బంగారం ధరించేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్..!!

By Swathi

రత్నాలలో దాగున్న ఆధ్మాత్మిక ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. చాలామంది రకరకాల ఆచారాలు కలిగిన వాళ్లు.. బంగారం ప్రతిరోజూ ధరించడం వల్ల లేదా ఏదైనా రత్నాలను ధరించడం వల్ల.. సంతోషం, లక్, ప్రేమ, ఆధ్మాత్మిక ప్రశాంతత పొందవచ్చని భావిస్తారు.

అయితే బంగారం పెట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరికీ ప్రీతికరమే. ముఖ్యంగా ఆడవాళ్లకు ఎంత బంగారం ఉన్నా.. మోజు తీరదు. అయితే.. ప్రతిరోజూ చిన్న ఉంగరమైనా బంగారంతో చేసినది ధరించాలని భావిస్తారు. మరి బంగారం ధరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో చూద్దాం..

నెగటివ్ ఎనర్జీ

నెగటివ్ ఎనర్జీ

ముఖ్యంగా బంగారం ధరించడం వల్ల శరీరంలో చెడు ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఆధ్మాత్మిక ఉపశమనం కలుగుతుందని, నెగటివ్ ఎనర్జీల నుంచి రక్షణ కల్పిస్తుందని భావిస్తారు.

స్టేటస్ సింబల్

స్టేటస్ సింబల్

బంగారం, డబ్బు ఉన్నవాళ్లను అత్యంత ధనవంతులుగా.. కొన్నేళ్లుగా పరిగణిస్తున్నారు. అయితే స్టేటస్ సింబల్ కంటే.. బంగారంలో.. అత్యంత ఎక్కువ ఆధ్మాత్మిక పవర్స్ ఉన్నాయి. ఇది.. సంతోషం, ప్రశాతంత, స్థిరత్వం తీసుకొస్తుంది. కానీ.. దీన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

బంగారం ధరించడం వల్ల శిఖర భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. అలాగే.. బంగారం దుష్టశక్తులను శరీరానికి దూరంగా ఉంచుతుంది.

లక్కీగా

లక్కీగా

బంగారాన్ని ఆదిమ కాలం నుంచే సంపద, లక్ కి చిహ్నంగా భావిస్తారు. అలాగే కాన్ఫిడెన్స్ ని మెరుగుపరుస్తుంది.

ఉంగరం

ఉంగరం

ఉంగరపు వేలుకి ఉంగరం పెట్టుకోవడం వల్ల.. అత్యంత గొప్ప ఏకాగ్రత పొందగలుగుతారు. బంగారపు ఉంగరం ద్వారా.. గొప్ప శక్తి యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల అది కొన్ని బ్లాక్ ఎనర్జీ రూపంలో ఉండే సమస్యలను తొలగిస్తుంది.

మగవాళ్లు, ఆడవాళ్లు

మగవాళ్లు, ఆడవాళ్లు

బంగారు ఉంగరాన్ని మహిళలు ఖచ్చితంగా ఎడమ చేతికి, మగవాళ్లు కుడిచేతికి ధరించాలి.

సంపదకు చిహ్నం

సంపదకు చిహ్నం

భూమిలో లభించే అత్యంత ముఖ్యమైన ఖనిజం బంగారం. ఇది సంపదకు, రాయల్టీకి చిహ్నం. ఆస్ట్రాలజీ ప్రకారం బంగారం ప్రతి గ్రహానికి సంబంధించినది. అయితే ముఖ్యంగా జుపిటర్ కి సంబంధించినది.

సరైన పద్ధతిలో

సరైన పద్ధతిలో

బంగారం ప్రతి ఒక్కరికీ నప్పుతుంది. కానీ.. మీకు అది సూట్ అవలేదు అంటే.. మీరు బ్యాడ్ లక్ ని ఫేస్ చేస్తారు. బంగారాన్ని సరైన విధంగా ధరిస్తే.. లక్, సంపదను ఎట్రాక్ట్ చేస్తుంది.

పవర్స్

పవర్స్

బంగారం ఎనర్జీని, వేడిని గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. అలాగే.. విషాన్ని తగ్గించే పవర్ ఉంటుంది.

స్టేటస్ సమస్య

స్టేటస్ సమస్య

ఒకవేళ మీకు నేమ్, ఫేమ్, స్టేటస్ సమస్యలు ఉంటే.. మధ్యవేలుకి ఉంగరాన్ని ధరించాలి.

దగ్గు, జలుబు

దగ్గు, జలుబు

ఒకవేళ మీకు దగ్గు, జలుబు సమస్య ఉంటే.. చిటికెన వేలుకి ఉంగరం ధరించాలి.

