Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ఈ డేట్ లో పుట్టిన వారికి ముక్కు మీద కోపం ....ఎక్కువే, కాస్త జాగ్రత్తగా ఉండండి...
సాధారణంగా 19వ తేదీన పుట్టిన జాతకులు ఎవరి ఆధీనంలోనూ ఉండేందుకు ఇష్టపడరని జ్యోతిష్కులు చెపుతున్నారు. ఇతరుల సలహాలను స్వీకరించడానికి వీరి మనస్సు అంగీకరించదు
సాధారణంగా 19వ తేదీన పుట్టిన జాతకులు ఎవరి ఆధీనంలోనూ ఉండేందుకు ఇష్టపడరని జ్యోతిష్కులు చెపుతున్నారు. ఇతరుల సలహాలను స్వీకరించడానికి వీరి మనస్సు అంగీకరించదు. ఈ స్వభావం కారణంగా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ తేదీలో పుట్టిన స్త్రీ పురుషులు స్థిర మనసత్త్వంతో, స్వతంత్రులుగా ఉంటారు. కళలు, సాహిత్యంపై వీరికి మక్కువ ఎక్కువ. అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండే వీరు.. అన్ని రంగాల్లో రాణించి, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు.

ఇతరుల సమస్యలను పరిష్కరించేందుకు వివిధ రకాలైన అభిప్రాయాలను, సూచనలను ఇచ్చే వీరికి ముక్కు మీద కోపం వస్తుంది. అయితే అతి త్వరలోనే తమ కోపాన్ని నిగ్రహించుకుని శాంతపడి, ముందు జరిగిన తతంగాన్ని శుభ్రంగా మరచిపోతారు.

ఇంకా చెప్పాలంటే... 19 తేదీన పుట్టిన స్త్రీ, పురుషులు అపారమైన కల్పనాశక్తిని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, బలమైన వ్యక్తిత్వం వీరిని వెన్నంటి ఉంటుంది. అనుకున్న కార్యాన్ని పట్టుదలతో పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. వీరు పనిచేసే సంస్థల్లో ప్రతిభను కనబరచి పై అధికారుల మన్నలను పొందుతూ ముందుకు సాగుతారు.

ప్రతి సంవత్సరం జులై నుంచి ఆగస్టు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. 1, 10, 19, 2, 4, 7, 11, 13, 20 25, 31 వీరికి మంచి తేదీలు.



Click it and Unblock the Notifications