ దుస్తుల లో చాలా బా గుంటారు. ఎ క్కువగా మెరిసిపోయే రంగులతో కూడిన డ్రెస్సులకు ఆడవారు సాధ్యమైనంతదూరంలో ఉండటమే మంచిది. జుత్తు ఎప్పుడూ కూడా చెదిరిపోకుండా ఉండే లా చూసుకోవాలి.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

ఈ రాశిగలవారు శృంగారంగా కనిపించే డ్రెస్సులలో సింగారించుకుంటే చాలా బాగుం టుంది. వీరికి ఎక్కువగా నలుపు, కాఫీరంగు కలర్స్‌ సూటవుతాయి. వెల్‌వెట్‌, క్రీప్‌ కలర్స్‌ ఆడవారికి బాగా నప్పుతాయి.మగువల కు నలుపు, కాఫీరంగు డ్రెస్సులు పా ర్టీలలో మంచి గుర్తింపు లభించేలా చేస్తాయి.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

వీరు ఎక్కడ సమావేశమయినా గుర్తింపు కోసం తహతహలాడుతారు. వీళ్లు డ్రెస్‌ సెలక్షన్‌ విషయంలో ఎవరి మాట వినరు. వారికి నచ్చిందే వేసుకుంటారు. అది ఒక్కొక్కప్పుడు వారు ఎంచుకున్న డ్రెస్‌ ఎదుటివారి విమర్శ కు తావిస్తుంది. వీరికి సంప్రదాయక, ఆధునిక దుస్తులు ఏమైనా బాగానే ఉంటా యి. ఆడవారికి పసిడిరంగు దుస్తులు వారి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. అ యితే దుస్తుల ఎంపికలో వీళ్లకు కొంచెం తొందరపాటు ఎక్కువగా ఉంటుంది.

మకర రాశి :

మకర రాశి :

వీళ్ల ఆలోచనలు చాలా ఉన్నతస్థాయిలో ఉంటాయి. అధిక ఆలోచనాపరులు. సాదాసీదా జీవనానికే వీళ్లు ప్రాముఖ్యమిస్తారు.ఫ్యాషన్లను అసలే పట్టించుకోరు. భౌతిక అందానికి అంతగా మెరుగులు పెట్టరు.అయితే వీరికి ఎక్కువగా నలుపు రంగు డ్రెస్సులు బాగుంటాయి.

కుంభ రాశి :

కుంభ రాశి :

ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వీరు డ్రెస్సులు ధరించడానికి ఇష్టపడతారు. అయితే వీరికి లైట్‌ కలర్స్‌ అంతగా బాగుండవు. నలుపు, మెరూన్‌, ఊదా రంగులలో వీరు మెరిసిపోతారు. ఆడవారి అందం ద్విగుణీకృతం అవుతుంది. ఎక్కువ డిజైన్‌లతో కూడిన రంగుల చీరలు ఆడవారికి బాగుంటాయి.

మీన రాశి :

మీన రాశి :

వీరికి సెంటిమెంట్లు ఎక్కువే. సెంటిమెంటు ప్రకారమే వాళ్ల డ్రెస్సులు, అభిరుచులు ఉంటాయి.హ్యాండ్‌ పెయింటింగ్‌, ఫ్లోరల్‌ డిజైన్డ్‌ డ్రె స్సులు వీరికి బాగా నచ్చుతాయి. ప్రతి విషయాన్ని వీళ్లు గుంభనంగా ఉంచుకుంటారు. ఏదీ ఓ పట్టాన బయటపెట్టరు. వీరికి కుంకుమరంగు, నీలం, ఆకుపచ్చ రంగుల వస్త్రాలు బాగుంటాయి.

English summary

Best Dresses acording to your Zodiac Sign

You turn to your horoscope for insight into your love life, friendships, and school, so why not look to the stars for style guidance, too?
Desktop Bottom Promotion