పాము తలలో మణి ఎలా ఏర్పడుతుంది ? నిజంగానే నాగమణి ఉంటుందా ?

By Swathi

నాగినీల గురించి అందరూ వినే ఉంటారు. చాలా సినిమాలు, సీరియల్స్ నాగినీలపై చాలా కథలు వచ్చాయి. అలాగే నాగినీల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పే ఉంటారు. అయితే సీరియల్స్, సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అన్న భావన కలుగుతుంది. కానీ.. మన పూర్వీకుల చెప్పే కథలు, పురాణాల ప్రకారం నాగినీలు, నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతుంది.

వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే.. పాము కాటు వేయడానికి కూడా రాదని, అలాగే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు.. మంత్ర శక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే.. నాగినీల గురించి కూడా తెలుసుకోవాలి.

విషం చిమ్మే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది ? దీనివెనక ఉన్న రహస్యం ఏంటి ? పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా ? లేదా నాగపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా ? ఇంతటి శక్తివంతమైన నాగమణిలు దొరుకుతాయా ? అసలు, నాగినీలు, నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా ? నాగినీలు, నాగమణిల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నాగినీలు

నాగినీలు

నాగ అంటే మగ, నాగినీ అంటే ఆడ అని అర్థం. నాగ, నాగినిలు.. తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. అంటే విషపూరితమైన పాము.. ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది. ఎక్కువగా..ఇవి మనుషుల రూపంలోకే మారతాయి.

నాగమణి రహస్యం

నాగమణి రహస్యం

నాగ అనేది పాము రూపం. ఈ నాగు పాము కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు. ఇది వజ్రం కంటే విలువైనది.

నాగమణి

నాగమణి

హిందూపురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే దాన్ని మణి అని పిలుస్తారు. ఈ నాగమణి గురించి.. వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది, విలువైనది, మంత్ర శక్తుల కలిగిన మణి అని హిందువుల నమ్మకం.

మరణం

మరణం

చాలామంది ఈ నాగ మణిని దొంగిలించినందు వల్ల పాము కాటు ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతాయి. అంటే నాగమణిని దొంగిలించిన వాళ్లపై పాము పగ తీర్చుకుంటుదని వివరిస్తున్నాయి. ఒక పాము లేదా రెండు పాములు కూడా పగబట్టిన వ్యక్తిని చంపేస్తాయి.

ఈరోజుల్లో నాగినిలు ఉంటాయా ?

ఈరోజుల్లో నాగినిలు ఉంటాయా ?

సినిమాలు, సీరియల్స్ లో చూపించినట్టుగా.. ఈ రోజుల్లో కూడా నాగినీలు, నాగ ఉంటారా ? ఈ నాగినీల్లో ఉండే విషం చాలా శక్తివంతమైనది. ఇవి తమ శత్రువులకు కాటు వేసిన తక్షణమే.. మరణం సంభవిస్తుందట.

నాగమణి ఉత్పత్తి అయ్యే విధానం

నాగమణి ఉత్పత్తి అయ్యే విధానం

తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. ఇది ఎలా రూపొందుతుంది అనేది.. చాలా పుస్తకాల్లో వివరించారు.

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం రోజు.. వర్షం పడినప్పుడు.. ఆ వర్షపు బిందువు నాగు పాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట.

నాగుపాములో మాత్రమే

నాగుపాములో మాత్రమే

ఇతిహాసాల ప్రకారం.. మణి కేవలం నాగు పాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే.. నాగుపాము మాత్రమే వంద ఏళ్లు భూమ్మీద ఉండగలుగుతుంది.

నాగినిగా మారే శక్తి

నాగినిగా మారే శక్తి

ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే.. ఆ పాము అద్భుతమైన శక్తిసామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే.. ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అంటే మనిషి రూపంలోకి మారగలదు.

నాగమణి ఎందుకంత శక్తివంతమైనది

నాగమణి ఎందుకంత శక్తివంతమైనది

చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది.

అదృష్టం

అదృష్టం

ఈ నాగ మణి మన దగ్గర ఉండటం.. అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరిసంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే.. మణిని పాము నుంచి తొలగిస్తారో.. అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది.

అగ్నిపురాణం

అగ్నిపురాణం

అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలు ఉంటాయి. అతల, వితల, సుతల, తలాలల, మహాతల, రసాతల, పాతాల అనే పేర్లతో.. ఏడు భూగర్భాలుంటాయి.

భూగర్భంలో

భూగర్భంలో

థైత్య, ధానవులు భూగర్భంలో జీవిస్తారు. విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగ రూపంలో ఉంటాడు. శేషనాగు భూమిని తన తలపై మోస్తూ ఉంటుంది.

వాయు పురాణం

వాయు పురాణం

వాయు పురాణం ప్రకారం పాములు, రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు. అతల లోకాన్ని నాముచి రాక్షసులు,. సుతల లోకాన్ని మహాజంభ రాక్షసులు, వితల లోకాన్ని ప్రహల్లాద రాక్షసుడు, గభస్తల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు. మహాతల లోకాన్ని విరోచన్ రాక్షసుడు, ష్రీతల లోకాన్ని కెసరీ రాక్షసుడు పాలిస్తాడు. పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు.

వాసుకి పాము

వాసుకి పాము

అతిపెద్ద పాము వాసుకి ష్రీతల లోకంలో జీవిస్తుంది. గొప్ప పాము శేషనాగు పాతాల లోకంలో జీవిస్తుంది. శేషనాగు కళ్లు ఎరుపు రంగు తామరపూవుల్లా ఉంటాయి. ఇది వెయ్యి తలలు కలిగి ఉంటుంది.

అనేక రంగుల్లో

అనేక రంగుల్లో

నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతాయి. అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయట.

నమ్మకం

నమ్మకం

పాములలో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలామంది పాములను అమ్మి లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు.

ఖనిజ ప్రాంతాలు

ఖనిజ ప్రాంతాలు

నదీపరివాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫేన్ అనే ఒక ఫ్లోరైట్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుంతుంది. అలాగే దీనికి ప్రకాశిస్తూ ఉంటుంది.

పురుగులు

పురుగులు

రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగులో పురుగులు, చిన్న చిన్న జంతువులను తింటాయి. అలా వీటి చుట్టూ నాగుపాములు తిరడటం వల్ల.. వాటినే నాగుపాములు వదిలేసిన నాగమణులని నమ్ముతున్నారని కొంతమంది చెబుతున్నారు.

నాగమణి ఉండదు

నాగమణి ఉండదు

అలాగే నాగుపాముకి తలమీద కానీ, తలలోపల గానీ.. ఎలాంటి మణి ఉండదని.. ఇందంతా ఒట్టి మూఢనమ్మకం మాత్రమే అని కొంతమంది చెబుతున్నారు.

Desktop Bottom Promotion