Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
షాక్..!! ప్రపంచంలోనే అతి పెద్ద సింక్హోల్స్ ( అగాధాలు )..
ఎర్త్ డే సందర్భంగా.. భూమిపై జరుగుతున్న భయంకరమైన విపత్తులు తెలుసుకుందాం. అవి ఎంత భయంకరమైనవి అంటే.. భూమినే క్రుంగిపోయేలా చేస్తున్న విపత్తులు. దీనంతటి కారణం ఎవరో కాదు.. మనమే. మనుషులమే. మనం మనుషుల్లా కాకుండా.. మిషిన్లలా.. కొత్త విషయాలు కనుక్కోవడానికి చేస్తున్న పనుల కారణంగా.. భూమికి, ప్రకృతికి కోలుకోలేని డ్యామేజ్ తీసుకొస్తున్నాం.
ప్రపంచంలోనే అతిపెద్ద సింక్హోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సింక్హోల్ అనేది కొత్తగా ఉన్నా.. ఇదో భయంకరమైన ప్రకృతి విపత్తు. భూమి తనంతట తాను లోపలికి క్రుంగిపోతుంది. అలా క్రుంగిపోయి ఏర్పడిన అతిపెద్ద అగాధాలు ఇప్పుడు చూద్దాం. ఇలాంటి విపత్తులను చూసిన తర్వాత అయినా మనలో మార్పు రాకపోతే.. ఇక భూమి అంతరించిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్ట్ లు.
మనం నేచర్ పై తీసుకొస్తున్న డ్యామేజ్ కారణంగా మన తర్వాతి తరాలు ఈ భూమ్మీద జీవించడానికి రిస్క్ గా మారుతుంది. మన వాతావరణంలో అనేక రకాల వినాశనాలకు మనమే కారణమవుతున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజురోజుకీ ఈ మార్పులు భయంకరంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సింక్హోల్స్ గతంలో చాలా చిన్నగా ఉండేవి. రోజులు గడిచేకొద్దీ వీటి పరిమాణం భారీగా పెరుగుతూ వస్తోంది. అలాంటి సింక్హోల్స్ ( అగాధాలు ) ఇప్పుడు చూద్దాం..

రష్యా
రష్యాలో ఏర్పడిన బెరెజ్నికి సింక్హోల్ ఇది. దీని పొడవు 80 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. దీని లోతు 200 మీటర్లు ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. దీన్ని మళ్లీ ఏర్పాటు చేయడానికి రష్యా దీనిపై పనిచేస్తోంది.
Image Courtesy

బెలీజ్
బెలీజ్ లోని బ్లూ హోల్ ఇది. విభిన్నమైన సింక్హోల్ మాత్రమే కాదు.. ఇది ఆకాశం నుంచి చూడగలిగిన ఒకే ఒక్క రంధ్రం.
Image Courtesy

సిమా హమ్ బోల్డ్ట్, వెనుజులా
వెనుజులాలోని బోలివర్ స్టేట్ లో ఉన్న అతిపెద్ద సింక్హోల్ ఇది. దీని లోతు 314 మీటర్లు , వెడల్పు 352 మీటర్లు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Image Courtesy

ఇజ్రాయిల్
డెడ్ సీ సింక్హోల్ ఇది. దీని లోతు దాదాపు 3 వేల మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ నీటి సమస్య ఉండటం వల్ల ఈ సింక్హోల్ అగాధం ఏర్పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
Image Courtesy

గాటెమాలా
2007 ఫిబ్రవరి 23న గాటెమాలా సిటీలో భూమి లోపలికి వెళ్లిపోవడం వల్ల ఈ సింక్హోల్ ఏర్పడించింది. ఇది చాలా లోతుగా.. రంధ్రంలా ఏర్పడింది.
Image Courtesy

చైనా
క్జియోజై టియానాకెంగ్ సింక్హోల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింక్హోల్. ఇది 626 మీటర్ల పొడవు, 537 మీటర్ల వెడల్పు ఉంటుంది.
Image Courtesy

ఫ్లోరిడా
డెవిల్స్ టాయిలెట్ బౌల్ అని పిలుస్తారు ఈ సింక్హోల్ ని. ఇది గతంలో కనిపించేది కాదు. తర్వాత ఇది పిక్ నిక్ స్పాట్ లా మారింది. ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.



Click it and Unblock the Notifications