Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
జైలుకు వెళ్లిన పాపులర్ స్టార్స్ ఎవరు ?
బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన తారలు. తమకంటూ.. ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్న రాక్ స్టార్స్. ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్. ఇదంతా సినిమాల పరంగా సంపాదించిన క్రెడిట్. కానీ.. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ర్టీలో జైలుకెళ్లిన పాపులర్ స్టార్స్ ఉన్నారు. చిన్నదైనా.. పెద్దదైనా నేరం నేరమే. అందుకే.. తప్పు ఎలాంటిదైనా.. వాళ్లు జైలుకి వెళ్లి, శిక్ష అనుభవించక తప్పలేదు. బాలీవుడ్ లో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని పాపులర్ అయినా కూడా క్రైమ్ లో ఇరుక్కున్న స్టార్స్ ఎవరు ? అసలు ఎలాంటి కేసుల్లో వాళ్లు జైలు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ? ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
సినిమాల్లోకి రాకముందు మన స్టార్స్ చేసిన జాబ్స్ ఏంటి ?
సోనాలి బింద్రే
మత సమస్యల బాధితురాలు సోనాలి బింద్రే. కొంతమంది ఆమెపై మతానికి వ్యతిరేకంగా.. మ్యాగజైన్ కవర్ పై ఫోజులిచ్చిందని.. కేసు పెట్టారు. దీంతో ఆమె జైలు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్ రావడంతో.. బయటకు వచ్చింది.

జాన్ అబ్రహాం
మోడల్, యాక్టర్ జాన్ అబ్రహాం కూడా ర్యాష్ డ్రైవింగ్ కేసులో జైలు కెళ్లాడు. 2006లో ముంబైలో ఇద్దరు వ్యక్తులను బైక్ డ్రైవ్ చేస్తూ.. యాక్సిడెంట్ చేయడం వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
ముక్కు సర్జరీలతో ముఖారవిందం మార్చుకున్న బోల్డ్ బ్యూటీస్
మోనికా బేడి
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మోనికా బేడీకి అండర్ వరల్డ్ డాన్ అబూ సలేమ్ తో సంబంధం ఉందని.. అభియోగాలతో జైలు కెళ్లింది. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత జైలు నుంచి విడుదలై.. 2013 నుంచి టీవీ ప్రోగ్రామ్స్ కనిపించింది.

సైఫ్ అలీఖాన్
చోటే నవాబ్ సైఫ్ అలీఖాన్ కోపం జైలుకి వెళ్లేలా చేసింది. సైఫ్ తన భార్య కరీనా కపూర్, కరీనా సోదరి కరిష్మాతో కలిసి రెస్టారెండ్ కి వెళ్లారు. అక్కడ ఒక అబ్బాయిని కోపంగా కొట్టడంతో.. అతడి ముక్కుకి దెబ్బతగిలింది. దీంతో.. బాధితుడు కేసు పెట్టడంతో.. అరెస్ట్ చేశారు.
సెలెబ్రిటీల యొక్క చర్మ సంరక్షణ చిట్కాలు
సంజయ్ దత్
సంజయ్ దత్ ఒక సారి.. అనేకసార్లు జైలు కెళ్లాడు. తన ఇంట్లో ఇల్లీగల్ గా ఆయుధాలు పెట్టుకోవడంతో.. పూనెలోని యెర్వదా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ముంబై బాంబు పేలుళ్లకు సంజయ్ దత్ ఆయుధాలు సరఫరా చేశాడని నిర్ధారణ కావడంతో.. ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు.

సల్మాన్ ఖాన్
సల్లూభాయ్ పైన ఒకటి కంటే.. ఎక్కువే కేసులు ఫైల్ అయ్యాయి. తాను నటించిన రాజస్థాన్ సినిమా షూటింగ్ సమయంలో జంతువులపై కాల్పులు జరిపాడన్న అభియోగంతో.. జైలుకి వెళ్లాడు సల్మాన్. అలాగే 2002లో హిట్ అండ్ రన్ కేసులో కూడా జైలుకి వెళ్లాడు.



Click it and Unblock the Notifications