Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక వ్యక్తిని ట్రాప్ చేసే హిప్నాటిజం (వశీకరణ) పై సైన్స్ ఏం చెబుతోంది ?
ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లోకి తీసుకోవడానికి ఉపయోగించే విద్య వశీకరణం. దీన్ని పూర్వకాలం ఎక్కువగా నమ్మేవాళ్లు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం.. మాటలు, మంత్రాలతో.. తమకు కావాల్సిన, అవసరమైన వ్యక్తిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను, మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటారు.
వశీకరణాన్నే ఇంగ్లీష్ లో హిప్నాటిజం అని పిలుస్తారు. మీకు గుర్తుందా.. రఘుబాబు తీసిన సినిమాలో హిప్నాటిజంతో.. మనుషులందరినీ.. తనవైపుకి తిప్పుకుంటాడు. అలాగే.. తనకు కావాల్సిన పనులు పూర్తిచేసుకోవడానికి చేతికి మట్టి అంటుకోకుండా.. ఇతరుల ద్వారా చేయిస్తాడు. దీన్నే వశీకరణం అంటారు.
ఎక్కువ సందర్భాల్లో వశీకరణ విద్యను ప్రేమ, జీవితం, వర్క్ సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. తమకు కావాల్సినట్టు, తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తిచేసుకోవడానికి ఈ వశీకరణ మంత్రాలు సహాయపడతాయి. అయితే ఇదంతా నిజమేనా ? వశీకరణం ఈ మోడ్రన్ యుగంలో పనిచేస్తుందా ? వశీకరణ మంత్రాలు నిజంగా పనిచేస్తాయా ? లెట్స్ టేక్ ఎ లుక్

వశీకరణం సహాయపడుతుందా ?
చాలా ఏళ్ల క్రితం నుంచి ఇండియా వశీకరణంను ఉపయోగిస్తోంది. తమకు కావాల్సిన పనులను, కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను ఉపయోగిస్తున్నారు.

ప్రేమ, జీవితం కోసం
పురాతన భారతదేశంలో.. వశీకరణాన్ని శక్తివంతమైన ఆచారంగా భావించేవాళ్లు. అందుకే జీవితంలో, ప్రేమలో, వర్క్ లో ఎలాంటి సమస్య వచ్చినా.. వశీకరణ ద్వారా పరిష్కరించుకునేవాళ్లు.

చేతబడికి, వశీకరణకి తేడా ఉందా ?
చేతబడిలో మీకు కావాల్సిన వ్యక్తిని ఆధీనంలోకి తీసుకోవడానికి కొన్ని మంత్రాలు ఉపయోగిస్తారు. అయితే వశీకరణలో నాలుగు పద్ధతుల ద్వారా ఒక వ్యక్తిని ట్రాప్ చేస్తారు. వక్క, పువ్వు, క్లాత్, లవంగం ఉపయోగించి ఈ ఆచారాన్ని పాటిస్తారు.

వశీకరణ పూజ
వశీకరణ పూజను మంత్ర, తంత్రాలతో తాండ్రికుడు నిర్వహిస్తాడు. ఈ మంత్రాల ద్వారా ఒక వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.

వ్యక్తిపై విజయానికి సహాయపడుతుందా ?
చాలామంది.. ఈ వశీకరణ ప్రక్రియ ఉపయోగపడుతుందని నమ్ముతారు. అది కూడా తమ ప్రేయసి లేదా ప్రియుడు, భాగస్వామి, విజయాన్ని తిరిగి పొందడానికి వశీకరణం ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ.. దాని విశ్వసనీయతపై ఇంకా అనుమానాస్పదంగానే ఉంటుంది.

సైన్స్
ఇలాంటి ప్రయోగాలను సైన్స్ ఎప్పటికీ గుర్తింపునివ్వదు. కానీ.. దాని శక్తిపై కొంతమందికి ఇప్పటికీ నమ్మకం ఉంది.

వశీకరణ పద్ధతిలో ఉపయోగించే వస్తువులు
వశీకరణ ఆచారం ప్రకారం ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలి, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకుంటారో వాళ్ల వస్తువులు అంటే.. క్లాత్స్, హెయిర్, వాళ్లకు సంబంధించిన వస్తువులు సేకరిస్తారు.

వశీకరణ మంత్ర
తాంత్రికుడు మంత్రాలు చదివేటప్పుడు కొన్ని రకాల మూలికలు ఉపయోగిస్తాడు. అవి ఎలా ఉంటాయంటే.. వాళ్లు ట్రాప్ చేయాలనుకున్న వ్యక్తి శరీరం, మైండ్, ఆత్మకు సూచించేలా ఉంటాయి. ఫలితం కోసం ఆ వ్యక్తి ఎదురుచూస్తూ ఉంటాడు. అది ఫలిస్తుందని ఒక నమ్మకం ఉంది కానీ.. వశీకరణం నిజంగా పనిచేస్తుందని ఎలాంటి ఆధారాలు లేవు.

వశీకరణపై సైన్స్
వశీకరణాన్ని ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారని సైన్స్ చెబుతోంది.

మైండ్ కంట్రోల్
ఒక వ్యక్తి మెదడుని, ఆలోచనలను కంట్రోల్ చేయాలంటే.. న్యూరో రెసెప్టర్స్ అవసరం. ఇది మెదడు పనితీరుకి సహాయపడుతుంది. అంతేకాని.. కేవలం మనుషులకు ఇది సాధ్యమయ్యేది కాదు. అయితే మంత్రాలు స్మరించడం వల్ల.. వాటి శక్తివల్ల ఒక వ్యక్తిపై మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

వశీకరణ సక్సెస్ రేట్
రెగ్యులర్ గా కొన్ని మంత్రాలను వినడం వల్ల.. ఒక వ్యక్తి మానసిక చర్యపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ.. వశీకరణ ప్రయోగాలు ఫలిస్తాయి అనేదానిపై ఎలాంటి ఆధారాలు లేవని.. సైన్స్ చెబుతోంది.

వశీకరణ
వశీకరణ పద్ధతిపై కేవలం నమ్మకాలు, మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు తప్ప దీనిపై ఎలాంటి వాస్తవ ఆధారాలు కనిపించడం లేదు.



Click it and Unblock the Notifications