Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
రత్నాలు ధరిస్తే.. మనుషుల తలరాత మారుతుందా ?
శారీరక, మానసిక ఆరోగ్యం, సమాజంలో స్థాయి, ఆర్థిక స్థితిగతులు, వృత్తి, వ్యాపారాలు, వైవాహిక సంబంధాలు, పిల్లలు, మనుషుల మధ్య సత్సంబంధాలనపై గ్రహాల ప్రభావం ఉంటుందని ఒక నమ్మకం ఉంది. అందుకే.. పుట్టిన ప్రతి ఒక్కరి జాతకాన్ని వాళ్లు పుట్టిన సమయం, ప్రాంతాన్ని బట్టి అంచనా వేస్తారు.
ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహాల ప్రభావం ఉంటుంది. వాళ్లు పుట్టిన సమయాన్ని, ప్రాంతాన్ని, రోజుని బట్టి.. వాళ్లపై గ్రహాల ప్రభావం విభిన్నంగా ఉంటుంది. అందుకే సంపాదన తక్కువైనా, సంతానలేమి సమస్య ఉన్నా, నిరుద్యోగం, అనారోగ్యం, పెళ్లికాకపోయినా, సరైన వైవాహిక జీవితం లేకపోయినా.. ఒక్కటే పరిష్కారం.. రత్నాలు !!
చేతి వేలికి పెట్టుకునే జెమ్ స్టోన్స్ తన తలరాతను, అదృష్టాన్ని మారుస్తాయని చాలా మంది నమ్ముతారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొనే శక్తి రాయికి ఉంటుందా ? రంగురాళ్ల ఉంగరాలు మనుషుల అదృష్టాన్ని మార్చేస్తాయా ? రంగురాళ్లకి, జీవితానికి సంబంధమేంటి ? రత్నాలు ధరిస్తే.. మీ తలరాతే మారిపోతుందా ? వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే.. ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

లక్కీ రత్నం
ప్రతి ఒక్కరికి వాళ్లు పుట్టిన సమయాన్ని బట్టి, వాళ్ల రాశిని బట్టి.. రూలింగ్ ప్లానెట్ ఉంటుంది. తొమ్మిది రత్నాలలో వాళ్లకు సరిపోయే రత్నాన్ని సూచిస్తూ ఉంటారు. వాళ్ల రాశిని బట్టి లక్కీ రత్నం ధరించడం వల్ల.. గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కునే శక్తిని పొందవచ్చని నమ్మకం ఉంది.

రత్నాలు ఎలా పనిచేస్తాయి ?
రత్నాలకు సూర్యుడు, గ్రహాల నుంచి ఎనర్జీ పొందే సత్తా ఉంటుంది. ఒక్కో కలర్ జెమ్ స్టోన్స్ ఒక్కో రకమైన శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటాయి. అంతరిక్ష సంబంధమైన వైబ్రేషన్స్ ని ప్రతిబింబిస్తాయి. గ్రహాలపై ప్రతికూలమైన ప్రభావాలను ఎదుర్కొనే శక్తి ఈ రత్నాలకు ఉంటాయి.

రత్నాలు ఎలా పనిచేస్తాయి ?
పుట్టిన డేట్, సమయాన్ని, రాశిని బట్టి నిర్ణయించే రత్నాలు శరీరంలో అనేక మార్పులు తీసుకొస్తాయి. కాబట్టి.. వీటి ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లేదండే.. ఫలితాలు తారుమారవుతాయి. ఈ రత్నాలు ధరించడం వల్ల.. శరీరానికి అవసరమైన అంతరిక్ష సంబంధమైన కిరణాలను గ్రహిస్తాయి.

రత్నాల వెనక సైన్స్
ప్రతి మనిషి చుట్టూ అయస్కాంత తత్వం ఉంటుంది. కాబట్టి ఈ రత్నాలు ధరించడం వల్ల గ్రహాల ద్వారా కొన్ని వ్యతిరేక ప్రభావాలను కూడా.. అనుకూల ప్రభావాలుగా మారుస్తాయి. మనుషులు వాళ్ల రాశిని బట్టి రత్నాలు ఎంచుకోవడం వల్ల అనేక ప్రయోజనకర ఫలితాలు పొందగలుగుతారని సైన్స్ చెబుతోంది.

రత్నాల వెనక సైన్స్
రత్నాల రంగులపై కిరణాలు పడినప్పుడు అవి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ క్యారెక్టరిస్టిక్స్ గా మారుతాయి. ఒకే రకమైన వేగంతో ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కిరణాలు ప్రసరించినప్పుడు ఒకే రకమైన ఎనర్జీని విడుదల చేస్తాయి. అయితే ఒక్కో రంగు రాయికి ఒక్కో వేవ్ లెంగ్త్, ప్రభావం, ఒత్తిడి ఉంటాయి. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ద్వారా ఉత్పత్తి అయ్యే కిరణాలు.. ప్రతి ఒక్కరి జీవితంపై వివిధ రకాలుగా ప్రభావితం చూపిస్తాయి. ఒక్కో రంగు రాయి.. ఒక్కో రకమైన పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తుంది.

రత్నాల వెనక సైన్స్
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల నుంచి వివిధ దిశలలో కిరణాలు ప్రసరిస్తాయి. ఇవి మనిషి శరీరంపై, మనసుపై ప్రభావం చూపిస్తాయి. నవరత్నాలలో ఉండే రాళ్లు సూర్యుడి నుంచి వచ్చే ఏడు రంగులకు సంకేతాలు. ఈ ఏడు రంగులు మన శరీరంలో కూడా ఉంటాయి. కిరణాల కోణాలు ప్రతి నిమిషానికి మారుతూ ఉంటాయి. ఫలితంగా ఏర్పడే భౌగోళిక మార్పు, శారీరక మార్పుతో సరిపోనప్పుడు శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. అందుకే రత్నాలు ధరిస్తారు.

జెమ్ స్టోన్స్ గురించి వాస్తవాలు
రత్నాలలో ఎలాంటి మ్యాజికల్ పవర్స్ ఉండవు. అవి కేవలం అంతరిక్ష సంబంధమైన అంటే గ్రహాల దుష్ర్పభావాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయి. పాజిటివ్ ఆటిట్యూట్ అలవరుకున్నప్పుడే ఈ రత్నాలు పనిచేస్తాయి. అందులోనూ న్యాచురల్ జెమ్స్ అయితే.. మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి సహాయపడతాయి. కానీ.. ఆర్టివిషియల్ జెమ్స్ ధరించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.

జెమ్ స్టోన్స్ గురించి వాస్తవాలు
రత్నాలలో రకాలు, క్వాలిటీయే కాకుండా.. వాటిని కట్ చేసే పరిమాణం, సైజ్ కూడా అనుకున్న ఫలితాలపై ప్రభావం చూపుతాయి. వీటిని కట్ చేయడానికి మంచి శిక్షణ పొందినవాళ్లను సంప్రదించడం చాలా అవసరం. సైజ్ లో మార్పులు వస్తే.. కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి రత్నాలు ధరించాలనుకున్నప్పుడు శిక్షణ పొందిన, అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించి ఎంచుకోవడం చాలా మంచిది.

రత్నాలపై పురాణాలు ఏం చెబుతున్నాయి ?
పూర్వం విష్ణుమూర్తిచేతిలో బాల రాక్షసి సంహారం జరిగింది. అప్పుడామె శరీరం నుంచి రకరకాల రంగుల్లో మెరుస్తూ తొమ్మిది ముక్కలు దేవతామూర్తుల మీద పడ్డాయి. ఆ రంగు దేవతలకు వచ్చింది. అలా ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు. ఆ రత్నాలనే నవరత్నాలని పిలుస్తారు.

రత్నాలు, రంగులు
నవరత్నాలలో ఒక్కో రాయి, ఒక్కో గ్రహానికి సంకేతం. వైడూర్యం.. కేతువు, నీలం.. శని, గోమేధికం.. రాహువు, పుష్యరాగం.. గురువు, కెంపు.. సూర్యుడు, పగడం.. కుజుడు, మరకతం.. బుధుడు, వజ్రం.. శుక్రుడు, ముత్యం.. చంద్రుడుకి సంకేతం.

రేడియేషన్
ఉంగరానికి ఉండే రాళ్లు వెదజల్లే కాంతి చేతి వేలి నరానికి సంబంధం ఉంటుంది. ఆ నరాలు మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలకు అనుసంధానం చేసి ఉంటాయి. వాటికి రాళ్లను ధరించడం వల్ల వాటి నుంచి వెలువడే కిరణాలు నరాల ద్వారా ప్రవహించి ముఖ్యమైన వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సవరిస్తాయి. ఇదంతా ఒక రేడియేషన్‌లా జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

తెలుపు రత్నం
నవరత్నాలలో వెలువడే ఒక్కోకాంతి మనలో ఒక్కో ఫలితానికి సంకేతమట.తెలుపు రత్నం మంచి ఆలోచనలు కలగడానికి, టెన్షన్స్ తగ్గి, మానసిక ప్రశాంతత పొందడానికి సహాయపడుతుంది.

లేత పసుపురంగు
లేత పసుపురంగు రత్నం జ్ఞానం, మంచి నిద్ర కలగడానికి, సెక్సువల్ పవర్‌ను పెంచడానికి, ఇతరులను ఆకర్షించడానికి సహాయపడుతుంది.

ఎరుపు
ఎరుపు రత్నం చెవి సంబంధిత వ్యాధులు తొలగించడానికి, ఇతర నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఆకుపచ్చ
ఆకుపచ్చ రత్నం సమాజంలో అందరినీ ఆకర్షించడానికి, సామాజిక అభ్యున్నతికి, శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.

లేత నీలం
లేత నీలం రంగు రత్నం మనస్సును, మానసిక భావాలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

గులాబి
గులాబి రంగు రత్నం ప్రేమ భావాలు కలిగించడానికి, క్షుద్ర ప్రయత్నాలు నివారించడానికి ఉపయోగపడుతుంది.

ఊదా
ఊదా రంగు రత్నం ఆర్థిక స్వేచ్ఛను కలిగించడానికి, అప్పులు తొలగించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయపడుతుంది.

గోధుమ
గోధుమ రంగు రత్నం అందరిలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడటానికి, స్పెషల్‌గా చూపించడానికి సహకరిస్తుంది.

కాషాయం
కాషాయం రంగు రత్నం అందాన్ని పెంచడానికి, నెగెటివ్ ఆలోచనల నుంచి రక్షించి అసూయను తొలగిస్తుంది. ప్రయాణాలు సురక్షితంగా చేయడానికి అవసరమైన శక్తిని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications











