Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జీన్స్ ప్యాంట్లకి ఆ బుల్లి పాకెట్ ఎందుకో తెలుసా ?
మీ జీన్స్ ని బాగా గమనించారా ? దానికి ఉండే చిన్న పాకెట్ గురించి ఎప్పుడూ డౌట్ రాలేదా ? ఇంత చిన్న పాకెట్ ఎందుకు పెడతారన్న అనుమానం, ఆశ్చర్యం కలుగలేదా ? అది ఉండటానికి కారణమేమై ఉంటుంది. ఈ ఐడియా ఎప్పుడు, ఎలా పుట్టింది ?
ఈ చిన్న పాకెట్ గురించి చాలా చారిత్రక కారణాలున్నాయి. ప్రతి జీన్స్ కి ఈ చిన్న జేబులు ఉండటం వెనక ఆసక్తికర విషయాలను ఇప్పుడు వివరించబోతున్నాం.
ఈ చిన్న పాకెట్ లో ఎలాంటి వస్తువులు, విలువైన వస్తువులు పెట్టుకోవడానికి రావు. కాబట్టి.. ఈ చిన్న జేబు అందరినీ అయోమయానికి గురిచేస్తుంది. ఈ జేబు సైజ్ చాలా చిన్నగా ఉండటమే కారణం.

రీజన్ 1
1800లలో కౌబాయ్ కల్చర్ నడిచేది. అంటే డ్రెస్సింగ్ అంతా కౌబాయ్ లా ఉండేది. టోపీ, జాకెట్, షూస్ లతో పాటు.. జీన్స్ లకు చిన్న పాకెట్ ఉండేది.

రీజన్ 2
పాకెట్ వాచులు ఉపయోగించేవాళ్లు. వాటిని భద్రపరుచుకోవడానికి ఈ పాకెట్స్ ఉండేవట. ఈ జేబులను.. వాచ్ పాకెట్ అని పిలుస్తారు.

రీజన్ 3
పాకెట్ వాచెస్ కనుమరుగైన తర్వాత.. ఆ జేబుని రకరకాల వాటికి ఉపయోగిస్తున్నారు. బస్ టికెట్లు పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతోంది.

రీజన్ 4
ఒకప్పుడు కండోమ్ పాకెట్ గా ఉపయోగించేవాళ్లట.

రీజన్ 5
ఇవన్నీ కాకుండా.. ఈ చిన్న జేబులను కాయిన్స్ దాచుకోవడానికి ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు. ఇది కాస్త హెల్ప్ ఫుల్ గా ఉంది కదూ..

రీజన్ 6
భద్రంగా ఉంటుందని... కీ చైన్ లేకుండా ఉండే కీ ఉన్నా.. ఎస్డీ కార్డు, సిమ్ కార్డు, యూఎస్బీ వంటి చిన్నచిన్నవెన్నో ఆ బుల్లి పాకెట్ లో వేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications