Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ రాశిని బట్టి ఫ్యాషన్ ఐకాన్ గా మారడం ఎలా..?
నలుగురికి నచ్చినది మీకస్సలు నచ్చకపోవచ్చు.. పరులెవరూ మెచ్చని వాటినే మీరు కావాలనుకోవచ్చు.. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ.. ఐకాన్‌లుగా ఉండాలనుకునేవాళ్లే! మీ రాశిని బట్టి మీ ఎంపిక ఉంటుందనే విషయం తెలుసా?అయితే తెలుసుకోండి.. ఇక్కడ చూద్దాం..

మేషరాశి :
రాశుల్లోనే కాదు.. ఫ్యాషన్ అవ్వడంలోనూ మీరు మీరు ట్రెండ్‌ని ఫాలో కారు.. సెట్ చేస్తారు. ఫ్యాషన్ ప్రపంచంలో మీది ఒక స్టెప్ ముందే. వ్యక్తిగత స్టైల్‌కి, కంఫర్ట్‌కే మీ ఓటు. మీ వార్డ్ రోబ్‌లో ఎరుపు రంగు రాజ్యమేలుతుంది. లేత రంగులను మాత్రం ఎంచుకోరు. ఫ్యాషన్ ఐకాన్స్ : చిత్రంగదా సింగ్, సారా జెస్సికా పార్కర్, లేడిగాగా, లారా దత్తా, విక్టోరియా బెక్‌హమ్

వృషభం :
తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీస్ వెతకడంలో మీరు బెస్ట్ మీలో ప్రాక్టికాలిటీ ఎక్కువ అందుకే కంఫర్ట్‌కే మొగ్గు చూపుతారు.. అందుకే మీ వార్డ్‌రోబ్‌లో తక్కువ దుస్తులు, యాక్సెసరీస్ ఉంటాయి. మీకు ఏవి నప్పుతాయో మాత్రం మీకు బాగా తెలుసు. కశ్మిరీ సిల్క్ అంటే మీకు మక్కువ. గులాబీ, నీలి రంగులను ఎక్కువగా ఇష్టపడతారు. ఐకాన్స్ : అనుష్క శర్మ, జెస్సికా ఆల్బా, మేఘనా ఫాక్స్

మిథునం :
మీకు ట్రెండ్స్ మార్చటం వెన్నతో పెట్టిన విద్య. అందుకే మీ వార్డ్‌రోబ్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీ డ్రెస్సింగ్ మితిమీరే అవకాశాలుంటాయి. సో జాగ్రత్త. జీన్స్, టీ షర్ట్‌తో సింపుల్ లుక్‌ని కోరుకుంటారు. మిక్సింగ్ ప్రింట్స్, మిక్స్ అండ్ మ్యాచ్‌లను ఇష్టపడతారు. ఐకాన్స్ : సోనమ్‌కపూర్, ఏంజెలీనా జోలి, సోనాక్షి సిన్హా

కర్కాటకం :
భావోద్వేగాలు, సెంటిమెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్ ఈ రాశివారు. పాత బట్టలను పారేయకుండా, ఓల్డ్ ట్రెండ్‌నే ఎక్కువగా ఫాలో అవుతుంటారన్నమాట. ప్రతిదానికీ సెంటిమెంటుని వెతుక్కుంటూ క్లాసీ లుక్‌ను ఇష్టపడతారు. ఐకాన్స్ : కత్రినా కైఫ్, సోఫియా వెర్గరా, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్

సింహం :
క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే ట్రెండ్‌ని కమాండ్ చేయాలనుకుంటారు. భారీ ధర, హైబ్రాండ్ ఐటమ్స్‌నే వీరు ఇష్టంగా కొంటారు. గ్లామర్ డాల్‌గా వెలిగిపోతూ ైస్టెల్ ఐకాన్‌గా ఉండాలని వీరి ఆశ. వీరి వార్డ్‌రోబ్ ఇంధ్రధనస్సులా ఉంటుంది. ఐకాన్స్ : హలీ బెర్రీ, మడోన్నా, కాజోల్, జెన్నిఫర్ లారెన్స్

కన్య :
మీరు వెతికే ట్రెండ్.. ప్రతీ అకేషన్‌కి పనికొచ్చేదిగా ఉండాలని ఆలోచిస్తారు. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ మీదే దృష్టి పెడతారు. ట్రెండ్‌ను అవుతున్నామనే అనుకుంటారు.. కానీ మీరు గమనించే సరికే అవుటాఫ్ ఫ్యాషన్‌గా మారిపోతుంది. ఐకాన్స్ : కరీనా కపూర్, నేహాదూపియా, బ్లెక్ లైవ్లీ, బీయాన్స్

తులారాశి :
హాట్ చిక్.. సెక్సీ లుక్ లేడీస్ అంటే మీరే! మీరే బెస్ట్‌గా ఉండాలనుకుంటారు. కుచ్చుల డ్రెస్సులు, డిజైనర్ నగల మీదే మీ చూపు. ఎప్పటికపుడు ట్రెండీగా ఉంటారు. మీకు మినీ నుంచి మ్యాక్సీల దాకా అన్నీ మీకు బాగా నప్పుతాయి. ఐకాన్స్ : కేట్ విన్స్‌లెట్, గ్వైనెత్ పాల్‌త్రో

వృశ్చికం :
వీరికి అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. అంటిపెట్టుకొని ఉండే డ్రెస్సులను, బ్యాక్‌లెస్ డ్రెస్సులను ఎక్కువగా ఇష్టపడతారు. మీకు ఏది బాగా నప్పుతుందో మీకు బాగా తెలుసు. మీ వార్డ్‌రోబ్ బ్లాక్ అండ్ వైట్‌గా ఉంటుంది. ఐకాన్స్ : సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్, అన్నా హత్‌వే

ధనుస్సు :
మీది పర్సనాలిటీ. ఎక్కువగా లెదర్ జాకెట్స్, చిట్టి స్కర్ట్స్‌ను వేసుకుంటారు. డ్రెస్సింగ్‌లోనే మీ ఆత్మవిశ్వాసం తెలిసిపోతుంది. ఫ్యాషన్ ప్రపంచం మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిందనే విషయం ఈజీగా తెలిసిపోతుంది. క్యాజువల్స్ మీకు బాగా సూటవుతాయి. ఐకాన్స్ : దియామిర్జా, సమీరారెడ్డి, స్కార్‌లెట్ జాన్సన్.

మకరం :
ఒక ట్రెండ్‌కి ఫిక్స్ అయిపోయి, రిస్క్‌లకు దూరంగా ఉంటారు. బెస్ట్‌గా ఉండేందుకు మాత్రం ప్రయత్నిస్తుంటారు. సొంతగా కొత్త ైస్టెల్ క్రియేట్ చేసుకుంటారు. డార్క్ గ్రే, బ్లాక్ షేడ్స్ బాగా వాడతారు. ఐకాన్స్ : దీపికా పదుకొనే, కేట్ మిడిల్‌టన్, విద్యాబాలన్

కుంభం:
సెలక్షన్ విషయంలో వీరు పూర్. అన్నీ ముదురు రంగు డ్రస్సులే సెలక్ట్ చేసుకుంటారు. నప్పుతాయా లేదా అని ఆలోచించరు. కంటికి నచ్చితే కొనేస్తారు. ఐకాన్స్ : జెన్నిఫర్ అనీస్టన్, ప్రీతిజింటా, షకీరా

మీనం :
చేపలు సముద్రంలోనే కదా ఉండేది.. అందుకే ఆ నీలి రంగునే ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్టిస్టిక్‌గా మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. ట్రెండ్స్ గురించి అస్సలు పట్టించుకోరు. లాంగ్ స్కర్ట్స్ మీద మక్కువ. బట్టల కంటే ఫుట్‌వేర్‌కి ప్రాధాన్యతనిస్తారు. : కంగనా రనౌత్, ఆలియాభట్, శ్రద్ధా కపూర్, ఫరాఖాన్ అలీ, రిహానా



Click it and Unblock the Notifications











