Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ రాశిని బట్టి ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు..!తినకూడని ఆహారాలు..!
జ్యోతిష్య శాస్త్రం జాతకులు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్ని కూడా చెప్పేస్తుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే జాతకుల ఆరోగ్యానికి అనుకూలిస్తుందనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. సాధారణంగా జ్యోతిష్యం అగ్ని, భూమి, గాలి, నీరు అనే నాలుగు అంశాల ఆధారంగా పనిచేస్తుంది.
మేషం, సింహం, ధనుస్సు రాశులకు అగ్నిదేవుడు.. మిథునం, తులా, కుంభ రాశులకు వాయుదేవుడు, కర్కాటకం, వృశ్చికం, మీన రాశులకు వరుణదేవుడు ఆధిపత్యం వహిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే భూమి వృషభం, కన్య, మకర లగ్నకారులకు ఆధిపత్యం వహిస్తుంది.
ఇందులో అగ్నిదేవుడి ఆధిపత్యంతో కూడిన మిథునం, తులా, కుంభ రాశులకు చెందిన జాతకులు ధైర్యవంతులుగా ఉంటారు. వీరిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ప్రాంతానికి తగ్గట్టు వీరి శరీరం అలవాటు పడుతుంది. అయితే అజీర్ణ సమస్య వీరిని వేధిస్తుంది.
వేడి చేసే వస్తువులు వీరికి ఏమాత్రం పడవు. అసిడిటీ వంటి రోగాలతో బాధపడతారు. అందుచేత ఎప్పుడూ మితమైన ఉష్ణోగ్రతతో కూడిన ప్రదేశాల్లో జీవించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాల్లో ఈ జాతకులు జీవించడం మంచిది కాదని వారు సలహా ఇస్తున్నారు. అలా ఒక్కొక్క రాశిని బట్టి ఏయే రాశి వాళ్ళు ఎలాంటి ఆహారాలు తినాలి. ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం.

తులారాశి వారు:
తినాల్సిన ఆహారాలు: తృణధాన్యాలు, ఓట్స్, ఆపిల్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, ఎండు ద్రాక్ష, ఆవిరిలో ఉడికించిన వెజిటేబుల్స్, ఆకుకూరలు, టమోటోలు, పచ్చిబఠానీలు, క్యారెట్స్, మొక్కజొన్న, నాన్ డైరీ చీజ్, పెరుగు, నట్స్ మరియు బాదంలు.
తినకూడని ఆహారాలు: ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఈస్టీ ఫుడ్స్ .

మీన రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
ఆపిల్స్, గ్రేప్స్, ఆరెంజెస్, లెమన్, పీచెస్, ప్లమ్, స్టీమ్ చేసిన వెజిటేబుల్స్, ఆకు కూరలు, ఉల్లిపాయలు, సీవీడ్(సముద్రపు ఆహారం) బీన్స్, డేట్స్, మరియు నేచురల్ షుగర్స్ .
తినకూడని ఆహారాలు:
కాఫీ, ఆయిల్ ఫుడ్స్, ఈస్టీఫుడ్స్, ఆస్పరాగస్, సాల్ట్

కుంబరాశి వారు:
తినాల్సిన ఆహారాలు :
ఆపిల్స్, ఆరెంజె, బేరిపండ్లు, స్టీమ్ చేసిన వెజిటేబుల్స్, క్యాబేజ్, సెలరీ, కార్న్, క్యారెట్, టమోటోలు, బ్రొకోలీ, సోయా యోగ్రర్ట్, నట్స్, డేట్స్, ఫిగ్స్, వెల్లుల్లి, అల్లం ఇంకా ప్రోటీన్ బార్స్ తొనొచ్చు.
తినకూడని ఆహారాలు:
కాఫీ, ఈస్టీ ఫుడ్స్, మరియు రిఫైండ్ షుగర్స్ తినకూడదు.

మకర రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
అన్నం, ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూస్ లు, ఆరెంజ్, లెమన్స్, వెజిటేబుల్స్ విత్ స్పైసీస్, క్యాబేజ్ , కార్న్, బంగాళదుంపలు, మొలకలు, సూప్స్, టీ, పీనట్స్, ఫిగ్స్ (అంజూర), ఫ్లాక్ సీడ్స్ .
తినకూడని ఆహారాలు :
ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం వల్ల వీరి శరీరానికి మంచిది. ఎక్కువ క్వాంటీటి మరియు రిచ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అదే విధంగా ఎక్కువ కారం తినకపోవడం మంచిది.