ఏకాగ్రత

ఏకాగ్రత

ఒకవేళ మీరు ఏకాగ్రత చూపించలేకపోవడం, త్వరగా డిస్టర్బ్ అవుతున్నారు అంటే.. చూపుడు వేలుకి ఉంగరం ధరించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు.

వైవాహిక జీవితంలో సమస్యలు

వైవాహిక జీవితంలో సమస్యలు

ఒకవేళ మీరు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం, మీ భాగస్వామితో ప్రేమగా గడపలేకపోతున్నారు అంటే.. బంగారాన్ని మెడకు చెయిన్ లేదా పెండెంట్ రూపంలో ధరించాలి.

సంతానం

సంతానం

పిల్లలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు.. ఉంగరపు వేలుకి బంగారం ధరిస్తే.. ఆశించిన ఫలితం పొందుతారు.

ఒబేసిటీ

ఒబేసిటీ

పొట్ట సమస్యలు, ఒబేసిటీతో బాధపడేవాళ్లు.. బంగారం ధరించకపోవడం మంచిది.

కోపం

కోపం

కోపంగా ఉండేవాళ్లు, చీటికీ మాటికీ కోపానికి గురయ్యేవాళ్లు.. బంగారం ధరించకూడదు.

వ్యాపారస్తులు

వ్యాపారస్తులు

ఇనుము, బొగ్గు వంటి వ్యాపారాలు చేసేవాళ్లు.. బంగారం ధరించకూడదు. గర్భిణీలు, వయసైన మహిళలు.. బంగారం ధరించకూడదు.

కలలో బంగారం

కలలో బంగారం

కలలో బంగారం లేదా డబ్బుని చూడటం మంచిది కాదు. అలా కనిపిస్తే.. చర్మ, ముఖ వ్యాధులకు సంకేతం. ఒకవేళ బంగారాన్ని కలలో చూస్తే.. చాలా కష్టపడిన తర్వాత డబ్బు పొందుతారు.

గోల్డ్ కాయిన్స్

గోల్డ్ కాయిన్స్

పురాతన కాలం నాటి బంగారు నాణేలను కలలో చూసినట్లైతే.. కెరీర్ కి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

లక్ష్మీ స్వరూపం

లక్ష్మీ స్వరూపం

బంగారం లక్ష్మీ స్వరూపం. కాబట్టి.. బంగారాన్ని నడుము కింద ధరించడం.. ఆమెను అగౌరవంగా చూసినట్టే.

ఎడమ చేతికి

ఎడమ చేతికి

బంగారాన్ని అవసరమైతేనే ఎడమచేతికి ధరించాలి. చాలా దగ్గరివాళ్లు, ఇష్టమైన వాళ్లకు ఎప్పుడూ.. బంగారాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి.

పాదాలకు

పాదాలకు

బంగారాన్ని పట్టీల రూపంలో లేదా పాదాలకు ఎట్టిపరిస్థితుల్లో ధరించకూడదు. పిల్లలు ఎరుపు మొలతాడులో బంగారాన్ని జతచేసి ధరించవచ్చు.

ఆల్కహాల్, మాంసాహారం

ఆల్కహాల్, మాంసాహారం

బంగారం ధరించేటప్పుడు మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ సేవించకూడదు. దీనివల్ల బ్యాడ్ లక్ వెంటాడుతుంది.

లాకర్స్ లో వద్దు

లాకర్స్ లో వద్దు

బంగారాన్ని సాదారణంగా లాకర్స్ లో పెట్టుకుంటారు. ఎప్పుడూ బంగారాన్ని రెడ్ పేపర్ లేదా రెడ్ క్లాత్ లో పెట్టుకోవాలి. అది కూడా తూర్పు లేదా నైరుతి వైపు పెట్టుకోవాలి.

తలకు దగ్గర

తలకు దగ్గర

తలకు దగ్గరగా.. బంగారాన్ని పెట్టుకోకూడదు. దీనివల్ల నిద్రలేమి సమస్యను ఫేస్ చేస్తారు. బంగారంతో పాటు, మిక్స్ మెటల్ లేదా ఐరన్ ధరించకూడదు.

రాశులకు

రాశులకు

మేషరాశి, కర్కాటక రాశి, సింహ రాశి, ధనస్సు రాశివాళ్లకు బంగారం చాలా మంచిది. వృశ్చిక రాశివాళ్లకు, మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వృషభరాశి వాళ్లకు, కన్యారాశి వాళ్లకు, మిథునరాశి వాళ్లకు, కుంభరాశివాళ్లకు సమస్యలు తీసుకురావచ్చు. తులా, మకర రాశివాళ్లు బంగారానికి దూరంగా ఉండటం మంచిది.

Story first published: Tuesday, September 6, 2016, 16:00 [IST]
Desktop Bottom Promotion