Latest Updates
-
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్! -
ఈరోజు రాశి ఫలాలు (28.03.26): శనివారం నాడు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? -
అచ్చం హోటల్ స్టైల్ సాంబార్ కావాలా? అయితే ఈ మసాలాను ఇంట్లోనే చేసుకోండి! -
వంటగదిలో చెమటోడ్చే పనే లేదు.. ఈ ఎండల్లో స్టవ్ వెలిగించకుండా చేసే 4 అద్భుతమైన వంటలివే! -
ఈ కమ్మటి టమాటా గ్రేవీ చేస్తే.. తెలియకుండానే రెండు ఇడ్లీలు,దోశలు ఎక్కువే లాగించేస్తారు! -
కేవలం 2 బంగాళదుంపలతో..10 నిమిషాల్లో పొటాటో పాప్ కార్న్..పైన కరకరలాడుతూ, లోపల కరిగిపోయేలా.. -
సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిన ప్లేస్ ఇదే..శ్రీరామనవమికి అక్కడ అందుకే అంత స్పెషల్!
ఇంటికి, ఇంట్లోవారికి నరఘోష , నరదృష్టి తొలగిపోవడానికి ఏం చేయాలి?
నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి....థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు.ఆటోలు, లారీల వెనకాల 'బురీ నజర్‌వాలా తెరా మూహ్ హో కాలా' (దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా!) లాంటి వాక్యాలు రాస్తారు.'ఎవరి చూపు పడిందో ? పాడు కళ్లు,పాపిష్టి కళ్ళు వామ్మోఅని భయపడతారు.షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని, అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట.
సెడన్ గా ఆరోగ్యం క్షీణించడం లేదా బాగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగడం, పాడి పశువులు పాలు ఇవ్వకపోవడం మొదలైనవి యాదృచ్చికంగా జరుగుతాయా లేక దృష్టి సోకడమే సిసలైన కారణమా?
ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా ? ఇందులో శాస్త్రీయత ఉందా ? లేక ఇది కేవలం మూఢనమ్మకమా?
దృష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్తారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢ నమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుంది, నివారణోపాయాలేంటో తెలుసుకుందాం...

నరఘోష ,నరదృష్టి నిజంగా ఉందా? మూఢనమ్మకమా..?
మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్ని సార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్త్ కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది.

నరఘోష ,నరదృష్టి నిజంగా ఉందా? మూఢనమ్మకమా..?
ఎక్స్ రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది.

నరఘోష ,నరదృష్టి నిజంగా ఉందా? మూఢనమ్మకమా..?
కనుకు వక్ర దృష్టి ఈర్ష్యాసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు.

నరఘోష ,నరదృష్టి నిజంగా ఉందా? మూఢనమ్మకమా..?
తలనొప్పి,కడుపు నొప్పి,తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం,వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే అందునా పసిపిల్లలకు దృష్టి సోకినట్లు భావిస్తుంటారు. ఉన్నట్లుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేదా నిజంగా దృష్టి తగలడమేనా?

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరిపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్రనీళ్ళని దృష్టి తగిలిన వ్యక్తికి దిగదీసి మూడు దారులు కలిసే ప్రేదశంలో పారబోస్తారు.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పు తో దృష్టి తీస్తారు.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
విరగ్గాసిన చెట్లు, నిండుగా పండిన చేలు, సంవ్రుద్దిగా పాలిచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు , కొత్తగా కొన్ని వాహనం మొదలైన వాటికి కూడా దృష్టి తగులుతుందనే నమ్మకం ఉంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ, గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం, దృష్టిబొమ్మ వేలాడదీయడం, రాక్షసబొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేయాలి.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చాంటింగ్ చేస్తే , మన పనులు మనం చేసుకుంటూ పోతే దృష్టి ఉండదు(అంటే వ్యాపార సంస్థలో, ఇంట్లో కానీ భగవత్ చాంటింగ్ వినిపించాలి)

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
వారానికొకసారి వ్యాపార సంస్థలో, ఇంట్లో తడిగుడ్డుతో తుడవాలి, పసుపు నీళ్ళు జల్లాలి.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
ఇంట్లో ఇల్లాలు ప్రతి నిత్యం కాకపోయినా, గురువారం, శుక్రవారం, ఇంటికి లేదా షాపుల ద్వార బంధానికి పసుపు కుంకమ రాసి, బొట్టులు పెట్టిన నర దృష్టిపోతుంది.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
నిమ్మకాయలతో వ్యాపార సంస్థకి, ఇంటికి కానీ మూడు సార్లు అలా కుడి నుండి ఎడమకి తిప్పి, ఎడమకాలితో కనక ఆ నిమ్మకాయను తొక్కినా లేదా రోడ్డు మీద పడేవేసిన దృష్టి పోతుంది.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ, ఒక బూడిద గుమ్మడి కాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానితో పాటు పట్టిక నల్లటి దారంతో చుట్టి ఉంచిన దృష్టి పోవును.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
మంగళ, శుక్రవారం, ఆదివారం లేదా అమావాస్య రోజునకాని, వ్యాపారం చేసిన షాపు మూసిన తర్వాత ముద్దకర్పూరం వెలిగించి ఆ వ్యాపార జరిగే షాపు ముందు వేయాలి

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం..

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం చేయాలి.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
బ్యాంబు ట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడా అంటుంటారు. ఇది నవగ్రహాల్లో బుదగ్రహానికి చెందిచినది . బుధుడు వ్యాపార వ్రుద్ది కారకుడుకావటం వల్ల ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివ్రుద్ది చెందుతుంది. ఇంటికి ఏమైనా వాస్తు దోషాలున్నా, వీది పోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు నరద్రుష్టి , కనుద్రుష్టి, చెడు ఎనర్జీని పాజిటివ్ గా మార్చే శక్తి దీనికి ఉంది

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
ఇంటికి ఉన్న నరదృష్టి, నరగోష బయటికి పోవడానికి, సాయంత్రం 5.00 నుండి 6.10 గంటల మధ్య 1 నల్ల గుడ్డలో 1 చిటికెడు నల్ల నువ్వులు, చిటికెడు ఉప్పు వేసి నల్ల దారంతో కట్టి ఆ మూటని 1 మట్టి ప్రమిదలో పెట్టి 3 రకాల నూనెలు వేసి ఇంటికి దిష్టి తీసి దానిని ఒక ప్రక్కకు తెసుకొని వెళ్ళి దానిని వెలిగించాలి. మరుసటి రోజు ఆ కాల్చిన మిశ్రమాన్ని ప్రమిదతో సహా చెట్టు మొదలులో వేయాలి. అవి వేలగాకపోతే కర్పూరంతో వెలిగించండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరదృష్టి, నరగోష బయటికి పోతుంది.

దృష్టి తగిలినప్పుడు విరుగుడుగా ఏం చేయాలి?
ఇంటికి నర దృష్టి పోగొట్టే దృష్టి గణపతి.. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి.



Click it and Unblock the Notifications











