For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెండి వస్తువులను ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వకూడదా ?

కొంతమంది వెండి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వకూడదు అంటారు. అసలు వెండి వస్తువులు గిఫ్ట్ ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా ? ఇస్తే ఏమవుతుంది ? అసలు ఇతరులకు గిఫ్ట్ గా ఎలాంటి వస్తువులను ఇస్తే మంచిది ?

By Swathi
|

సాధారణంగా ఏదైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు, స్నేహితులు, ఇష్టమైన వాళ్ల బర్త్ డే, పెళ్లి రోజులకు, ఏదైనా టూర్ కి వెళ్లి వచ్చిన తర్వాత వాళ్ల కోసం ఏవైనా గిఫ్ట్స్ తీసుకురావడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తులు, లేదా భాగస్వామికి తాము ఎంతగానో ఇష్టపడే వస్తువులో, బట్టలనో గిఫ్ట్ గా ఇస్తారు.

Giving Or Receiving These 6 Gifts

ఇలా గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తిపై అభిమానం, ప్రేమను తెలుపుతుంది. కానీ మీరు అమితంగా ఇష్టపడే వ్యక్తికి గిఫ్ట్ తీసుకునేటప్పుడు చాలా లాజిక్ గా ఆలోచిస్తారు. అయితే కొన్ని రకాల గిఫ్ట్ లను ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల అదృష్టం కలిసొస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.

అయితే కొంతమంది వెండి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వకూడదు అంటారు. అసలు వెండి వస్తువులు గిఫ్ట్ ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా ? ఇస్తే ఏమవుతుంది ? అసలు ఇతరులకు గిఫ్ట్ గా ఎలాంటి వస్తువులను ఇస్తే మంచిది ?

న్యూ ఇయర్ దగ్గరపడుతోంది.. ఇక తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇష్టమైన వాళ్లకు ఏం గిఫ్ట్ ఇద్దామా అని.. మార్కెట్ లో వెతుకుతూ ఉంటారు. అయితే ఈసారి గిఫ్ట్ ని ఎంచుకునేటప్పుడు వాళ్ల ఇంట్లో అందాన్ని మాత్రమే కాదు.. వాళ్ల జీవితంలోనూ, మీ జీవితంలోనూ అదృష్టాన్ని తీసుకొచ్చే గిఫ్ట్ ని ఎంచుకోండి.

వాస్తు

వాస్తు

గిఫ్ట్స్ అంటే వాస్తు, ఇష్టం, సంతోషం, అదృష్టం తీసుకొచ్చే వస్తువులను ఎంచుకుని ఇవ్వాలని ఆస్ట్రాలజీ చెబుతోంది.

ఏనుగు

ఏనుగు

ఏనుగు బొమ్మ గిఫ్ట్ ని ఇవ్వడం లేదా తీసుకోవడం అత్యంత శుభప్రదమైనది. కాబట్టి ఈసారి మీకు ఇష్టమైనవాళ్లకు ఏనుగు బొమ్మలను గిఫ్ట్ గా ఇవ్వండి.

వెండి లేదా బంగారం

వెండి లేదా బంగారం

ఒకవేళ వెండి లేదా గోల్డ్ ప్లేటెడ్ ఏనుగుల జంట బొమ్మను ఇవ్వలేకపోతే.. చెక్క లేదా ఇత్తడితో చేసిన ఏనుగు బొమ్మలను గిఫ్ట్ గా ఇవ్వండి.

మట్టితో చేసినవి

మట్టితో చేసినవి

వాస్తు ప్రకారం మట్టితో చేసిన వస్తువులు జీవితంలో కష్టాలు, సమస్యలను తొలగించి ధనాన్ని పెంచుతాయి. కాబట్టి మట్టితో తయారుచేసిన ఏదైనా షోకేజ్ వస్తువు గిఫ్ట్ గా ఇవ్వండి.

మట్టి వస్తువులే

మట్టి వస్తువులే

అందమైన దీపాలు, ఫ్లవర్ వేజ్, ల్యాంప్స్, హుండీలు ఏవైనా ఇవ్వవచ్చు. కానీ మట్టితో చేసినవై ఉండాలి.

వెండి వస్తువులు

వెండి వస్తువులు

శాస్త్రాల ప్రకారం వెండి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా శుభప్రదమైనది. అయితే బంగారం ఇవ్వడం మంచిది కాదు. వెండి వస్తువులు ఇవ్వడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.

తెల్ల గుర్రాలు

తెల్ల గుర్రాలు

చైనీస్ వాస్తు ప్రకారం పరుగెడుతున్న 7 తెల్ల గుర్రాల పెయింటింగ్ లేదా బొమ్మలను గిఫ్ట్ గా పొందడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు.. ఆదాయం కూడా పెరుగుతుంది.

బట్టలు

బట్టలు

బట్టలు లేదా డ్రస్సులను గిఫ్ట్ గా ఇవ్వడం, తీసుకోవడం రెండూ మంచిదే. అయితే కొన్ని నియమాలు పాటించాలి.

నలుపు

నలుపు

బ్లాక్ కలర్ క్లాత్స్ మీ స్నేహితులకు ఇవ్వకూడదు. ఎందుకంటే.. వాళ్ల రాశి ప్రకారం వాళ్లకు నలుపు రంగు దుస్తులు కలిసొస్తాయో లేదో తెలియదు కాబట్టి వాటిని ఇవ్వకపోవడమే మంచిది.

English summary

Giving Or Receiving These 6 Gifts Are Considered Lucky According To Vastu

Giving Or Receiving These 6 Gifts Are Considered Lucky According To Vastu. We bring you a list of gift ideas that bear a combination of Vastu and astrological advice .
Desktop Bottom Promotion