Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
అత్యంత వింతగా డైట్ ఫాలో అయిన క్రేజీ ఫెలోస్.. !!
మంచినీళ్లు తాగకపోతే..డీహైడ్రేషన్, రకరకాల ఆరోగ్య సమస్యలు, చివరికి చనిపోయే ప్రమాదం అని చెబుతుంటారు. కానీ.. ఏళ్లకొద్దీ చుక్క నీరు కూడా తాగకుండా బతికేశాడు. అరటిపండ్లు ఎక్కువగా తింటే లావు అయిపోతారని మరికొందరు చెబుతారు. కానీ.. ఒట్టి బనానా తిని బతేకేసింది ఓ అమ్మాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తారు డాక్టర్లు. కానీ.. కొన్ని ఏళ్లపాటు ఆల్కహాల్ మాత్రమే తీసుకుని.. సవాల్ విసురుతున్నాడు మరో వ్యక్తి.
ఏంటి ఇదంతా అని ఆశ్చర్యపోతున్నారా ? ఇదంతా డైట్ క్రియేట్ చేస్తున్న మాయ. డైట్ అనే పదం వింటే చాలు... వెర్రీగా ఫాలో అయిపోతోంది నేటి ట్రెండీ జనరేషన్. ఫిట్ గా, హెల్తీగా ఉండటానికి ఆన్ లైన్ లో రకరకాల డైట్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ.. వీళ్లు మాత్రం అత్యంత ఎక్కువ డైట్ ఫాలో అయి.. డైట్ అనే పదాన్ని విపరీతంగా ఉపయోగించుకున్నారు.
కేవలం బీర్ డైట్, అరటిపండ్ల డైట్, చికెన్ డైట్.. ఇలా రకరకాల డైట్ లు ఫాలో అయి జనానికి పిచ్చెక్కిస్తున్నారు కొంతమంది. అత్యంత భయంకరంగా.. డైట్ ఫాలో అయిన వీళ్లను చూస్తే.. మీరు ఎలా ఫీలవుతారో మరి..ఒక్కసారి చూడండి.. వింతగా డైట్ ఫాలో అయిన వాళ్లను..

బనానా డైట్
న్యూట్రీషనిస్ట్ యులా టర్బాత్ బనానా డైట్ ఫాలో అయింది. అంటే కేవలం అరటిపండ్లు, నీళ్లు మాత్రమే తాగి బతకడం అనమాట. దాదాపు 12 రోజులు ఈ డైట్ ఫాలో అయింది. ఈ డైట్ ఫాలో అవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారిందని, 22 కే మార్థాన్ లో పరుగుపెట్టగలనని చెబుతోంది.
Image Courtesy

నూడుల్స్
జార్జీ రీడ్మాన్ అనే ఈ అమ్మాయి ఐదేళ్ల వయసులో న్యూడుల్స్ రుచి చూసింది. అంతే అప్పటి నుంచి 13 ఏళ్లు న్యూడుల్స్ మాత్రమే తిని బతికింది. అయితే ఆమెకు 18 ఏళ్ల వయసులో డాక్టర్లు పరీక్షించగా.. ఆమె ఆరోగ్యం 80 ఏళ్ల వయసు వాళ్ల మాదిరిగా ఉందని చెబుతున్నారు. అంటే ఆమె శరీరానికి పోషకాలు ఏమాత్రం అందలేదు.
Image Courtesy

పిజ్జా
మార్లాండ్ కి చెందిన డాన్ జాన్ సేన్ వెజిటేరియన్ గా ఉండాలనుకున్నాడు. అయితే వెజిటబుల్స్ తినడం ఇష్టంలేక చీజ్ పిజ్జాను ఎంచుకున్నాడు. అంతే 25 ఏళ్లపాటు కంటిన్యూగా కేవలం పిజ్జాలు మాత్రమే తిన్నాడు. అప్పుడప్పు ఒక బౌల్ సెరల్స్ తినేవాడట. విచిత్రం ఏమిటంటే.. అతని కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లోనే ఉన్నాయని డాక్టర్స్ చెబుతున్నారు.
Image Courtesy

బంగాళాదుంపలు
క్రిస్ వయట్ కి బంగాళా దుంపలంటే.. పిచ్చి. వాషింగ్ టన్ స్టేట్ కి పొటాటో కమిషన్ హెడ్ అట ఇతడు. ఇతను ఒకటి కాదు రెండు కాదు.. 60 రోజులు కేవలం బంగాళాదుంపలు మాత్రమే తిన్నాడట.
Image Courtesy

బీర్
డెస్ మాయిన్స్ అనే ఇతను క్రిస్టియన్. ఇతను బీర్ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నాడు. అంతే 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగాడు. ఇతను రోజుకి 4 నుంచి 5 బీర్లు తాగాడు.
Image Courtesy

నీళ్లు తాగకుండా
భారతీయ సాధువు ప్రహల్లాద్ జానీ.. పెద్ద సాహసం చేశాడు. 70 ఏళ్ల నుంచి చుక్క నీరైనా తాగకుండా.. బతుకుతున్నాడు. నీళ్లు తాగకపోతే అనారోగ్యమని డాక్టర్లు చెబుతుంటే.. ఈ సాధువు మాత్రం 70 ఏళ్లు నీళ్లు తాగకుండా ఎలా ఉన్నాడో కదూ..
Image Courtesy

ఫ్రూట్ జ్యూస్ డైట్
డాక్టర్ మిచెల్ వెర్నర్ ఫేమస్ బ్రీతరీన్స్. ఇతను రోజుకి నాలుగు కాఫీలు, రెండు ఫ్రూట్ జ్యూస్ ల డైట్ ఫాలో అయ్యాడు. ఇది కాస్త ఆసక్తికరంగా ఉంది కదా..
Image Courtesy

చికెన్ నగ్గెట్స్
స్టాసె ఐర్విన్ అనే అమ్మాయి తనకు రెండేళ్ల వయసు నుంచి 15 ఏళ్లు వచ్చే వరకు కేవలం చికెన్ నగ్గెట్స్ మాత్రమే తినింది. అంతే ఆస్పత్రిపాలైంది. ఇక ఆ డైట్ మానేయకపోతే.. ఆమె చనిపోతుందని డాక్టర్లు హెచ్చరించారు.
Image Courtesy



Click it and Unblock the Notifications