ధనుస్సు రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
తృణధాన్యాలు, తృణధాన్యాలతో తయారుచేసిన సెరల్స్, బేరిపండ్లు, ఆపిల్స్, ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, రూట్ వెజిటేబుల్స్, (బంగాళదుంప, క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి), ఉల్లిపాయలు, ఆలివ్స్, ఫిగ్స్, వెల్లుల్లి తినవచ్చు.
తినకూడని ఆహారాలు :
స్పైసీ ఫుడ్స్, స్వీట్స్, రిఫైండ్ షుగర్ మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
ఫ్రూట్స్, అరటిపండ్లు, బ్లాక్ చెర్రీస్, కొబ్బరి, ఆవిరిలో ఉడికించిన వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, లీక్స్ , కాలీఫ్లవర్స్, ఉల్లిపయాలు, ముల్లంగి, టమోటోలు, ఆస్పరాగస్, కీరదోసకాయలు, బీట్ రూట్స్, బీన్స్ , లెంటిల్స్, మరియు బాదం తినవచ్చు.
తినకూడని ఆహారాలు :
ఆయిల్ ఫుడ్స్, ఈస్టీ ఫుడ్స్, ఉప్పు, స్వీట్స్

కన్య రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
తృణధాన్యాలు, మరియు సెరల్స్, ఓట్స్, ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూస్ లు, లెమన్ జ్యూస్, అరటిపండ్లు, ఆరెంజెస్, ఆకుకూరలు, వెజిటేబుల్స్, మొలకలు, సూప్స్, టీలు, మరియు బాదం
తినకూడని ఆహారాలు:
ఏ ఆహార పదార్థాలైనా సరే మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తినకూడదు. చాక్లెట్స్ కు దూరంగా ఉంటే మంచిది.

సింహ రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
తృణధాన్యాలు, అన్నం, సిట్రస్ ఫ్రూట్స్, ఆపిల్స్, పీచెస్, రూట్ వెజిటేబుల్స్ (బంగాళదుంప, క్యారెట్, ముల్లంగి)ఆకుకూరలు, బ్రొకోలీ, బిట్టర్ గ్రీన్స్(కాకరకాయ, సొరకాయ), బాదం, డ్రై నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, మరియు ఫిగ్స్(అజూర).
తినకూడని ఆహారాలు :
స్పైసీ ఫుడ్స్ , డైరీ ప్రొడక్ట్స్, ఆల్కహాల్

కర్కాటక రాశి వారు :
తినాల్సిన ఆహారాలు:
తృణధాన్యాలు, గోధుమలు, రైస్, ఓట్స్, ఫ్రూట్స్, అరటిపండ్లు, ఆవిరి మీద ఉడికించే వెజిటేబుల్స్, బ్రొకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, టమోటోలు, బీట్ రూట్, గుమ్మడి, కీరదోసకాయ, సీవీడ్ , పెరుగు, బీన్స్, మరియు నేచురల్ షుగర్స్
తినకూడని ఆహారాలు:
ఆయిల్ ఫుడ్స్, ఉప్పు, స్వీట్స్, మరియు రిఫైండ్ షుగర్స్ తినకూడదు.

మిథున రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
ప్లమ్స్, ఆరెంజెస్, ద్రాక్ష, గ్రేప్ జ్యూస్, ద్రాక్ష, ఆపిల్స్, లెట్యూస్, కాలీఫ్లవర్, ఆకుకూరలు, క్యారెట్స్, సెలరీ, గ్రీన్ బీన్స్, టమోటోలు, పెరుగు, బాదం, కేయాన్ పెప్పర్, అల్లం, వెల్లుల్లి.
తినకూడని ఆహారాలు:
కాఫీ, రూట్ వెజిటేబుల్స్, ఈస్టీ ఫుడ్స్ తినకూడదు.

వృషభ రాశి వారు:
తినాల్సిన ఆహారాలు:
క్రాన్ బెర్రీస్, ఆస్పరాగస్, బీట్ రూట్స్, కాలీఫ్లవర్, కీరదోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, ముల్లంగి, గుమ్మడి, నట్స్, బీన్స్, హార్స్ రాడిష్ .
తినకూడని ఆహారాలు:
రిచ్ అండ్ హెవీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

మేష రాశి వారు :
తినాల్సిన ఆహారాలు:
బ్రౌన్ రైస్, అరటిపండ్లు, ఫ్రూట్ జ్యూస్ లు, ఆలివ్స్, టమోటోలు, ఉల్లిపాయలు, లెట్యూస్, కాలీఫ్లవర్, కీరదోసకాయ, ఆకుకూరలు, ముల్లంగి, బ్రొకోలీ, బీన్స్, లెంటిల్స్, గుమ్మడి, వాల్ నట్స్, అంజూర, డ్రై ఆప్రికాట్, వెల్లుల్లి, ఆవాలు.
తినకూడని ఆహారాలు:
స్పైసీ ఫుడ్స్, ఉప్పు మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications