Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
డిగ్రీ లేకపోయినా.. వాళ్లు టెక్నాలజీ రంగంలో వరల్డ్ ఫేమస్.. !
మనకు చిన్నప్పటి నుంచి.. బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటేనే.. మంచి స్థాయికి వెళ్లగలరు అని మన పేరెంట్స్ చెబుతూ ఉంటారు. ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ రావాలి అని, మంచి మార్కులు సాధించాలని మనకు చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. అలాగే.. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్.. ఇలా అన్నింటా.. తామే మొదటి స్థానంలో ఉండాలని ఎంకరేజ్ చేస్తుంటారు.
డిగ్రీలు లేకపోతే.. జీవితంలో ఏం సాధించలేరని, ఉన్నతస్థానానికి చేరుకోలేరని తల్లిదండ్రులు సూచిస్తుంటారు. కానీ ఎక్కడా ఫస్ట్ రాలేదు.. అసలు డిగ్రీలే అందుకోలేదు కానీ.. వాళ్లు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న టెక్నాలజీలో ముందంజలో దూసుకుపోతున్నారు. కోట్లకు కోట్లు సంపాదించి.. అదరహో అనిపిస్తున్నారు.
కాలేజీలకు వెళ్లకుండా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లా ఉన్న వాళ్లే. ఇష్టమొచ్చినప్పుడు కాలేజ్ కి వెళ్లడం, తిరగడం, ఇష్టమైన పనిచేసుకుంటూ.. సరదాగా గడిపినవాళ్లే. కానీ.. డిగ్రీ కూడా లేని వాళ్ల కింద.. మేధావులు, టాప్ స్టూడెంట్స్, తెలివైన వాళ్లు పనిచేస్తున్నారు. మరి డిగ్రీలు లేకుండా.. ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు సంపాదించిన టెక్ దిగ్గజాలెవరో తెలుసుకోవాలనుందా .. ? టేక్ ఎ లుక్

బిల్ గేట్స్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్ ఎలాంటి పట్టాలు అందుకోలేదు. 20 ఏళ్లలో కాలేజీ మానేశాడు. కానీ.. సక్సెస్ ఫుల్ గా మైక్రోసాఫ్ట్ కి అధినేత అయ్యారు.

స్టీవ్ జాబ్స్
యాపిల్ కంపెనీ ఛైర్మన్ స్టీవ్ జాబ్స్ కూడా డిగ్రీ పూర్తిచేయని లిస్ట్ లో ఉన్నారు. ఈయన 19 ఏళ్ల వయసులో కాలేజీ మానేశారు. టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టాడు. క్యాన్సర్ బారిన పడినా.. ఐపాడ్, ఐఫోన్ లను కనిపెట్టి.. 2011లో చనిపోయారు.

జుకర్ బర్గ్
ప్రస్తుతం యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ద బెస్ట్ యూరివర్సిటీల్లో చేరాడు. కానీ.. చదువు మాత్రం పూర్తి చేయలేదు. 20 ఏళ్లకే టెక్నాలజీ రంగంలో బిజినెస్ స్టార్ట్ చేశాడు. డబ్బు సంపాదించడానికి, పేరు ప్రతిష్టలు పొందడానికి డిగ్రీ అవసరం లేదని నిరూపించారు.

మైఖేల్ డెల్
డెల్ కంపెనీ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఏంటో చెప్పనక్కరలేదు. ఈ కంపెనీ వ్యవస్థాపకడుు మైఖేల్ డెల్ కూడా 19 ఏళ్ల వయసులోనే కాలేజీ చదువుకి గుడ్ బై చెప్పేశారు. తనకు నచ్చిన రంగంలో అడుగుపెట్టి.. పీసీలు, ల్యాప్ టాప్ లు తయారు చేసే డెల్ స్థాపించి సక్సెస్ అవుతున్నారు.

జాన్ కౌమ్
చేతిలో మొబైల్ ఉంటే చాలు.. అందరూ వాట్సాప్ లో చిట్ చాట్ లో మునిగిపోయి ఉంటారు. మరీ దీన్ని స్టార్ట్ చేసి జాన్ కామ్ కూడా డిగ్రీ అందుకోలేదు. 21 ఏళ్ల వయసులోని చదువు మానేసి.. వ్యాపారాల్లో మునిగిపోయారు.

ఇవాన్ విలియం
ప్రపంచంలోనే అందరితోనూ మాట కలిపించే ట్విట్టర్ క్రియేటర్ ఇవాన్ విలియం. తనకు 20 ఏళ్లు ఉన్న సమయంలో.. చదువు ఆపేసి.. సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేశాడు. ట్వట్టర్ తో అద్భుతమైన విజయం సాధించారు.

లారీ ఇల్లీసన్
ఒరాకిల్ అధినేత లారీ ఇల్లీసన్. టెక్నాలజీలో తనదైన శైలిలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న లారీ ఇల్లీసన్ కూడా టెక్ దిగ్గజాల బాటలో నడిచాడు. 20 ఏళ్లకే చదువుకి గుడ్ బై చెప్పి బిజినెస్ లలోకి ఎంటర్ అయ్యారు. సక్సెస్ అయ్యారు.

ట్రావిస్ కలానిక్
ప్రస్తుతం ఆటోలు, బస్ లకోసం ఎదురుచూసే పని లేకుండా.. ఆన్ లైన్ ట్రావెలింగ్ పరిచయం చేసింది ఊబర్. ఈ కంపెనీ ప్రారంభించిన ట్రావిస్ కలానిక్ కూడా 21 ఏళ్లలోనే కాలేజీకి వెళ్లకుండా.. మధ్యలోనే మానేశాడు.



Click it and Unblock the Notifications