Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీరు నమ్మినా..నమ్మకపోయినా.. ఇవి కేవలం కల్పితాలు కాదు...నిజాలే..!
అపోహల మీద అపోహలు.. ఎక్కడ పుడతాయో తెలియదు.. ఎలా వ్యాపిస్తాయో అంతకన్నా తెలియదు. కానీ, నిజాల కంటే వేగంగా వ్యాపిస్తాయి. మనుషుల మనసుల్లో బలంగా నాటుకుపోతాయి.
అపోహల మీద అపోహలు.. ఎక్కడ పుడతాయో తెలియదు.. ఎలా వ్యాపిస్తాయో అంతకన్నా తెలియదు. కానీ, నిజాల కంటే వేగంగా వ్యాపిస్తాయి. మనుషుల మనసుల్లో బలంగా నాటుకుపోతాయి.
ముఖ్యంగా అందం, ఆరోగ్యం విషయంలో చాలామందికి అనేక అపోహలు, అనుమానాలుంటాయి.
ఏం తింటే ఏమవుతుందోన అని ఆందోళన పడుతుంటారు. దీంతో కొన్ని రకాల ఆహార పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటారు. కొన్ని అపోహలు నిజమేననుకొని అనుక్షణం భయపడుతుంటారు. అందులో కల్పనలేవో.. నిజాలేవో గుర్తిస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చని ఆరోగ్య, మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

అపోహ : జుట్టును కత్తిరిస్తే బాగా పెరుగుతుంది
నిజం : తరచుగా కత్తిరించడం వల్ల జుట్టు పెరుగుదల రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం. కానీ ఇది నిజం కాదు. వెంట్రుకలు కుదుళ్ల నుంచి మాత్రమే పెరుగుతాయి. జుట్టు పెరుగుదల అనేది మొదళ్లు, తలపై ఉన్న చర్మం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పోషకాలున్న ఆహారం తీసుకుంటేనే జుట్టు బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టును కత్తిరించడం వల్ల దాని ఆరోగ్యం మెరుగుడడంతోపాటు అందంగా కనిపిస్తుంది. నూనె వల్ల కూడా జట్టుకు పోషణ అందదు. అది కండీషనర్‌గా మాత్రమే పనిచేస్తుంది.

అపోహ : మహిళలకు హై బీపీ ఎక్కువగా రాదు.
నిజం : గుండె, మెదడు, మూత్రపిండాలు తదితర శరీర అవయవాల పనితీరుపై రక్తపోటు అధిక ప్రభావాన్ని చూపుతుంది. దీని గురించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అందులోనూ మహిళలకు హైబీపీ ఎక్కువగా రాదని చాలా మంది అనుకుంటారు. కానీ, బీపీకి లింగబేధాలు లేవు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని 25 ఏళ్లు నిండిన పురుషుల్లో 23.1 మంది, మహిళల్లో 22.6 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారు.

అపోహ : రక్తదానం చేసిన తర్వాత శరీరంలో రక్తం తగ్గిపోతుంది.
నిజం : సాధారణంగా మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల దాకా రక్తం ఉంటుంది. రక్తదానం చేసినవారిలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే తగ్గుతుంది. వైద్యులు సూచించిన ఆహారం తీసుకుంటే కేవలం 24 నుంచి 48 గంటల్లోనే ఆ తగ్గుదలను పూర్తి చేసుకుంటుంది. రెండు రోజుల్లోనే మళ్లీ పూర్తిస్థాయిలో రక్తం చేరి, శరీరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.

అపోహ : చూయింగ్ గమ్‌ని మింగితే పొట్టలోనే అతుక్కుపోతుంది.
నిజం : చిన్నపిల్లలు ఎక్కువగా చూయింగ్ గమ్‌ని నములుతుంటారు. పొరపాటున దీన్ని మింగినా, అది జీర్ణశయానికి అంటుకోదు. చూయింగ్ గమ్‌ని కూడా అరిగించగల పవర్‌ఫుల్ ఆమ్లాలు మన కడుపులో ఉంటాయి. అందులో మిగిలిపోయిన చెక్కర, ఇతర ఆహార పదార్థాలు జీర్ణం కాగా మిగిలినదంతా వ్యర్థ పదార్థంలాగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి చూయింగ్ గమ్‌ను పొరపాటున మింగినా ఏమీ కాదు.

అపోహ : డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు వస్తాయి.
నిజం : ఇది కూడా పూర్తిగా అవాస్తవం. దీనిపై ది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 1969లోనే ఒక ప్రయోగం చేశారు. నెల రోజులపాటు కొందరు యువతులకు చాక్లెట్లు, మరికొందరికి మామూలు మిఠాయిలు తినిపించారు. తర్వాత వారి ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలను లెక్కించినా ఎలాంటి తేడా రాలేదని గుర్తించారు. వారి చర్మ నాణ్యతలో కూడా ఎటువంటి మార్పు కలగలేదని గమనించారు.

అపోహ : మరణించిన తర్వాత కూడా మనిషి గోళ్లు, వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి.
నిజం : కెరాటిన్ అనే పదార్థం వల్లే మనిషి గోళ్లు, వెంట్రుకలు తయారవుతాయి. వ్యక్తి మరణించిన తర్వాత అతని శరీరంలో జరిగే అన్ని క్రియలూ నిలిచిపోతాయి. కొత్తగా కణజాల నిర్మాణానికి ఏమాత్రం అవకాశం ఉండదు. దీంతో పాటు కెరాటిన్ ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. కాబట్టి గోళ్లు, వెంట్రుకలు పెరిగే అవకాశం లేదు. కానీ, మనిషి చనిపోయిన తర్వాత శరీరం మొత్తం తేమ కోల్పోయి ముడుచుకుపోవడం వల్ల గోళ్లు, వెంట్రుకలు పెద్దవిగా కనిపిస్తాయి అంతే.

అపోహ : ఒకసారి ఇన్సులిన్ తీసుకోవడం ప్రారంభిస్తే జీవితాంతం తీసుకోవాలి.
నిజం : అవసరమైనప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన ఇన్సులిన్ అంటే చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యంగా ఒకసారి దీన్ని తీసుకోవడం మొదలు పెడితే జీవితాంతం ఇంజక్షన్లు తీసుకుంటూనే ఉండాలని అపోహపడుతుంటారు. నిజానికి ఇన్సులిన్‌ను జీవితాంతం కాకుండా జీవితం అంతం కాకుండా ఉండేందుకు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చిందంటే మధుమేహం బాగా ముదిరిపోయిందని కూడా కొందరు వణికిపోతుంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు.

అపోహ : పన్ను తీయించుకుంటే కంటి సమస్యలు వస్తాయి.
నిజం : ఏదైనా సమస్య వచ్చి నోటిలో పళ్లను తీయించుకుంటే కంటి చూపుపై ప్రభావం పడుతుందని అనేక మంది అపోహ పడుతుంటారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. అసలు కంటికి.. పంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇదే నిజమైతే రకరకాల దంత సమస్యలతో పళ్లు పీకించుకునేవారికి అంధత్వం వచ్చి ఉండేది కదా..

అపోహ : వెన్ను నొప్పి ఉన్నవారు కుర్చీలో ఎప్పుడూ నిటారుగానే కూర్చోవాలి.
నిజం : కుర్చీలో ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకకు హాని కలుగుతుందనేది నిజమే. కానీ, చాలాసేపటి దాకా పూర్తి నిటారుగా కూర్చున్నా కూడా ప్రమాదమే. అలా కూర్చోవడం వల్ల వెన్నెముక త్వరగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి, ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తే కుర్చీ వెనకభాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగడం మంచిది. కాళ్లు నేలను తాకేలా చూసుకోవాలి.

అపోహ : గుడ్డును ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.
నిజం : గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని, దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ, అది చాలా తప్పు. గుడ్డులో కొలెస్ట్రాల్ తక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి కొవ్వును చేరనివ్వదు. గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇందులో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications











