Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?
మనవాళ్లు సరదాగా చేతులు చూసి.. ఆ వ్యక్తికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎంత మంది పిల్లలు, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, డబ్బులు ఉంటాయా, చదువులో రాణిస్తారా, ఉద్యోగంలో సక్సెస్ అవుతారా వంటి విషయాలను చెబుతూ ఉంటారు. అయితే ఏదో సరదాగా చెబుతున్నారులే అనుకుంటారు. కానీ.. పురాణాల ప్రకారం అరచేయి చూసి భవిష్యత్ ని అంచనా వేయడాన్ని పామిస్టరీ అని పిలుస్తారు. ఈ శాస్త్రాన్ని మన పూర్వీకులు బాగా నమ్మేవాళ్లు.
ఈ పామిస్టరీ ఆర్ట్.. మన ఇండియాలోనే కాదు.. టిబెట్, చైనా, పర్షియా, సుమెరియా, ఇజ్రాయిల్, బాబీలోనియా వంటి దేశాల్లో చాలా కామన్. చేతి రాతలు చదివేవాళ్లు సాధారణంగా 5 గీతలపై ఫోకస్ పెడతారు. లైఫ్, హార్ట్, ఫేట్, మ్యారేజ్, హెడ్ అనే ఈ 5 గీతల ఆధారంగానే భవిష్యత్ అంచనా వేస్తారు. అయితే చేతిపై అర్థచంద్రాకారం చాలా అరుదుగా ఉంటుంది.
అంటే రెండు చేతులను ఒకదాని పక్కన మరొకటి పెట్టినప్పుడు.. రెండు చేతల్లోని హార్ట్ లైన్ కలిసి... అర్ధచంద్రాకారం ఏర్పడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది ? ఎలాంటి ఫలితాలు, నష్టాలు ఉంటాయి ? అనేది తెలుసుకోవచ్చట. మరి రెండు చేతులు కలిపినప్పుడు మీకు ఎలాంటి ఆకారం వస్తుంది, ఆ ఆకారం మీ భవిష్యత్ ని, మీ వ్యక్తిత్వాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం..

వేళ్లు
బొటనవేలు కాకుండా.. మిగిలిన నాలుగువేళ్లు.. భూమి, నీళ్లు, అగ్ని, గాలికి సంకేతంగా భావిస్తారు.

5గీతలు
చేతిలో ఉండే 5 గీతలు చాలా ముఖ్యమైనవి. లైఫ్, హార్ట్, ఫేట్, హెడ్, మ్యారేజ్ లైన్స్ ఆధారంగా ఫ్యూచర్ అంచనా వేస్తారు.

హార్ట్ లైన్
చిటికెన వేలు కిందివైపు మొదలై.. చూపుడు వేలు వరకు ఉండే దాన్ని హార్ట్ లైన్ అంటారు. దీన్నే లవ్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వ్యక్తి ఎమోషన్, శారీరక సంబంధాలను వివరిస్తుంది.

ఒక్కొక్కరికి ఒక్కోలా
ఈ హార్ట్ లైన్ ని రెండు చేతుల్లోనూ గమనిస్తే.. ఒకేలా ఉంటాయి. కొంతమందికి వేరుగా కూడా ఉంటాయి. ఈ హార్ట్ లైన్ ఒక్కొక్కరికి ఒకోలా ఉండటమే కాదు.. ఒకే వ్యక్తికి ఒక్కో చేతిలో ఒక్కోలా కూడా ఉంటుంది.

అర్ధచంద్రాకారం
మీ రెండు అరచేతులను దగ్గరకు కలిపినప్పుడు.. రెండు చేతుల్లోని హార్ట్ లైన్ కలిస్తే.. అది ఒక్కొక్కరికి ఒక్కో షేప్ లో కనిపిస్తుంది. స్ట్రెయిట్ గా లేకుండా ఉండటం, స్ట్రెయిట్ గా లైన్ ఏర్పడటం, అర్థచంద్రాకారంలో.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఏర్పడుతుంది.
Image Courtesy

ఒకవేళ స్ట్రెయిట్ గా కనిపిస్తే
రెండు చేతులను కలిపినప్పుడు రెండు చేతుల హార్ట్ లైన్ కలిసి.. ఒక గీతలా స్ట్రెయిట్ గా ఏర్పడితే.. 180 డిగ్రీల కోణంలో గీత ఉంటే.. వాళ్లు చాలా ప్రశాతంత తత్వం కలిగి ఉంటారు. జాలి కలిగినవాళ్లై ఉంటారు. సున్నితస్వభావం కలిగి ఉంటారు.

పెళ్లి
ఇలా స్ట్రెయిట్ లైన్ ఉన్నవాళ్లు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ చూపించిన సంబంధంతో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు.

అస్తవ్యస్తంగా ఉంటే
రెండు హార్ట్ లైన్స్ ని ఒకదగ్గర చేర్చినప్పుడు.. సక్రమంగా గీత ఏర్పడకుండా.. అస్తవ్యస్తంగా లైన్ ఏర్పడితే.. వాళ్లు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విభిన్నమైన దారుల్లో పోతూ ఉంటారు. ఒక పద్ధతి పాటించరు. ప్రతి ఒక్కరినీ.. తమకు క్లోజ్ గా ఉంచుకోవడానికి చాలా కష్టపడతారు.

పెళ్లి
ఇలాంటి అస్తవ్యస్తమైన గీత ఉన్న వాళ్లు 80 శాతం.. వాళ్ల కంటే.. కొద్దిగా పెద్దవాళ్లను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే అవకాశాలుంటాయి.

అర్ధచంద్రాకారం ఏర్పడితే
రెండు చేతుల హార్ట్ లైన్ కలిపినప్పుడు.. అర్ధచంద్రాకారం ఏర్పడితే.. చాలా స్ట్రాండ్ మైండ్ కలిగి ఉంటారు. స్వీయ దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అర్ధచంద్రాకారంలో గీత ఏర్పడిన వాళ్లు చాలా ప్రేమగా ఉంటారు. సముద్రంలోతు కంటే ఎక్కువ ప్రేమను పంచగలరు. కానీ.. ఇతరుల నుంచి ఏమీ ఆశించరు.
Image Courtesy

ఆకర్షణ
హాఫ్ మూన్ షేప్ లో గీత ఏర్పడే వాళ్లు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. వీళ్లు తమ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ తోనే జీవితం పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మ్యారేజ్ లైన్
మ్యారేజ్ లైన్ లో మీ భవిష్యత్ గురించి కొన్ని సీక్రెట్స్ ని దాగున్నాయి. గీతల పొడవు, చెయిన్స్ వంటివి మీ మ్యారేజ్ లైఫ్ గురించి చాలా వివరిస్తాయి. అలాగే లవ్ లైఫ్ ని కూడా వివస్తాయి.

మ్యారేజ్ లైన్ 1
చిన్న చిన్న గీతలు చాలా ఉండి.. 4 నుంచి 5 గీతలుంటే.. మీరు ఒకసారి కంటే.. ఎక్కువ సార్లు పెళ్లి చేసుకుంటారని కాదు. కాబట్టి.. రిలాక్స్ గా ఉండండి.

మ్యారేజ్ లైన్ 2
ఒక వేళ రెండు మందంగా ఉన్న గీతలు ఉండి.. వాటిలో ఒకటి పొడవుగా, మరొకటి చిన్నగా ఉంటుంది. ఇలా ఉంటే.. పొడవు లైన్ మీ మ్యారేజ్ గురించి, చిన్న లైన్ తెగిపోయిన బంధం గురించి వివరిస్తుంది.

మ్యారేజ్ లైన్ 3
మీ మ్యారేజ్ లైన్ మిగిలిన చిన్న గీతల కంటే.. పొడవుగా లేదా పొట్టిగా ఉంటే.. మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని తెలుపుతుంది.

మ్యారేజ్ లైన్ 4
ఒక వేళ మ్యారేజ్ లైన్ దగ్గర నల్లమచ్చ లేదా క్రాస్ గుర్తు ఉందంటే.. మీ వివాహ బంధంలో చెడు జరుగబోతోందని సూచిస్తుంది. ఒకవేళ డైవర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications











