Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఫేస్ బుక్ కి అడిక్ట్ అవడానికి ఫన్నీ రీజన్స్
ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఫేస్ బుక్ అనేది.. చాలా ముఖ్యమైపోయింది. ఏది లేకపోయినా ఉండగలరు కానీ.. ఫేస్ బుక్ లో అప్ డేట్స్ చేయకుండా, చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పై మనుషుల్లో ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయింది. ఫేస్ బుక్, ట్విట్టర్ అనేవి మన జీవితాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి.
మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీకు ఇష్టమైన సెలబ్రెటీలను అనుసరించవచ్చు. ఒక సామాజిక వివాదం మీద వ్యతిరేకంగా నిరసన చేయవచ్చు. అంతేకాక ఫేస్ బుక్ లో మీ ఆలోచనలను సులభంగా పంచుకోవచ్చు. మీ స్నేహితులతో వీడియోలు, ఫోటోలు భాగస్వామ్యం కూడా చాలా సులభం.
ఫేస్ బుక్ లో ఉన్న గొప్పదనం ఏమిటి? అంటే మీకు, మీ పాత స్నేహితుల మధ్య ఇది వారదిలా ఉంటుంది. అలాగే కొత్త స్నేహితులను కలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి ఫేస్ బుక్ ను యూత్ తోపాటు, పెద్దవాళ్లు కూడా ఈ మధ్య ఇంతగా ఇష్టపడటానికి కారణమవుతున్నాయి.
కారణాలు ఏమైనా ఫేస్ బుక్ వాడటానికి కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎక్కువగా ఫేస్ బుక్ ని వాడుతూ ఉంటే దానికి అడిక్ట్ అయిపోతారు. ఫేస్ బుక్ అనేది ప్రజలను కనెక్ట్ చేయడానికి ఒక మాధ్యమం. అయితే, ఆ ప్రయోజనం మర్చిపోయి, వారి రోజువారీ పనులను భాగస్వామ్యం చేయటానికి ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఫేస్ బుక్ ద్వారా మనుషుల్లో వస్తున్న మార్పులు, ఆశ్చర్యకర విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అలాగే ఫేస్ బుక్ కి అందరూ ఎందుకు అడిక్ట్ అవుతున్నారో కొన్ని ఫన్నీ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

1. ఒంటరితనం
ఫేస్ బుక్ లేదా ఇతర నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువగా భాగస్వామ్యం చేసే వారికీ ఒంటరితనం ఏర్పడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాగే కామెంట్స్, లైక్స్ గురించి తరచు తనిఖీ కారణంగా స్వీయ ముట్టడి సంభవించవచ్చు.

2. ఎక్కువగా లైక్స్
ప్రజలు ఫేస్ బుక్ కి ఎందుకు బానిస అవుతున్నారో అని ఫన్నీ కారణాలను చెప్పుతున్నప్పుడు మొదట లైక్స్ గుర్తుకువస్తాయి. మీరు పెట్టిన పోస్ట్ లేదా ఫోటోకు ఎన్ని లైక్స్ వచ్చాయి? మీకు 5 లైక్స్ వచ్చి మరియు మీ స్నేహితుడుకి 50 లైక్స్ వస్తే వాళ్లు మీ కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందారని అర్ధం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఇది ఒక సాధారణ విషయం.

3. ఆటలకు బానిస
మీరు ఏమైనా ఆటలు ఆడుకోవాలంటే బయటకు వెళ్ళవచ్చు. కానీ ప్రజలు ఫార్మ్ విల్లీ, కిచెన్ స్క్రంబాల్ ఆటలు ఆడుతూ, గేమ్ రిక్వెస్ట్ లను పంపడం ద్వారా మిగిలిన వారికీ చికాకు కలిగిస్తారు. మీరు వంటల గేమ్స్ లో వంటలు తయారు చేయవచ్చు. మీరు వాటిని తయారు చేశాక మీరు గొప్ప చెఫ్ కావచ్చు.

4. ఎక్కువగా భాగస్వామ్యం చేయుట
నేను ఈ రోజు రెండు రోటీలు, కొన్ని కూరగాయలతో భోజనం చేశాను. అని స్టేటస్ పెడుతూ ఉంటారు. కానీ.. నిజంగా? అది అంత గొప్ప విషయమేం కాదు. కానీ దీనిగురించి చాలా మంది స్పందిస్తూ ఉంటారు. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలకంటే.. ఇదేమీ గొప్ప విశేషం కాదు. కానీ ఫేస్ బుక్ కి అడిక్ట్ అయ్యారనడానికి ఇదో ఫన్నీ రీజన్.

5. అనవసర విషయాలు
మీరు నిజంగా ప్రజలు ఫేస్ బుక్ కి ఎందుకు అలవాటు పడ్డారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలామంది తమకు హార్ట్ బ్రేక్ అయినంత ఫీలింగ్ కలుగుతోందని ఒక పోస్ట్ చేస్తారు. అంతే ఇక.. ఒక్కసారిగా కామెంట్స్ వదరలై వచ్చేస్తాయి. ఎందుకు? ఏం జరిగింది? అంటూ ప్రశ్నిస్తారు. దానికి స్పందిస్తూ ఏమీ లేదు, ఆ తర్వాత మీరు చెబుతామని రిప్లై ఇస్తుంటారు. అసలు ఇలాంటి విషయాలు ఎందుకు పోస్ట్ చేస్తారో అర్థం కాదు. కదూ..

6. ఫన్నీ ఫోటోలు
తరచుగా ఫన్నీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే.. అది అలాగే అడిక్షన్ లా మారిపోతుంది. అలాగే సొంత ఫోటోలకు ట్యాగ్ లు కూడా క్రియేట్ చేస్తుంటారు ? కానీ ఇతరుల గుర్తింపు కోసం ఇలా ట్యాగ్ చేయడం అలవాటుగా మారి ఉంటుంది. ఫేస్ బుక్ కి బానిస కావటానికి ఇదో ఫన్నీ రీజన్ గా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications











