Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
క్రికెట్ టు బాలీవుడ్: క్రికెటర్స్, బాలీవుడ్ స్టార్స్ మధ్య హాట్ లవ్ స్టోరీస్..!
క్రికెటర్స్, బాలీవుడ్ స్టార్స్ మధ్య హాట్ లవ్ స్టోరీస్..!
క్రికెట్..! ఇండియన్స్ అమితంగా ఆరాధించేది క్రికెట్ ని. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు క్రికెట్ అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. వరల్డ్ కప్ అయినా.. టెస్ట్ మ్యాచ్.. అయినా.. క్రికెట్ వస్తోందంటే.. పనులు మానేసి మరి.. టీవీలకు అతుక్కుపోతారు.
అలాగే బాలీవుడ్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. హాట్ హీరోయిన్స్, మాస్ హీరోల పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ చూపించే అభిమానం లెక్కలేనంతే. క్రికెట్, బాలీవుడ్ ఈ రెండూ ఇండియాలో ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లు. అందుకే.. ఇండియన్స్ ఎక్కువగా బాలీవుడ్ ని, క్రికెట్ ని బాగా ఫాలో అవుతారు.
బాలీవుడ్ గురించైనా, క్రికెట్ గురించైనా.. ఏ న్యూస్ వచ్చినా.. వరదలా పాకిపోతుంది. ఇక ఈ రెండు రంగాలకు చెందిన పాపులర్ స్టార్స్ గురించి రూమర్స్ వస్తే.. ఇక పరిస్థితి చెప్పనక్కరలేదు. మీడియా, ఫ్యాన్స్ అందరిలోనూ అటెన్షన్ పెరిగిపోతుంది. అలాంటి హాట్ టాపిక్ గురించే ఇవాళ్ల మీరు చదవబోతున్నారు. క్రికెటర్స్, బాలీవుడ్ స్టార్స్ మధ్య నడిచిన లవ్ ఎఫైర్స్ గురించి ఓ లుక్కేయండి..

షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్, మాజీ ఇండియన్ క్యాప్టెన్ అలీ ఖాన్ పటౌడీ మధ్య లవ్ ఎఫైర్ అందరినీ షాక్ కి గురిచేసింది. కామన్ ఫ్రెండ్స్ గా ఉంటూనే ప్రేమలో పడ్డారు. ఇద్దరు కుటుంబాలు అంగీకరించలేదు. కానీ.. అన్ని సమస్యలను ఎదుర్కొని చివరికి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. 2011లో అలీ ఖాన్ చనిపోయారు.

కిమ్ శర్మ, యువరాజ్ సింగ్
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్, మోడల్, నటి అయిన కిమ్ శర్మ మధ్య ప్రేమ వ్యవహారం.. మీడియాలో హల్ చల్ చేసింది. వీళ్లిద్దరూ కలిసి మీడియా కంట పడటంతో.. చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే యువరాజ్ తల్లి వీళ్ల పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీ అయిపోయారు.

యువరాజ్ సింగ్, హజేల్ కీచ్
కిమ్ శర్మతో రిలేషన్ కి బ్రేక్ పడిన తర్వాత.. యువరాజ్ మళ్లీ బాలీవుడ్ బ్యూటీపైనే మనసు పారేసుకున్నాడు. హజేల్ కీచ్ తో యువరాజ్ సింగ్ కి ఎంగేజ్ మెంట్ అయిపోయింది.

ఇషా శ్రావని, ఝహీర్ ఖాన్
క్యూట్ బ్యూటి ఇషా శ్రావణి, రైజింగ్ క్రికెట్ స్టార్ ఝహీర్ ఖాన్ కొంతకాలం డేటింగ్ చేశారు. తర్వాత కెరీర్ పై ఫోకస్ చేయాలని భావించి.. ఇద్దరు గ్యాప్ తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత.. మళ్లీ వీళ్ల రిలేషన్ ని పెళ్లిగా మార్చుకున్నారు.

సంగీత బిజ్లానీ, అజారుద్దీన్
90లలో చాలా హాట్ గాసిప్ వీళ్లిద్దరిది. సంగీత బిజ్లానిని పెళ్లి చేసుకోవడానికి తన భార్యకు విడాకులు ఇచ్చాడు అజారుద్దీన్. 14ఏళ్లు హ్యాపీగా సాగిన వీళ్ల రిలేషన్ కి 2010లో బ్రేక్ పడింది.

హర్భజన్ సింగ్, గీతా బశ్రా
వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ని గుడ్ ఫ్రెండ్స్ అంటూ.. చెప్పుకొచ్చాడు.. హర్భజన్ సింగ్. అయితే.. ఇద్దరూ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉంటున్నారని.. గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. వార్తలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
తాజాగా బాలీవుడ్ టు క్రికెట్ లవ్ స్టోరీస్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హాట్ లవర్స్ గా తెరపైకి వచ్చారు. వీళ్లిద్దరి మధ్య రూమర్స్ చాలా పాపులర్ చేశాయి. అయితే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు మాత్రం వినిపించడం లేదు. కానీ.. ఇద్దరూ.. చాలా సందర్భాల్లో కలిసి కనిపించడం వల్ల రూమర్స్ మరింత షార్ప్ గా మారుతున్నాయి.

దీపికా పదుకొనె, ధోని
పొడవుకాళ్ల బ్యూటి దీపికా, అద్భుతమైన ఆటగాడు ధోని.. మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు షికారు చేస్తున్నాయి.

రోహిత్ శర్మ, సోఫియా హయత్
చాలా సందర్భాల్లో రోహిత్ శర్మ, సోఫియా హయత్ తో కనిపించి.. మీడియాకి, ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. అయితే వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేకపోయినా.. వీళ్లద్దరూ మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట.

సౌరవ్ గంగూలి, నగ్మా
మాజీ ఇండియన్ కేప్టెన్ సౌరవ్ గంగూలీ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అలనాటి నటి.. నగ్నాతో ప్రేమాయణం నడిపినట్టు రూమర్స్ షికార్ చేశాయి. ఒకసారి ఇద్దరూ ఒక టెంపుల్ లో కనిపించడంతో.. ఈ రూమర్స్ వచ్చాయి. అయితే.. పెళ్లికూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే.. తర్వాత ఇద్దరూ విడిపోయి.. గంగూలి తన భార్యతోనే ఉన్నాడని తెలిసింది.

రవిశాస్త్రి, అమ్రితా సింగ్
క్రికెట్ స్టార్ రవిశాస్త్రి బాలీవుడ్ బ్యూటి అమ్రితా సింగ్ తో ప్రేమలో ఉన్నాడని.. ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేశాడు. చాలాసార్లు అమ్రితా సింగ్ చీరింగ్ కి రావడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ.. మళ్లీ విడిపోయారని వార్తలు వచ్చాయి. తర్వాత.. రితూసింగ్ ని రవిశాస్త్రి పెళ్లి చేసుకున్నాడు.

యువరాజ్ సింగ్, నేహాదూపియా
యువరాజ్ సింగ్, నేహా దూపియా కొంత కాలంపాటు డేటింగ్ చేశారు.

శ్రీశాంత్, రియా సేన్
ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిన క్రికెటర్ శ్రీశాంత్.. ఒకప్పుడు రియా సేన్ తో డేటింగ్ చేశాడు.

సురేష్ రైనా, శ్రుతి హాసన్
క్రికెటర్ సురేష్ రైనా, హీరోయిన్ శ్రుతి హాసన్ డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications











