Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కాలి రెండోవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదా ?
సాధారణంగా.. ఇండియాలో పెళ్లిళ్లు అంటే.. చాలా రకాలుగా ఆలోచిస్తారు. అమ్మాయిలను నుదుటి నుంచి కాలి వేళ్ల వరకు అన్నీ గమనించి.. అన్నీ బావున్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా అబ్బాయిల తల్లులు అమ్మాయిలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏ మాత్రం లోపం ఉన్నా.. వెంటనే తిరస్కరిస్తారు.
5000 వేల ఏళ్ల నుంచి చైనా, ఇండియా.. ఫూట్ రీడింగ్ ని ఫాలో అవుతోంది. ఈ రెండు దేశాలు.. శరీరానికి పాదాలు అద్దం లాంటిదని నమ్ముతారు. ఎందుకంటే.. మన పాదాలు.. మన శరీరంలోని ప్రతి భాగం అంటే.. జీర్ణవ్యవస్థ నుంచి.. సంబంధాల వరకు అన్నింటినీ వివరిస్తాయట.
కాళ్లను చూసి.. వాళ్లు సున్నితంగా ఉంటారా ?, సాహసవంతులా ?, రిస్క్ చేసే తత్వం ఉన్నవాళ్లా ? స్థిరంగా ఉండేవాళ్లా అన్న విషయాలను తెలుసుకునేవాళ్లు. జీవితంలో అజమాయిజీ ఉంటుందా, ప్రేమతత్వం కలిగి ఉంటారా అనేది కూడా వివరిస్తుందట.

బొటనవేలు
కాలి వేళ్లు అన్నింటిలోకి బొటనవేలు పొడవుగాగా ఉంటే.. వాళ్లు చాలా తెలివైన వాళ్లట. అలాగే సృజనాత్మకంగా ఉంటారట. ఎలాంటి సమస్యకైనా.. చాలా తేలికగా పరిష్కారించుకోగలుగుతారు.

చిన్నగా ఉంటే
కాలి బొటనవేలు చిన్నగా ఉండే అమ్మాయిలు.. ఏ పనైనా, ఎన్ని పనులైనా చాలా తేలికగా చేయగలుగుతారట. చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. మీ ఆకర్షణతో.. మీ ఐడియాస్ ని ఎవరైనా అంగీకరించేలా చేస్తారు.

రెండో వేలు
ఒకవేళ రెండో వేలు పొడవుగా ఉంటే.. మీలో చాలా లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయి. చాలా డైనమిక్ గా ఉంటారు. కానీ మీరు కావాలనుకున్నది, చేయాలి అనుకున్న విషయాలు మీ దారిలోనే జరగాలనే పట్టుదల ఉంటుంది. ఆధిపత్యం ప్రదర్శించే తత్వం ఉంటుంది.

మీకు తెలుసా
ఇండియాలో కొంతమంది గడసరి అత్తలు.. పొడవాటి రెండో కాలి వేలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదని కొడుకులకు సూచించేవాళ్లట. ఎందుకంటే.. వాళ్లు చాలా డామినేటింగ్ గా ఉంటారనే.. ఈ నియమం పాటించేవాళ్లు.

సన్నగా ఉంటే
ఒకవేళ రెండోవేలు సన్నగా ఉంటే.. మీ సమయాన్ని మీరు హ్యాపీగా గడుపుతారు. సామరస్యానికి విలువ ఇస్తారు. పరిస్థితులను బట్టి.. మీ దారిని మార్చుకునే తత్వం ఉంటుంది.

మూడోవేలు
మూడోవేలు ఎనర్జీ, విల్ పవర్ ని సూచిస్తుంది. మూడో వేలు చాలా పొడవుగా ఉంటే.. వాళ్లు చాలా ఎనర్జిటిక్ గా, వర్క్ విషయంలో చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కెరీర్ లో సక్సెస్ అవుతారు. అయితే పనిలో నిమగ్నమై.. ప్రేమ, ఫన్, ఫ్యామిలీ గురించి పట్టించుకోరు.

పొట్టిగా ఉంటే
మూడో వేలు పొట్టిగా ఉంటే.. జీవితంలో సంతోషాలను ఎంజాయ్ చేస్తారు. రిలాక్స్ అవడాన్ని ఇష్టపడతారు. లేజీగా ఉంటారని ఇతరులు మిమ్మల్ని తిడుతూ ఉంటారు. కానీ.. జీవితం చాలా చిన్నదని.. బాగా ఎంజాయ్ చేయాలని వాళ్లతో వాదిస్తారు.

నాలుగో వేలు
పొడవుగా, స్ట్రెయిట్ గా నాలుగో వేలు ఉంటే.. జీవితంలో ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతారు.

వంకరగా ఉంటే
మీ నాలుగో వేలు వంకరగా ఉందంటే.. మీకు నచ్చిన వాళ్ల రిలేషన్ లో అన్ హ్యాపీనెస్ ఉందని సంకేతం. మీరు బాగా వింటారు, మంచి పెంపంకం ఉంటుంది. కానీ.. కుటుంబంలో అన్ హ్యాపీనెస్ కి బాగా దెబ్బతింటారు.

సన్నగా ఉంటే
ఒకవేళ మీ నాలుగో వేలు సన్నగా ఉంటే.. ఫ్యామిలీ, రిలేషన్ షిప్స్.. మీకు అంత ప్రాధాన్యం కాదు. మీ ఫోకస్ అంతా వేరేలా ఉంటుంది.

చిటికెన వేలు
చివరి వేలు సన్నగా ఉంటే.. వాళ్లు చైల్డిష్ క్యారెక్టర్ కలిగి ఉంటారు. బాధ్యతలంటే సిగ్గుపడతారు. త్వరగా బోర్ ఫీలవుతారు. చాలా త్వరగా.. కొత్త డైవర్షన్స్ తీసుకుంటారు. మీతో ఉంటే.. చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ మీలో ఉండే కొన్ని ఆలోచనలు... సమస్యల్లో పడేస్తాయి.

చివరి వేలు సపరేట్ గా ఉంటే
చివరి వేలు ఇతర వేళ్లకు అంటుకోకుండా.. దూరంగా ఉంటే.. మీరు అడ్వెంచరస్ గా ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. చాలా గౌరవప్రదంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వేలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం మంచిది.

ఆర్డర్ లో ఉంటే
ఒక వేలి తర్వాత మరొక వేలు.. కొద్దిగా పొట్టిగా వస్తూ ఉంటుంది. ఇలా ఆర్డర్ లో, నీట్ గా లైన్ క్రియేట్ అయి ఉంటే.. ఆ వ్యక్తి చాలా పద్ధతిగా ఉంటారు, చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏ పని అయినా మొదలుపెట్టిన తర్వాత.. పూర్తి చేయకుండా వదిలిపెట్టరు.

వ్యక్తిత్వం
వీళ్లు మంచి స్నేహితులుగా ఉంటారు. తప్పు చేయమన్న ధృడమైన నమ్మకం ఉంటుంది. మీలా ఎవరూ బ్యాలెన్స్డ్ గా ఉండరు.

వెడల్పాటి పాదం
ఒకవేళ మీ పాదం వెడల్పుగా ఉంటే.. మీరు ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఒక్క నిమిషం కూడా కూర్చోరు. పాదం పూర్తీగా మొపగలిగే వాళ్లు.. బిజీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. ఆలోచించడాన్ని ఆపేయాలి.



Click it and Unblock the Notifications











