Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అదృష్టం, సక్సెస్ పొందాలంటే.. బయటకు వెళ్లే ముందు చేయాల్సినవి..!
హార్డ్ వర్క్ తో పాటు, కాస్మిక్ సపోర్ట్ కూడా అవసరమని సూచిస్తున్నారు. అందుకేనేమో మీ పర్ఫామెన్స్, సక్సెస్ మధ్య లింక్ ని కోల్పోతున్నారు. కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అయితే.. అదృష్టంతోపాటు, సక్సెస్ పొందుతారు
ఏదైనా ముఖ్యమైన పనిమీద, లేదా వ్యాపారం చూసుకోవడానికి లేదా ఆఫీలుకు వెళ్తుంటాం. అయితే ప్రతిరోజూ చేసే పనే అయినా.. ఇలా ఇంట్లో నుంచి ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేముందు.. ఆ పని సక్సెస్ అవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవడం మంచిది.
ఇంటర్య్వూకి వెళ్లినప్పుడు లేదా ఎగ్జామ్ లో ఉన్నప్పుడు ఒత్తిడి, ఆందోళన, భయం సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఎంత భయపడినా, టెన్షన్ పడినా.. హార్డ్ వర్క్ ఉంటేనే సక్సెస్ అందుకోవడం సాధ్యమవుతుంది.

కొంతమంది తమకు ఇష్టమైన వస్తువులు, దుస్తులు, స్టోన్స్ ని దగ్గరే పెట్టుకుంటారు. అవి తమకు అదృష్టం తీసుకొస్తాయని భావిస్తారు. అయితే.. జ్యోతిష్యులు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు హార్డ్ వర్క్ తో పాటు, కాస్మిక్ సపోర్ట్ కూడా అవసరమని సూచిస్తున్నారు. అందుకేనేమో మీ పర్ఫామెన్స్, సక్సెస్ మధ్య లింక్ ని కోల్పోతున్నారు. కాబట్టి.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. అదృష్టంతోపాటు, సక్సెస్ కూడా మీ వెంటే ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం..

చేతులు శుభ్రం చేసుకోవడం
ఇంట్లో నుంచి ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లడానికి ముందు చేతులను కాస్త చల్లటి, పచ్చి పాలతో శుభ్రం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మీ పని సక్సెస్ అవడానికి, అదృష్టం పొందడానికి సహాయపడుతుంది.

బెల్లం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ముందు కొన్ని నీళ్లు, కాస్త బెల్లం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం మాత్రమే కాదు.. తక్షణ శక్తిని అందిస్తుంది.

లవంగాలు
5 లవంగాలను మీ పాకెట్ లో పెట్టుకోండి. మీ చుట్టూ.. అద్భుతమైన సువాసనను క్రియేట్ చేయడమే కాకుండా.. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

మిరియాలు
ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని మిరియాలను చల్లండి. వెనక్కి తిరిగి చూడకుండా.. ముందుకు వెళ్లండి. ఇలా చేస్తే.. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

మంత్రం
ఇంట్లో నుంచి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పు ఓం గం గణపతయే నమ: అని స్మరించుకోండి. తర్వాత 4 అడుగులు మీరు వెళ్లాల్సిన దారికి వ్యతిరేక దిశలో వెళ్లండి. తర్వాత వెనక్కి తిరిగి మీరు వెళ్లాల్సిన మార్గంలో వెళ్లండి. అంతే మీరు పడ్డ కష్టాలకు ప్రతి ఫలం లభిస్తుంది. అదృష్టం పొందుతారు.

శ్వాస
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు శ్వాసను బాగా గమనించాలి. అడుగు బయటపెట్టడానికి ముందు శ్వాస ముక్కులోకి పీల్చాలి. తర్వాత అడుగు బయటపెట్టాలి. అలాగే కుడివైపు గాలి పీల్చేటప్పుడు కుడి కాలు, ఎడమవైపు గాలి పీల్చేటప్పుడు ఎడమకాలు బయటపెట్టి వెళ్లాలి.



Click it and Unblock the Notifications