For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపులర్ కంపెనీల లోగోల వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ లాజిక్స్.. !!

By Swathi
|

ఏటీఎమ్ పిన్ కి నాలుగు డిజిట్సే ఎందుకు ? ఆరు డిజిట్స్ ఎందుకు పెట్టలేదు ? కంప్యూటర్ కీబోర్డ్ లో అక్షరాలు ఎందుకు ఒక ఆర్డర్ లో ఉండవు ? యాపిల్ కంపెనీ లోగోలో యాపిల్ షేప్ ఎందుకు కొరికినట్టుగా ఉంటుంది ? ఇలాంటి క్రేజీ డౌట్స్ మీకు ఎప్పుడూ రాలేదా ? వీటి వెనక ఉన్న అసలు లాజిక్స్ తెలిస్తే.. షాక్ అవుతారు.

ఇండియాలో మాత్రమే కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్

ఇలాంటి చాలా విషయాలకు అసలు లాజిక్స్ మనలో చాలా మందికి తెలియదు. కానీ.. వీటన్నింటి వెనక నాలెడ్జ్, మిస్టరీ ఉంది. నాలెడ్జ్ అనేది ఎండ్ లేనిది. ప్రతి ఒక్కరికీ.. ఏదో ఒక తెలియని విషయం ఉంటుంది. అందుకే.. నాలెడ్జ్ అనేది.. నేర్చుకునే కొద్దీ ఉంటుంది. లిమిట్ లేనిది ఇది. అయితే.. ఇప్పుడు మనలో చాలామందికి తెలియని క్రేజీ డౌట్స్ కి క్లారిటీ ఇచ్చే లాజిక్స్ తెలుసుకుందాం..

కొరికినట్టు ఉండే యాపిల్ లోగో

కొరికినట్టు ఉండే యాపిల్ లోగో

తన బ్రాండ్ గుర్తింపు చాలా కొత్తగా ఉండాలని భావించారు స్టీవ్ జాబ్స్. మొదట్లో 1976లో యాపిల్ లోగో న్యూటన్ యాపిల్ ట్రీపై కూర్చున్నట్టు రొనాల్డ్ డిజైన్ చేశారు. ఆ తర్వాత.. ప్రస్తుతమున్న లోగో క్రియేట్ చేశారు. ఇది కొరికినట్టుగా ( bite ) ఉండటానికి అసలు కారణం.. బైట్ అనే పదం కంప్యూటర్ కి సంబంధించినది కావడమే.

ఫేస్ బుక్ లోకోగో బ్లూ కలర్

ఫేస్ బుక్ లోకోగో బ్లూ కలర్

ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జూకర్ బర్గ్ కి కలర్ బ్లైండ్ ఉంది. అంటే.. ఈయన రెడ్, గ్రీన్ కలర్స్ చూడలేరు. కాబట్టి కలర్ బ్లైండ్ ఉన్నవాళ్లు తేలికగా చూడగలిగేది బ్లూ కలర్ ని. అందుకే.. ఫేస్ బుక్ లోగో బ్లూ కలర్ లో ఉంటుంది.

ఏటీఎమ్ పిన్ లో 4 డిజిట్స్ ఎందుకు ?

ఏటీఎమ్ పిన్ లో 4 డిజిట్స్ ఎందుకు ?

మీకు ఎప్పుడూ అనిపించలేదా ? ఏటీఎమ్ పిన్ లో నాలుగు డిజిట్సే ఉన్నాయి ? తక్కువ కానీ, ఎక్కువ గానీ లేవు ఎందుకని ? స్కాటిష్ కి చెందిన జాన్ అడ్రెయిన్ ఏటీఎమ్ ని 1967లో రూపొందించారు. అప్పుడు ఇతను ఏటీఎమ్ మిషిన్ పిన్ ని 6 డిజిట్స్ పెట్టారు. కానీ.. అతని భార్య 6 డిజిట్స్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిపడుతుండటంతో.. దాన్ని 4 డిజిట్స్ గా మార్చాడు. అలా ఏటీఎమ్ పిన్ 4 డిజిట్స్ గా ఫిక్స్ అయింది.

ఐఫోన్ లో 9:41am ఎందుకు ?

ఐఫోన్ లో 9:41am ఎందుకు ?

యాపిల్ ఐఫోన్ ని గమనించినట్లైతే.. డీఫాల్ట్ గా 9:41am గా టైం ఉంటుంది. దీనివెనక అసలు కారణం ఏంటంటే.. ? 2007లో మెక్ వరల్డ్ ఎక్స్ పోలో యాపిల్ కంపెనీ సీఈఓ స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సమయంలో అందరి వాచ్ లలో అదే టైం ఉండాలని భావించారు. అలా.. డీఫాల్ట్ గా ఐఫోన్ ని ఆన్ చేసినప్పుడు 9:41am గా కనిపిస్తుంది.

కీబోర్డ్

కీబోర్డ్

కీబోర్డ్ లో అక్షరాలు ఆర్డర్ లో లేకపోవడం వెనక ఒక కారణం ఉంది. గతంలో కీబోర్ట్ లో అక్షరాలు ఆర్డర్ లో ఉండేవి. అప్పుడు టైప్ వ్రైటర్స్ చాలా ఫాస్ట్ గా టైప్ చేసేవాళ్లు. దీనివల్ల వాళ్ల స్పీడ్ తగ్గించడం కోసం.. క్వెర్టీ కీబోర్డ్ ని రూపొందించారు.

విండోస్ ఎక్స్ పీ వాల్ పేపర్

విండోస్ ఎక్స్ పీ వాల్ పేపర్

విండోస్ ఎక్స్ పీ కి డీఫాల్ట్ గా ఉండే.. వాల్ పేపర్ ఫేక్ ది కాదు. ఇది.. రియల్ గా తీసిన ఫోటో. కానీ చాలామంది ఫేక్ అనుకుంటారు. క్యాలిఫోర్నియా నేషనల్ జియోగ్రఫిక్ ఫోటో గ్రాఫర్ చార్లెస్ 1996లో ఈ ఫోటోని తన కెమెరాలో బంధించారు.

Image Courtesy

స్మార్ట్ ఫోన్ కి అదనపు రంధ్రం

స్మార్ట్ ఫోన్ కి అదనపు రంధ్రం

స్మార్ట్ ఫోన్ కి వెనక వైపు అంటే కెమెరా పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అది ఎందుకో తెలుసా ? ఫోన్ లో మాట్లాడేటప్పుడు.. వచ్చే శబ్ధాలను క్యాన్సల్ చేయడానికి ఈ రంధ్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల క్రిస్టల్ క్లియర్ వాయిస్ క్వాలిటీ ఉంటుందట.

English summary

Do You Know Why ATM PIN Is A 4-Digit Code? Find Out About More Such Questions!

Do You Know Why ATM PIN Is A 4-Digit Code? Find Out About More Such Questions! From ATM pins to windows wallpaper, there are many things that are unknown to all of us. Well, like it is said there are knowledge has a beginning but no end.
Story first published:Monday, July 18, 2016, 17:12 [IST]
Desktop Bottom Promotion