Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఆఫీసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయకూడని 10 క్రేజీ థింగ్స్..!
మనం ఆఫీసులో పనిచేసేటప్పుడు మన చుట్టూ రకరకాల మనుషులుంటారు. వారిలో కొందరు కాం గా తమ పని తాము చేసుకుపోయేవాళ్ళుంటారు. మరికొందరేమో గట్టిగా మాట్లాడుతూ ఇతరులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, ఇంకొందరేమో ఇంకొక అండుగు ముందుకేసి ఇతరులని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటారు తమ చేతల ద్వారా.ఇలాంటి వాళ్ళ అలవాట్లవల్ల ఆఫీసులో పనిచేసుకునేవారు తమ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోవచ్చు.
ఒకోసారి ఆఫీసులో "ఇలాంటి" మనుషులే తెలీకుండా ఇతరుల పనిమీద ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆ "ఇలాంటి" మనుషులు మీ కొలీగ్స్ కావచ్చు లేదా మీరే కావచ్చు.
మీ పక్కన కూర్చునే మీ కొలీగ్ అలవాటు ఏదైనా మీకు ఇబ్బందికరమనిపిస్తే ఆ విషయన్నే మెల్లిగా వారికి తెలియజేయడమే మంచిది.
కింద పేర్కొన్న అలవాట్లు ఆఫీసులో సమర్ధనీయం కాదు...

ఫోనులో గట్టిగా మాట్లాడటం:
ఒకవేళ మీకు ఫోనులో గట్టిగా మాట్లాడే అలవాటుంటే దానిని తక్షణమే మానెయ్యండి.ఇది ఇతరులకి ఇబ్బంది కలిగించడమే కాదు,చాలా చెడు అలవాటు కూడా..

వింత వింత రింగ్ టోన్స్:
మీ ఫోను వింత రింగ్ టోను ఇతరులకి ఆనందం కలిగిస్తుంది అనుకుంటున్నారేమో.కానే కాదు.కనీసం ఆఫీసులో ఉన్నప్పుడైనా ఫోను సైలెంట్ లో పెట్టి మీ వయసుకి తగ్గట్టుగా హుందాగా మెలగండి

కీ బోర్డ్ మీద బాదడం:
కీ బోర్డ్ ని గట్టిగా టక టక లాడించడం వదిలించుకోవాల్సిన అలవాటు. కీ బోర్డు మీద గట్టిగా బాదడం మీకు అలవాటయ్యి ఉండవచ్చు,కానీ ఇప్పుడైనా కీబోర్డు ని శబ్దం రాకుండా వాడుకోవడం నేర్చుకోండి.

అనవసర సంభాషణ:
అకస్మాత్తుగా మీ పక్కన కూర్చునే కొలీగ్ మీ ద్రుష్టిని ఆకర్షించడానికి అర్ధం పర్ధం లేని సంభాషణ మొదలుపెడితే చిరాగ్గా ఉండదూ?? ఈ అర్ధ రహిత సంభాషణలని ఆఫీసులో మానెస్తే మంచిది

డెస్క్ దగ్గర తినడం:
కొంతమంది ఆఫీసులో తమ డెస్క్ దగ్గరే టిఫిన్ డబ్బా మూత తీసి తింటూ ఉంటారు.ఇది కూడా మనం ఆఫీసులో చెయ్యకూడని పనుల్లో ఒకటి

అతిగా మాట్లాడటం:
పని చేసుకునే డెస్క్ దగ్గర అతిగా మాట్లాడే వారిని ఎవ్వరూ ఇష్టపడరు.కొంతమందికి ఇతరులు మాట్లాడుకునేది దొంగతనం గా వినడం ఆనందం కలిగిస్తుందేమో కానీ, ఎదుటివారిని అది తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది.

నోటి దుర్వాసన:
నోటి దుర్వాసన ఆఫీసులో ఇబ్బంది కలిగించే అలవాట్లలో ఒకటి. ఆఫీసులో మీ నోరు దుర్వాసేంతుంటే ఇతరులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

టాయిలెట్ ఫ్లష్ చెయ్యకపోవడం:
టాయిలెట్ ని ఉపయోగించాకా సరిగ్గా ఫ్లష్ చెయ్యకపోవడమనే అలవాటు మనల్ని ఇతరులనుండి దూరం చేస్తుందని గుర్తు పెట్టుకోండి.

ముక్కులో పొక్కులు తీసుకోవడం:
మీ ఆఫీసులో కనీసం ఒక్కరైన ముక్కులో పొక్కులు గిల్లుకోవడాన్ని ఆస్వాదించేవాళ్ళుంటరు. ఇది చాలా అసహ్యకరమైన అలవాటు. ఒకవేళ మీకే కనుక ఆ అలవాటుంటే టాయిలెట్లో మీ ముక్కు ని శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోండి.

త్రేనుపులు:
నలుగురి ముందూ గట్టిగా త్రేంచడం అసహ్యకరమైన అలవాటు.ఒకవేళ కానీ “అద్రుష్టవశాత్తూ” మీ వెనకాల కూర్చునే మీ కొలీగ్ కి ఆ అలవాటు ఉంటే , అది మీకు అభ్యంతరకరమని స్పష్టంగా చెప్పగగిలిగితే మంచిది.



Click it and Unblock the Notifications